సిల్క్ స్మిత

నటి

సిల్క్ స్మిత (డిసెంబరు 2, 1960 - సెప్టెంబరు 23, 1996) (ఆంగ్లం: Silk Smitha) గా ప్రసిద్ధురాలైన "విజయలక్ష్మి" ప్రముఖ దక్షిణాది నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో 200లకు పైగా సినిమాలలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్‌తో కూడిన వగలమారి పడతి పాత్రలు పోషించింది.

సిల్క్ స్మిత

జన్మ నామంవిజయ లక్ష్మి
జననం(1960-12-02)1960 డిసెంబరు 2
ఏలూరు, ఆంధ్రప్రదేశ్
మరణం1996 సెప్టెంబరు 23(1996-09-23) (వయసు 35)
మద్రాసు

పూర్వ రంగం

విజయలక్ష్మి 1960, డిసెంబరు 2పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది.[1], "స్మిత" అని తెరపేరు ధరించింది.[2] సిల్క్ స్మిత మొదటి చిత్రము తమిళంలో వండి చక్రం (బండి చక్రం). 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్, బహుళ ప్రజాదరణ పోందడంతో ఆమె తన పేరును సిల్క్ స్మిత గా మార్చుకుంది.[3]

సినీ రంగం

క్రమంగా ఆమె సినీరంగలో ప్రముఖనటిగా నిలదొక్కుకుంది. 200లకు పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించింది. అనేక సినిమాలలో ఆమె ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు అమెకు అత్యంత జనాదరణను తెచ్చి పెట్టాయి. ఉదాహరణకు తెలుగులో "బావలు సయ్యా, మరదలు సయ్యా" పాట. కొందరు సినిమా విలేఖరులు, విమర్శకులు ఆమెను "soft porn" actress గా అభివర్ణించారు.[4] ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా, నర్తకిగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను, కామోద్దీపనము కలిగించే దుస్తులతోను, ముదురు అమ్మాయిలాగా కనిపించింది. అయితే "సీతాకోక చిలుక" (1981) వంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రకలలోను మెప్పించింది.[5] "లయనం" అనే "పెద్దల సినిమా" ఆమెకు చాలా పేరును తెచ్చింది. "రేష్మా కీ జవానీ" అనే పేరుతో దీనిని హిందీలో తీశారు.[6] "వసంత కోకిల" చిత్రంలో ఆమె పాత్ర విమర్శకుల మన్ననలు పొందింది.[7]

సిల్క్ స్మిత గురించి అనేక విశేషాలను ఇమండి రామారావు యు ట్యూబ్ వీడియోలొ చెప్పారు

https://www.youtube.com/watch?v=gVHaM5x_iu0

మరణం

సిల్క్ స్మిత తన జీవితాంతం అవివాహిత గానే ఉంది. 1996, సెప్టెంబరు 23మద్రాసులోని తన నివాస గృహంలో మరణించి ఉంది. అంతకు ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్దపెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను నిసృహలోకి నెట్టివేసిఉండవచ్చునని అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొన్నదని భావిస్తున్నారు.[1][8]

సిల్క్ స్మిత నటించిన కొన్ని సినిమాలు

ఇవి కూడా చూడండి


మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు