హలాసనము

హలాసనము (సంస్కృతం: हलसन) యోగాలో ఒక విధమైన ఆసనము. నాగలి రూపంలో ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని హలాసనమంటారు. కర్ణపీడాసనం, సప్తకోణాసనం ఈ ఆసనానికి వైవిధ్య రూపాలు.

హలాసనం

ఉనికి

ఈ పేరు సంస్కృత శబ్దం హాల నుడ్ంఇ వచ్చింది. హాల అంటే " నాగలి " అని అర్థం. [1] ఈ భంగిమను 19 వ శతాబ్దంలో శ్రీతత్వనిధిలో లాంగలాసనం అని వర్ణించారు. దీనిక్కూడా సంస్కృతంలో నాగలి అనే అర్థం. [2]

మధ్యయుగం నాటి హఠ యోగ గ్రంథాలలో కర్ణాపీడాసనం కనిపించదు. శివానంద యోగ సంప్రదాయంలో స్వామి విష్ణుదేవానంద యొక్క 1960 కంప్లీట్ ఇల్లస్ట్రేటెడ్ బుక్ ఆఫ్ యోగా లోను, BKS అయ్యంగార్ 1966 లోరాసిన లైట్ ఆన్ యోగా లోనూ విడివిడిగా దీన్ని వివరించారు. కాబట్టి, దీనికి ప్రాచీన మూలాలు ఉండి ఉండవచ్చని భావించవచ్చు. [3] [4] ఈ పేరు కర్ణ అంటే "చెవులు" అని అర్ధం పీడా అంటే "పిండి" అని అర్ధం. [5]

హలాసనం సెర్వికల్ వెన్నెముకపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తుంది, మామూలు పరిస్థితుల్లో ఈ భాగంపై ఈ రకమైన ఒత్తిడి ఉండదు. సరిగా చేయకపోతే గాయం కలిగిస్తుంది. [6] [7] [8]

పద్ధతి

  • మొదట శవాసనం వేయాలి.
  • తరువాత కాళ్ళు రెండూ కలిపి మెల్లమెల్లగా తలవైపుగా నేలపై ఆనించాలి.
  • చేతులు నేలమీద చాపి గాని, తలవైపు మడచిగాని ఉంచాలి.
  • ఆసనంలో ఉన్నంతసేపూ శ్వాసను బయటనే ఆపాలి. పొట్టను లోపలికి పీల్చి ఉంచితే ఈ ఆసనం సులువుగా వేయవచ్చును.

ప్రయోజనం

హలాసనం వలన వెన్నెముక సంబంధిత కండరాలకు, నరాలకు బలం హెచ్చుతుంది. వెన్నెముక మృదువుగా ఉంటుంది. మెడకు రక్తప్రసారం చక్కగా జరుగుతుంది. నడుము సన్నబడుతుంది. బాణపొట్ట తగ్గుతుంది.

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు