స్వాతి మలివాల్

స్వాతి మలివాల్ భారతదేశానికి చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలు. ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి సలహాదారుగా, ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌గా పని చేసి 2024లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైంది.[2]

స్వాతి మలివాల్
స్వాతి మలివాల్


రాజ్యసభ సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 జనవరి 2024
ముందుసుశీల్ కుమార్ గుప్తా
నియోజకవర్గంఢిల్లీ

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌
పదవీ కాలం
జూలై 2015 – 5 జనవరి 2024[1]

వ్యక్తిగత వివరాలు

జననం (1984-10-15) 1984 అక్టోబరు 15 (వయసు 39)
ఘజియాబాద్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
నివాసంన్యూఢిల్లీ, భారతదేశం
వృత్తిరాజకీయ నాయకురాలు, సామజిక కార్యకర్త

జననం, విద్యాభ్యాసం

స్వాతి మలివాల్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అక్టోబరు 15, 1984న జన్మించింది. ఆమె అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌ నుండి ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి జెఎస్ఎస్ అకాడమీ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది.

వ్యక్తిగత జీవితం

స్వాతి మలివాల్ హెచ్‌సిఎల్‌లో పని చేస్తూ తన 22వ ఏట ఉద్యోగాన్ని విడిచిపెట్టి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా నిర్వహిస్తున్న ఎన్‌జిఓ సంస్థ "పరివర్తన్"లో చేరింది. ఆమె 2013లో గ్రీన్‌పీస్ ఇండియాకు ప్రచారకర్తగా ఆ తర్వాత 2014లో ఢిల్లీలోని ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి సలహాదారుగా పని చేసింది. మలివాల్ భారతదేశంలో అధికార కేంద్రీకరణను పెంచాలని వాదించే వివిధ ఎన్‌జిఓ సంస్థలతో కలిసి చురుకుగా పాల్గొని సమాచార హక్కు చట్టం (RTI) గురించి అవగాహన పెంచడానికి ప్రచారాలను నిర్వహించింది.

వివాహం

స్వాతి మలివాల్ ఆప్ నాయకుడు నవీన్ జైహింద్‌ను వివాహం చేసుకొని ఫిబ్రవరి 2020లో వారు విడాకులు తీసుకున్నారు.

రాజకీయ జీవితం

స్వాతి మలివాల్ అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఇండియన్ ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంలో చేరి ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరింది. ఆమె జూలై 2015లో ఢిల్లీ మహిళా కమీషన్ చైర్‌పర్సన్‌గా నియమితులవ్వగా ఆమె పదవీకాలం 2018లో ముగియడంతో ఢిల్లీ ప్రభుత్వం మరో మూడేళ్లపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.[3] స్వాతి మలివాల్ ను 2024 జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఆప్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఆమెను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థిగా ప్రకటించింది.[4] స్వాతి మలివాల్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికై[5] 2024 జనవరి 31న రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసింది.[6]

వేధింపులు

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా స్వాతి మలివాల్ 2023 జనవరి 19న అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS) గేట్ నెంబర్ 2 వద్ద కొంతమందితో కలిసి ఫుట్‌పాత్‌పై తన కారు కోసం నిల్చున్నపుడు నిందితుడు కారులో వచ్చి, తన కారులో కూర్చోవాలని అడిగాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో, ఇరువురి మధ్య ఘర్షణ జరగగా ఆమెను కారుతో దాదాపు 10 నుంచి 15 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు.[7][8]

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు