సముద్రాల వేణుగోపాలాచారి

సముద్రాల వేణుగోపాలాచారి గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] తెలుగుదేశం పార్టీ తరపున ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం ఎం.పి.గా 1996 నుండి 2004 వరకి మూడుసార్లు ఎన్నికయ్యాడు.[2][3] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నాడు.[4][5][6] సముద్రాల వేణుగోపాలాచారి 2022 డిసెంబరు 29న తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) చైర్మన్‌గా నియమితుడై[7], 2023 జనవరి 5న బాధ్యతలు చేపట్టాడు.[8]

సముద్రాల వేణుగోపాలాచారి
సముద్రాల వేణుగోపాలాచారి


పదవీ కాలం
1996 - 2004
ముందుఅల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
తరువాతతక్కల మధుసూధనరెడ్డి
నియోజకవర్గంఆదిలాబాద్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 - 2004
ముందుభోస్లే నారాయణరావు పాటిల్
తరువాతగడ్డిగారి విఠల్ రెడ్డి
నియోజకవర్గంముధోల్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-05-10) 1959 మే 10 (వయసు 65)
నిర్మల్, నిర్మల్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలుతెలుగుదేశం పార్టీ
భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామిరేవతి
సంతానంఒక కుమారుడు, ఒక కూమార్తె.
మతంహిందూ

సముద్రాల వేణుగోపాలాచారి 2024 ఏప్రిల్‌ 16న బీఆర్ఎస్ పార్టీని వీడి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[9]

చదువు

ఈయన 1959, మే 10న లక్ష్మణాచారి, వెంకటరత్నమ్మ దంపతులకు నిర్మల్లో జన్మించాడు. ఎం.ఏ (సైకాలజీ), ఏం.ఏ (ఆర్కాలజీ) ఉస్మానియా విశ్వవిద్యాలయం లోనూ, D.H.M.S డా. జయసూర్య ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో చదివాడు.[10]

వివాహం

1988, మే 20న రేవతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.

వృత్తి

వైద్యం, వ్యవసాయం, సమాజ సేవకుడు

పదవులు

  • 1996లో 11వ లోక్‌సభకు, 1998లో 12వ లోక్‌సభకు, 1999 లో 13వ లోక్‌సభకు ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోక్‌సభ సభ్యులు.[11][12][4]
  • సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ (1985-967)
  • 1987-88 సభ్యులు, ప్రజా పద్దుల సంఘం
  • 1989-90 సభ్యులు, అధీన శాసన సమితి
  • 1992-93 సభ్యులు, ప్రజా సంస్థలు సంఘం
  • 1995-96 రాష్ర్ట మంత్రి, సమాచార, ప్రజా సంబంధాలు, పర్యాటక, ఆంధ్రప్రదేశ్
  • 1996-97 కేంద్ర మంత్రి, పవర్, సంప్రదాయేతర శక్తి
  • 1996-98 కేంద్ర మంత్రి, వ్యవసాయ
  • 1998-99 డిప్యూటీ ఛైర్మన్, అధికార భాషా సంఘం
  • సభ్యులు, నిబంధనలు కమిటీ
  • సభ్యులు, ప్రజా సంస్థలు కమిటీ
  • సభ్యులు, ఆర్థికమంత్రిత్వశాఖ కమిటీ
  • సభ్యులు, పార్లమెంటు సభ్యులు కమిటీ స్థానిక ప్రాంత అభివృద్ధి స్కీమ్
  • సభ్యులు, సంప్రదింపుల కమిటీ, పవర్ మంత్రిత్వ శాఖ
  • 1999-2000 ఛైర్మన్, ప్రభుత్వం హామీ కమిటీ
  • సభ్యులు, అంచనాలు కమిటీ
  • సభ్యులు, హోం అఫైర్స్ కమిటీ
  • సభ్యులు, జనరల్ పర్పసెస్ కమిటీ

సందర్శన

హరారే, పెరు, రష్యా, స్వీడన్, యు.ఎస్.ఏ (విద్యుత్, సంప్రదాయేతర శక్తి వనరుల యూనియన్ మంత్రి; సభ్యుడు, భారతీయ పార్లమెంటరీ ప్రతినిధి, 100 వ IPU కాన్ఫరెన్స్, మాస్కో, 1998)

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు