శత్రుఘ్న సిన్హా

భారతీయ నటుడు మరియు రాజకీయ నాయకుడు

శత్రుఘ్న ప్రసాద్ సిన్హా (జననం: 1945 డిసెంబరు 9[4]) ఒక భారతీయ చలనచిత్ర నటుడు, రాజకీయవేత్త. ఇతడు లోక్‌సభ సభ్యుడిగా (2009–2014, 2014–2019), రాజ్యసభ సభ్యుడిగా రెండేసి పర్యాయాలు ఎన్నికవడమే కాక, అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి (2003 జనవరి-2004 మే)గా, నౌకా రవాణా మంత్రి (2004 ఆగస్టు)గా పనిచేశాడు.[5] 2016లో ఇతని జీవితచరిత్ర ఎనీథింగ్ బట్ ఖామోష్ విడుదలయ్యింది.

శతృఘ్న సిన్హా
పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
In office
2009–2019
తరువాత వారురవి శంకర్ ప్రసాద్[1]
నియోజకవర్గంపాట్నా సాహిబ్ నియోజకవర్గం
ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ
In office
22 జూలై 2002 – 29 జనవరి 2003
ప్రధాన మంత్రిఅటల్ బిహారీ వాజపేయి
కేంద్ర క్యాబినెట్ మంత్రి, షిప్పింగ్
In office
30 జనవరి 2003 – 22 మే 2004
ప్రధాన మంత్రిఅటల్ బిహారీ వాజపేయి
పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ
In office
1996–2008
నియోజకవర్గంబీహార్
వ్యక్తిగత వివరాలు
జననం (1945-12-09) 1945 డిసెంబరు 9 (వయసు 78)
పాట్నా, బిహార్, బ్రిటీషు ఇండియా
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్ (2019 నుండి)
ఇతర రాజకీయ
పదవులు
భారతీయ జనతా పార్టీ (2019 వరకు)
జీవిత భాగస్వామి
సంతానంసోనాక్షి సిన్హా
లవ్ సిన్హా
కుశ్ సిన్హా
తల్లిదండ్రులుబి.పి.సిన్హా[2]
శ్యామా సిన్హా
కళాశాలFTII, పూణే
వృత్తినటుడు, రాజకీయ నాయకుడు
మారుపేరుషాట్‌గన్
శత్రు[3]

తొలినాళ్ళు

శత్రుఘ్న సిన్హా బిహార్ రాష్ట్రంలోని పాట్నా నగరంలో భువనేశ్వరి ప్రసాద్ సిన్హా, శ్యామాదేవి సిన్హా దంపతులకు జన్మించాడు.[6] ఆ దంపతుల నలుగురు సంతానంలో ఇతడు చివరివాడు. ఇతని అన్నలు రామ్‌, లక్ష్మణ్, భరత్‌ సిన్హాలు.ఇతడు పాట్నా సైన్స్ కాలేజీలో చదువుకున్నాడు.[5] ఇతడు పూణే లోని ఫిల్మ్‌ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్వవిద్యార్థి.[7] ప్రస్తుతం ఈ విద్యాసంస్థలో చదివే డిప్లొమా విద్యార్థులకు ఇతని పేరుమీద ఉపకారవేతనం ఇస్తున్నారు.[8] పూణేలో శిక్షణ పొందిన తర్వాత ఇతడు ముంబై వెళ్లి చిత్రపరిశ్రమలో చేరాడు.[5] ఇతడు మాజీ మిస్ ఇండియా, సినిమానటి పూనమ్‌ సిన్హాను వివాహం చేసుకున్నాడు.

నట జీవితం

ఇతనికి దేవానంద్ తీసిన ప్రేమ్‌ పూజారి సినిమాలో పాకిస్తానీ మిలటరీ ఆఫీసర్ పాత్ర ద్వారా తొలి అవకాశం లభించింది. తర్వాత 1969లో మోహన్ సెహగల్ సినిమా సాజన్‌లో పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. ప్రేమ్‌ పూజారి సినిమా విడుదల ఆలస్యం కావడంతో సాజన్ ఇతని తొలి సినిమా అయ్యింది. తర్వాత ఇతడు ప్యార్ హీ ప్యార్, బన్‌ఫూల్, రామ్‌పూర్‌కా లక్ష్మణ్, భాయ్ హోతో ఐసా, హీరా, బ్లాక్‌మెయిల్ మొదలైన సినిమాలలో దుష్టపాత్రలను ధరించాడు. ఇంకా అనేక చిత్రాలలో సహాయక పాత్రలు ధరించాడు. 1970-75ల మధ్య ఇతడు హీరోగా నటించిన సినిమాలు అంతగా విజయవంతం కాలేదు. హీరోగా విజయవంతమైన తొలి చిత్రం 1976లో వచ్చిన కాళీచరణ్. నిజానికి ఈ సినిమాలో హీరోగా ముందు రాజేష్ ఖన్నాను తీసుకున్నారు. కానీ అతని కాల్షీట్లు కుదరని కారణంగా ఆ అవకాశం శత్రుఘ్న సిన్హాకు దక్కింది. ఇతడు ముఖ్యపాత్ర ధరించిన కొన్ని సినిమాలు అబ్ క్యా హోగా, ఖాన్‌ దోస్త్, యారోఁకా యార్, దిల్లగీ, విశ్వనాథ్, ముఖాబ్లా, జానీ దుష్మన్ మొదలైనవి.

2008లో ఇతడు స్టార్ టీవీలో వచ్చిన "ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్" కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2009లో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌లో వచ్చిన దస్‌ కా దమ్‌ అనే ప్రోగ్రాముకు హోస్ట్‌గా ఉన్నాడు. ప్రస్తుతం పాపులర్ గేమ్‌షో "కౌన్ బనేగా కరోడ్‌పతి" భోజపురి భాషలో సంధానకర్తగా నడుపుతున్నాడు.

రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాలో ఇతడు ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పాత్రను పోషించాడు.

రాజకీయ జీవితం

ఇతడు తన మిత్రుడు రాజేష్ ఖన్నాకు వ్యతిరేకంగా మధ్యంతర ఎన్నికలలో నిలబడడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తన మిత్రుడు రాజేష్ ఖన్నాకు వ్యతిరేకంగా ఎన్నికలలో నిలబడటం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని శత్రుఘ్న సిన్హా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆ ఎన్నికలలో రాజేష్ ఖన్నా 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[9] ఈ సంఘటనతో రాజేష్ ఖన్నా కలత చెంది శత్రుఘ్న సిన్హాతో మాట్లాడటం మానివేశాడు. సిన్హా తమ స్నేహాన్ని కొనసాగటానికి ప్రయత్నించాడు కానీ 2012లో రాజేష్ ఖన్నా మృతి చెందేవరకు అది సాధ్యపడలేదు.[10]

ఇతడు 2009 సాధారణ ఎన్నికలలో బీహార్ రాష్ట్రంలోని పాట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి శేఖర్ సుమన్‌పై గెలుపొందాడు. తరువాత 2014 సాధారణ ఎన్నికలలో కూడా గెలిచాడు. ఇతడు వాజపేయి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా, రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు.[11] 2006లో ఇతడు బి.జె.పి. సాంస్కృతిక, కళా విభాగానికి అధిపతిగా నియమితుడైనాడు.

2019 సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇతనికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[12]

పురస్కారాలు

  • 1973 - బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు - తన్హాయి చిత్రంలోని పాత్రకు ఉత్తమ సహాయ నటుడు
  • 2003 - స్టార్ డస్ట్ అవార్డులు - "ప్రైడ్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ"[13]
  • 2003 - స్టార్ డస్ట్ అవార్డులు - "జీవిత సాఫల్య పురస్కారం" [14]
  • 2007 - కిశోర్ కుమార్ సమ్మాన్ [15]
  • 2011 - జీ సినీ అవార్డు - జీవిత సాఫల్య పురస్కారం [16]
  • 2014 - ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డు

ఫిల్మోగ్రఫీ

నటుడిగా:

  • యమ్లా పగ్లా దీవానా: ఫిర్ సే (2018)
  • మహాభారత్ (2013) - కృష్ణుడు (గాత్రం - యానిమేషన్ సినిమా)
  • వో ఆద్మీ బహుత్ కుచ్ జాన్తా థా (2013)
  • రక్త చరిత్ర -2 (2010)(హిందీ, తెలుగు)
  • రక్త చరిత్ర (2010)(హిందీ, తెలుగు)
  • ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై (2010)
  • యార్ మేరీ జిందగీ (2008) - ఠాకూర్ విక్రమ్‌ సింగ్
  • ఆన్:మెన్ ఎట్ వర్క్ (2004) - ఇన్‌స్పెక్టర్ విక్రమ్‌ సింగ్
  • భారత్ భాగ్య విధాత (2002) - హోమ్‌ మంత్రి మహేంద్ర సూర్యవంశి
  • పాపా ద గ్రేట్ (2000) - బీహారీలాల్
  • షహీద్ ఉద్ధమ్‌ సింగ్: అలియాస్ రామ్‌ మొహమ్మద్ సింగ్ ఆజాద్ (2000) - మొహమ్మద్ ఖాన్
  • జుల్మ్‌ ఓ సితమ్‌ (1998) లాయర్ విశ్వనాథ్
  • దీవానా హూఁ పాగల్ నహీ (1998)
  • హుకూమ్‌నామా (1996)
  • దిల్ తేరా దివానా (1996) - కుమార్
  • తాఖత్ (1995) - ఆనంద్
  • జమానా దీవానా (1995) - సూరజ్ ప్రతాప్ సింగ్
  • పతంగ్ (1994) - రబ్బానీ
  • ప్రేమ్‌ యోగ్ (1994) - ప్రయోక్త
  • చాంద్ కా తుక్‌డా (1994) - జెవాగో
  • బేతాజ్ బాద్‌షా (1994) - పరశురామ్/ప్రశాంత్
  • ఇన్సాఫ్ అప్నే లహూ సే (1994) - దేవీలాల్
  • ఔలాద్ కే దుష్మన్ (1993) - రాజన్ కె.చౌదరి
  • అధర్మ్ (1992) అవినాష్ వర్మ
  • రణభూమి (1991) - రూపా సింగ్
  • ఇరాదా (1991)
  • కస్బా (1991) - ధని
  • హమ్‌ సే నా టకరానా (1990)
  • కరిష్మా కలీ కా (1990) - సి.ఐ.డి. ఇన్‌స్పెక్టర్ శివ
  • జఖ్మ్ (1989)
  • షెహజాదె (1989) - సూరజ్ సింగ్
  • గోలా బరూద్ (1989) - శంభు
  • నా ఇన్సాఫి (1989) - విజయ్ సిన్హా
  • బిల్లూ బాద్‌షా (1989) - బిల్లూ
  • ఆఖరీ బాజి (1989) - ప్రశాంత్ కుమార్/పి.కె.
  • సంతోష్ (1989) - అవినాష్
  • ఆంధియాఁ (1989) - దుష్యంత్
  • జర్రత్ (1989) - ఇన్‌స్పెక్టర్ రామ్‌ సింగ్
  • కానూన్ కి ఆవాజ్ (1989) - రఘునాథ్ ప్రసాద్ రాయ్
  • సాయా (1989)
  • గంగా తేరె దేశ్ మేఁ (1988) - పోలీస్ ఇన్‌స్పెక్టర్ అజయ్ నాథ్
  • మహావీర (1988) - విజయ్ వర్మ
  • షేర్నీ (1988) - ఇన్‌స్పెక్టర్ రాజన్
  • ధరం శత్రు (1988)
  • ధరమ్‌యుద్ధ్ (1988) - ప్రతాప్ సింగ్
  • గునాహోఁ కా ఫైసలా (1988) - బిర్జూ
  • ఖూన్ భరీ మాంగ్ (1988) - జె.డి.
  • ముల్జిమ్‌ (1988)- ఇన్‌స్పెక్టర్ నీరజ్ కుమార్
  • సాగర్ సంగమ్‌ (1988) - ఇన్‌స్పెక్టర్ అర్జున్ శర్మ
  • శివ్ శక్తి (1988)
  • జల్‌జలా (1988) - శంకర్
  • హవాలాత్ (1987) - గుల్లు బాద్‌షా/సికందర్ అలీఖాన్
  • రాహి (1987)
  • ఆగ్ హీ ఆగ్ (1987) ఎ.సి.పి.సూరజ్ సింగ్
  • లోహా (1987)
  • ఇన్‌సానియత్ కె దుష్మన్ (1987) లాయర్ కైలాష్ నాథ్
  • హిరాసత్ (1987)
  • ఖుద్ గర్జ్ (1987) - బీహారి భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా
  • మహాయాత్ర (1987) - చాందల్
  • అసలీ నఖలీ (1986) - విజయ్
  • ఇల్జామ్ (1986) - సూరజ్ ప్రసాద్
  • ఖత్ల్ (1986) - ఇన్‌స్పెక్టర్ శత్రు
  • జ్వాలా (1986) - జ్వాలాదత్
  • సమయ్ కి ధారా (1986)
  • టెలీఫోన్ (1985)
  • యుద్ధ్ (1985) - మొయినుద్దీన్ ఖాన్
  • రామ్‌కలీ (1985) - ఇన్‌స్పెక్టర్ సుల్తాన్ సింగ్
  • ఆంధీ తూఫాన్ (1985) - రఘునాథ్ శాస్త్రి
  • అమీర్ ఆద్మీ గరీబ్ ఆద్మీ (1985) - లాయర్ అశోక్ సక్సేనా
  • భవానీ జంక్షన్ (1985) - రామ్
  • హోషియార్ (1985) - రాజేష్
  • కాలా సూరజ్ (1985)
  • కాలీ బస్తీ (1985) - కరణ్ సింగ్
  • ఫాఁసీకే బాద్ (1985) - పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ్ కుమార్ నాథ్
  • మాతి మాంగే ఖూన్ (1984) - హరినారాయణ్ సింగ్
  • ఆజ్ కా ఎం.ఎల్.ఎ. రామావతార్ (1984) - క్రాంతి కుమార్
  • బాద్ ఔర్ బద్నామ్ (1984)
  • ధోకేబాజ్ (1984)
  • ది గోల్డ్ మెడల్ (1984)
  • జీనే నహీ దూఁగా (1984)
  • మేరా దోస్త్ మేరా దుష్మన్ (1984) - శక్తి సింగ్
  • పాపి పేట్ కా సవాల్ హై (1984)
  • ఖైదీ (1984) - ఎ.ఎస్.పి. దినేష్
  • షరారా (1984)
  • ఖయామత్ (1983)
  • గంగా మేరీ మా (1983)
  • చోర్ పోలీస్ (1983) - ఇన్‌స్పెక్టర్ సునీల్ రానా
  • దౌలత్ కె దుష్మన్ (1983)
  • కల్‌కా (1983)
  • తఖ్‌దీర్ (1983) - శివ
  • తీస్రీ ఆఁఖ్ (1982) - సాగర్
  • హాత్‌కడీ (1982) ఇన్‌స్పెక్టర్ సునీల్/భోలానాథ్ బనారసి
  • దిల్ ఎ నాదాన్ (1982) - విక్రమ్‌
  • దో ఉస్తాద్ (1982)
  • లోగ్ క్యా కహేఁగే (1982)
  • మంగళ్ పాండే (1982)
  • నసీబ్ (1981) - విక్కీ
  • చెహ్రే పె చెహ్రా (1981) - డాక్టర్ సిన్హా
  • నరమ్‌ గరమ్‌ (1981) - బబువా కాళీశ్వర్ బాజపాయ్
  • క్రాంతి (1981) - కరీమ్‌ ఖాన్
  • వఖ్త్ కీ దీవార్ (1981)
  • జ్వాలాముఖి (1980) - రాజేష్
  • షాన్ (1980) - రాకేష్
  • దోస్తానా (1980) - రవి కపూర్
  • ఛంబల్ కీ కసమ్‌ (1980)
  • ఛోరోఁ కీ బారాత్ (1980) - శేఖర్
  • బే-రెహమ్‌ (1980)
  • బాంబే 405 మైల్స్ (1980) - కిషన్
  • దో శత్రు (1980)
  • నౌకర్ (1979)
  • కాలాపత్థర్ (1979) - మంగళ్ సింగ్
  • గౌతమ్‌ గోవిందా (1979) - గోవిందా
  • ఆత్మారామ్‌ (1979)
  • హీరా - మోతీ (1979) విజయ్/హీరాలాల్
  • జానీ దుష్మన్ (1979) షేరా
  • మగ్రూర్ (1979) - రంజిత్ సిన్హా/రాజు
  • ముఖాబ్లా (1979) - షేరు
  • విశ్వనాథ్ (1978) - విశ్వనాథ్
  • అమర్ శక్తి (1978) - శక్తి సింగ్
  • అతిథి (1978) నవేందు ఎం.కుమార్
  • భూక్ (1978)
  • ఛోర్ హో తో ఐసా (1978) - సంజు పి.నాథ్/శంకర్
  • దిల్లగి (1978) - లాయర్ శంకర్
  • పరమాత్మ (1978) - ఆనంద్
  • తీఫ్ ఆఫ్ బాగ్దాద్ (1977)
  • కొత్వాల్ సాబ్ (1977) - భరత్ ప్రతాప్ సిన్హా
  • ఆద్మీ సడక్ కా (1977) - అబ్దుల్
  • అబ్ క్యా హోగా (1977) - రామ్‌ సిన్హా
  • నామి చోర్ (1977)
  • సఫేద్ హాథీ (1977)
  • సత్ శ్రీ అకాల్ (1977)
  • షిర్డీ కె సాయిబాబా (1977) - హీరా
  • యారోఁ కా యార్ (1977) - ప్రతాప్/షేరా
  • చింగారి (1977)
  • ఖాన్ దోస్త్ (1976) - రహ్మత్ ఖాన్
  • కాళీచరణ్ (1976) - ప్రభాకర్/కాళీచరణ్
  • సంగ్రామ్‌ (1976)
  • శాంతొ బంతొ (1976)
  • అనోఖా (1975) రామ్‌/శంభు ఖన్నా
  • దీ థగ్ (1975)
  • జగ్గు (1975) జగ్గు
  • కహ్తె హై ముజ్‌కో రాజా (1975)
  • దోస్త్ (1974) - గోపీచంద్
  • బద్లా (1974) - కుమార్/రాజు
  • సైతాన్ (1974)
  • ఆ గలే లగ్ జా (1973) - డాక్టర్ అమర్
  • జీల్ కే ఉస్ పార్ (1973) - జె.పి.టండన్
  • బ్లాక్‌మెయిల్ (1973) - జీవన్
  • ఛలియా (1973)
  • ఏక్ నారి దో రూప్ (1973)
  • గాయ్ ఔర్ గోరి (1973)
  • గులామ్‌ బేగమ్‌ బాద్‌షా (1973) - ఠాకూర్ ప్రతాప్
  • హీరా (1973) - బల్వంత్
  • కష్మాకష్ (1973)
  • ప్యార్ కా రిస్తా (1973)
  • సబక్ (1973)
  • సమ్‌జౌతా (1973)
  • షరీఫ్ బద్మాష్ (1973) - కన్హయా లాల్/రాకీ
  • మిలాప్ (1972) - ఐదు విభిన్న పాత్రలు
  • రామ్‌పూర్ కా లక్ష్మణ్ (1972) - రామ్‌ కె.భార్గవ్/కుమార్
  • బాంబే టు గోవా (1972) - శర్మ
  • బాబుల్ కీ గలియాఁ (1972)
  • భాయ్ హో తో ఐసా (1972) - రామ్‌
  • బునియాద్ (1972)
  • దో యార్ (1972)
  • జబాన్ (1972)
  • రాస్తె కా పత్థర్ (1972) - అరుణ్ ఠాకూర్
  • రివాజ్ (1972)
  • షాదీ కే బాద్ (1972) చౌదరి బిషన్ స్వరూప్ సింగ్
  • షరారత్ (1972) జగదీష్/వినోద్ కుమార్
  • బన్‌ఫూల్ (1971) అజయ్
  • దో రాహ (1971)
  • దోస్త్ ఔర్ దుష్మన్ (1971)
  • ఏక్ నారి ఏక్ బ్రహ్మచారి (1971) - రాజకుమార్ ఎస్.చౌదరి
  • గాంబ్లర్ (1971) బన్‌కె బిహారి
  • ఖోజ్ (1971)
  • మేరె అప్నే (1971) - చైనో
  • పరాస్ (1971) - ఠాకూర్ అర్జున్ సింగ్
  • పర్వానా (1971) - పబ్లిక్ ప్రాసిక్యూటర్
  • ప్రేమ్‌ పూజారి (1970) - పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్
  • చేతనా (1970) - రమేష్
  • ఏక్ నన్హీ మున్నీ లడకీ థీ (1970)
  • హోలీ ఆయీ రే (1970)
  • ఖిలోనా (1970) - బిహారీ
  • రాతోఁ కా రాజా (1970)
  • నయీమ్‌ బిల్డర్ (1970)
  • జలాల్ మహ్మూద్ సయీద్ (1970)
  • సాజన్ (1969) - హవల్దార్
  • ప్యార్ హి ప్యార్ (1969)

గాయకుడిగా:

  • నరమ్‌ గరమ్‌ (1981)
  • జ్వాలాముఖి (1980)
  • దోస్త్ (1974)

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ