వెస్ట్ కామెంగ్ జిల్లా

అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా

వెస్ట్ కామెంగ్ జిల్లా, భారతదేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[2] రాష్ట్రం మొత్తం వైశాల్యంలో ఈ జిల్లా వైశాల్యం 8.86% ఉంది. ఈ జిల్లాలో కామెంగ్ నది ప్రవహిస్తున్న కారణంగా ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. కామెంగ్ నది బ్రహ్మపుత్ర నదికి ఉపనది.

వెస్ట్ కామెంగ్ జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ పటంలో వెస్ట్ కామెంగ్ జిల్లా స్థానం
అరుణాచల్ ప్రదేశ్ పటంలో వెస్ట్ కామెంగ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
ముఖ్య పట్టణంబొమ్డిలా
విస్తీర్ణం
 • మొత్తం7,422 km2 (2,866 sq mi)
జనాభా
 (2011)
 • మొత్తం87,013[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత69.4%[1]
 • లింగ నిష్పత్తి755[1]
Websiteఅధికారిక జాలస్థలి
సెలా పాస్ దగ్గర సెలా సరస్సు

చరిత్ర

కామెంగ్ నది పరిసర ప్రాంతాలు మాన్ (సంప్రదాయ ప్రజల) సామ్రాజ్యం, భూటాన్, టిబెట్, అహోం ల ఆధీనంలో ఉంటూ వచ్చింది. 7వ శతాబ్దంలో గిరిజనుల మద్య లమైస్ం స్థిరంగా కాలూనింది. అందువలన మార్ష్ంగ్ వద్ద కచన్ లామా లగ్యాల గోంపా నిర్మించాడు. ఎప్పుడైతే చక్రవర్తులు బలహీన పడతారో అప్పుడప్పుడు ఈ ప్రాంతపు సామంతులు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం సాగిస్తూ ఉండేవారు. అందుకు భలూక్పాంగ్ వద్ద 10-12 శతాబ్ధాలలో నిర్మించబడి ప్రస్తుతం శిథిలమైన కోట, పొరుగు రాజ్యాల నుండి రక్షించుకోవడానికి 17వ శతాబ్దంలో నిర్మించబడిన డరాంగ్ కోట సాక్ష్యంగా ఉన్నాయి. బ్రిటిష్ భారతదేశంలోకి ప్రవేశించిన తరువాత ఈ ప్ర్రంతం మొత్తం ఈశాన్య సరిహద్దు ఏజన్సీగా మార్చబడింది. 1919లో తరువాత ఇది " బలిపరా సరిహద్దు ట్రాక్ట్ "గా పేరు మార్చబడింది. దీనికి అస్సాం లోని చార్దుయర్ కేంద్రంగా ఉంటూ వచ్చింది. 1946లో బలిపరా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. అప్పుడు ఈ ప్ర్రంతానికి " సెలా సబ్ ఏజంసీ " అని పేరుపెట్టబడింది. దీనికి అస్సాం లోని చార్దుయర్ కేంద్రంగా ఉంటూ వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత " సెలా సబ్ ఏజంసీ "కి " కమెంగ్ ఫ్రాంటియర్ డివిషన్ " అని నామాంతరం చేయబడింది. 1954లో జిల్లా కేంద్రం బొండిలాకు మార్చబడింది. 1950లో టిబెట్ మీద దండయాత్ర జరిగిన సమయంలో టిబెటన్ ఆశ్రితుల రాకతో ఈ ప్రాంతం జనసమ్మర్ధం అయింది. తరువాత చైనీయుల దాడి జరిగినప్పుడు పలు స్మారకచిహ్నస్లు ధ్వంశం చేయబడ్డాయి. తరువాత ది కమెంగ్ ఫ్రాంటియర డివిషన్‌కు కమెంగ్ జిల్లా అని నామకరణం చేయబడింది. తరువాత రాజకీయ కారణాల వలన 1980 జూన్ 1 న ఈ జిల్లా తూర్పు కమెంగ్, పశ్చిమ కమెంగ్ జిల్లాలుగా మార్చబడింది.[3] ఒకప్పుడు ఈ జిల్లాలో భాగంగా ఉన్న తవాంగ్ 1984 అక్టోబరు 6 నుండి జిల్లాగా రూపొందించబడింది.[3]

భౌగోళికం

పశ్చిమ కమెంగ్ జిల్లా వైశాల్యం 7,442చ.కి.మీ.[4] ఇది పపుయా న్యూ గునియాలోని న్యూఐర్లాండ్ ద్వీపం వైశాల్యానికి సమానం.[5] 26° 54' నుండి 28° ఉత్తర అక్షాంశాలు, 91° 30' నుండి 92° 40' దక్షిణ రేఖాంశాల మధ్య ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో టిబెట్ దేశంతో, పశ్చిమ సరిహద్దులో భూటాన్ దేశంతో, ఈశాన్య సరిహద్దులో తవాంగ్ జిల్లా, తూర్పు సరిహద్దులో ఈస్ట్ కమెంగ్ జిల్లాలతో సరిహద్దులు పంచుకుంట్జుంది. దక్షిణ సరిహద్దులో సోనిత్‌పూర్ జిల్లా, అస్సాం రాష్ట్రంలోని ఉదల్గురి జిల్లా ఉన్నాయి. జిల్లాలో " ది ఈగల్ నెస్ట్ వన్యప్రాణి అభయారణ్యం " ఉంది.

జనాభా గణాంకాలు (2011)

2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లాలో మొత్తం జనాభా 83,947. వీరిలో 46,155 మంది పురుషులు, 37,792 మంది స్త్రీలు ఉన్నారు. జిల్లాలో మొత్తం 18,159 కుటుంబాలు ఉన్నాయి.[6] జిల్లా సగటు లింగ నిష్పత్తి 819.

జిల్లా మొత్తం జనాభాలో 19% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 81% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 78.2% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 64.4% ఉంది. జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 909 కాగా, గ్రామీణ ప్రాంతాల వారిది 799గా ఉంది

జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 11643, ఇది మొత్తం జనాభాలో 14%. 0-6 సంవత్సరాల మధ్య 5900 మంది మగ పిల్లలు ఉండగా, 5743 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా పిల్లల లింగ నిష్పత్తి 973గా ఉంది, ఇది పశ్చిమ కమెంగ్ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (819) కంటే ఎక్కువ.

పశ్చిమ కమెంగ్ జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 67.07%. పశ్చిమ కమెంగ్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 64.06% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 50.08%గా ఉంది.

భూతత్వం

పశ్చిమ కమెంగ్ జిల్లా భూమి అధికంగా పర్వతమయంగా ఉంటుంది. పశ్చిమ కమెంగ్ జిల్లా హిమాలయాలతో నిండి ఉంటుంది. జిల్లాలో కంగ్టే శిఖరం అత్యధిక ఎత్తైనదిగా గురింపు పొందింది.

వాతావరణం

తూర్పు కమెంగ్ జిల్లాలోలా పశ్చిమ కమెంగ్ జిల్లాలో చల్లని ఉష్ణోగ్రత ఉంటుంది. నవంబరు మద్య నుండి ఫిబ్రవరి వరకు హిమాపాతం ఉంటుంది. కుపి, బొండిల, నెచిపు లలో మంచు కురుస్తూ ఉంటుంది. 5690 అడుగుల ఎత్తులో ఉన్న నిచిపో జిల్లాలో ఎత్తైన భుభాగంగా గుర్తించబడుతుంది.

ఆర్ధికం

మిగిలిన అరుణాచల ప్రదేశ్ వ్యవసాయ భూముల లాగా పశ్చిమ కమెంగ్ జిల్లాలోని దిగువభూములలో జుం లేక షిఫ్టింగ్ కల్టివేషన్ వాడుకలో ఉంది. ఇక్కడ ఉపౌష్ణమండల ఉష్ణోగ్రత వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. జిల్లాలో కూడా హార్టికల్చర్ కూడా అధికంగా ఉంది. జిల్లాలో కుటీరపరిశ్రమలు, హస్తకళలు, వస్త్రాల తయారీ పరుశ్రలు కూడా గుర్తించతగినతగా ఉన్నాయి.

పరిపాలనా విభాగాలు

ఉప విభాగాలు

  • పశ్చిమ కమెంగ్ జిల్లా 3 ఉప విభాగాలుగా విభజించబడింది:- తిరుజినో, రూపా (అరుణాచల ప్రదేశ్), బోమ్‌దిలా.

తాలూకాలు లేదా తహసీల్స్

  • ఇవి అదనంగా 12 అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్‌గా విభజించబడ్డాయి:- డిరాంగ్, బొండిలా, కలక్తాంగ్, బలెము, భకుక్పాంగ్, జమెరి, సించంగ్, ంఫ్ర, త్రిజినో, రూపా, షెర్గాన్.

బ్లాకులు

  • జిల్లా 4 డెవెలెప్మెంటు విభాగాలుగా విభజించబడింది:- డిరాంగ్, కలక్తంగ్, నఫ్ర-బురగోయన్, త్రిజినో.

శాసన వ్యవస్థ

2001 లో గణాంకాలు

విషయాలువివరణలు
జిల్లా జనసంఖ్య .87,013, [1]
ఇది దాదాపు.ఆంటిగువా ఆండ్ బార్బడా దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని.నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో.618వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత.12 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం.16.64%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి.755:1000 [1]
జాతీయ సరాసరి (928) కంటే.తక్కువ
అక్షరాస్యత శాతం.69.4%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.తక్కువ

పశ్చిమ కమెంగ్ జిల్లా 5 ప్రధాన గిరిజనజాతులు ఉన్నాయి:- మొంప ప్రజలు (78%), డిరాంగ్, భుట్, లిష్, కలక్తంగ్ (మొంప), మిజి (సజోలాంగ్), షెర్‌డ్యుక్పెన్, అక (హర్సొ), ఖోవల్ (బుగన్) జాతులు ఉన్నాయి. అల్పసంఖ్యాకులలో తక్ప, లిషిప, చుగ్ప, బుట్ప.

భాషలు

అల్పసంఖ్యాకులు మాట్లాడే భాషలు:-

  • పురోయిక్ భాష.
  • హర్సో భాష. (అక)
  • మిజి భాష.
  • ఖో-బ్వా భాష.
  • ఖోవాభాష (బుగన్)
  • ధెర్డుక్పెన్ భాష.
  • సర్తాంగ్ భాష.
  • లిష్ భాష. (చంగ్)
  • బోదిష్ భాష.
  • బ్రొక్ప భాష.
  • త్షంగ్ల భాష

జిల్లా నివాసులలో బౌద్ధులు. అక, ఖొవా, మిజి స్థానిక మతాలను అనుసరిస్తున్నారు. వీరు బుద్ధిజం, హిందూయిజం, జ్డొన్యి-పొలో మతాలమిశ్రిత మతాన్ని అనుసరిస్తున్నారు. ఇది ఒక తరహా అనిమిజం అని చెప్పచ్చు.

వృక్షజాలం, జంతుజాలం

1989లో పశ్చిమకమెంగ్ జిల్లాలో 217 చ.కి.మీ వైశాల్యంలో " ఈగిల్ నెస్ట్ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ) ఏర్పాటు చేయబడింది.[9]1989 అంతే కాక జిల్లాలో 100చ.కి.మీ వైశాల్యంలో " సీసా ఆర్చిడ్ వన్యప్రాణి అభయారణ్యం " కూడా ఏర్పాటు చేయబడింది.100 km2 (38.6 sq mi).[9]

మూలాలు

భౌగోళిక స్థితి

వెలుపలి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు