సాయిపల్లవి

నటి
(సాయి పల్లవి నుండి దారిమార్పు చెందింది)

సినీ నటి.[4][6] తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది.[7]

సాయిపల్లవి
జననం (1992-05-09) 1992 మే 9 (వయసు 32)[1][2][3]
కోటగిరి, తమిళనాడు[4]
విద్యవైద్య విద్య
విద్యాసంస్థటిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాల, జార్జియా
వృత్తినటి
తల్లిదండ్రులు
  • సెంతామరై కన్నన్ (తండ్రి)
  • రాధామణి (తల్లి)
బంధువులుపూజా క‌న్న‌న్ (కవల సోదరి)[5]

నేపథ్యం

సాయిపల్లవి ది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. బడుగ గిరిజన కుటుంబంలో జన్మించారు తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె, చెల్లెలు పూజ కన్నన్‌ కవల పిల్లలు. అక్కడికి దగ్గర్లోని కోయంబత్తూరులో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఈమె ఎనిమిదో తరగతిలో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమాలో నటించింది.

ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో జార్జియా లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు.

సినిమా

వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత నాని సరసన ఎం. సి. ఏ చిత్రంలో నటించింది.[8]

నటించిన చిత్రాలు

సంవత్సరంసినిమాపాత్రభాషాఇతర విషయాలుమూలాలు
2005కస్తూరి మాన్కాలేజీ అమ్మాయితమిళ్గుర్తింపు లేని పాత్ర[9]
2008ధామ్ ధూమ్శెంబా బంధువు[10]తమిళ్గుర్తింపు లేని పాత్ర
2015ప్రేమమ్మలర్మలయాళం[11]
2016కాళిఅంజలిమలయాళం[12]
2017ఫిదాభానుమతితెలుగు[13]
మిడిల్ క్లాస్ అబ్బాయిపల్లవి "చిన్ని"తెలుగు[14]
2018దియాతులసితమిళ్ద్విభాషాచిత్రం[15]
కణంతెలుగు
పడి పడి లేచే మనసువైశాలి చెరుకూరితెలుగు[16]
మారి 2ఆనంది మారియప్పన్తమిళ్[17]
2019అథిరన్నిత్యమలయాళంతెలుగులో అనుకోని అతిథి[18]
ఎన్.జి.కెగీత కుమారితమిళ్, తెలుగు[19]
2020పావ కధైగల్సుమతితమిళ్ఆంథోలోజి ఫిలిం ; సెగ్మెంట్ ఓర్ ఇరవు[20]
2021లవ్ స్టోరీమౌనిక రాణితెలుగు[21]
శ్యామ్‌ సింగరాయ్‌రోజి (మైత్రేయి)తెలుగు[22][23]
2022విరాట పర్వంవెన్నెలతెలుగు[24]
గార్గిగార్గితెలుగు, తమిళం, కన్నడ[25]

అవార్డులు , నామినేషన్లు

సంవత్సరంఅవార్డువర్గంసినిమాఫలితంమూలాలు
2015ఆసియా విజన్ అవార్డులునటనలో కొత్త సంచలనం - స్త్రీప్రేమమ్గెలుపు[26]
ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ప్రత్యేక జ్యూరీ అవార్డుగెలుపు[27]
63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ఉత్తమ మహిళా అరంగేట్రం - మలయాళంగెలుపు[28]
5వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ఉత్తమ మహిళా అరంగేట్రం - మలయాళంగెలుపు[29]
వనిత ఫిల్మ్ అవార్డ్స్ఉత్తమ నూతన నటి - నటిగెలుపు[30]
2017ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్అత్యంత ప్రజాదరణ పొందిన నటికలిగెలుపు[31]
64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ఉత్తమ నటి - మలయాళంప్రతిపాదించబడింది[32]
6వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ఉత్తమ నటి - మలయాళంప్రతిపాదించబడింది[33]
CPC సినీ అవార్డులుఉత్తమ నటిగెలుపు[34]
201865వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ఉత్తమ నటి - తెలుగుఫిదాగెలుపు[35]
7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ఉత్తమ నటి - తెలుగుప్రతిపాదించబడింది[36]
201966వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ఉత్తమ నటి - తమిళంమారి 2ప్రతిపాదించబడింది[37]
202110వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్సహాయ పాత్రలో ఉత్తమ నటిపావ కదైగల్ప్రతిపాదించబడింది[38]

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు