హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గం

హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గం, భారతదేశపు తూర్పు తీర మైదానంలో చెన్నై, కోలకతా కలుపుతూ ఉన్న రైలు మార్గం. ఇది పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అంతటా 1,661 kilometres (1,032 mi) దూరం మార్గంలో విస్తరిస్తుంది.

హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
Howrah–Chennai main line
విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ముఖ్య స్టేషను
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్పశ్చిమ బెంగాల్, ఒడిషా,
ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు
చివరిస్థానంహౌరా
చెన్నై సెంట్రల్
ఆపరేషన్
ప్రారంభోత్సవం1901
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుసౌత్ ఈస్ట్రన్ రైల్వే, ఈస్ట్‌ కోస్ట్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే
సాంకేతికం
లైన్ పొడవు1,661 km (1,032 mi)
ట్రాకుల సంఖ్య2
ట్రాక్ గేజ్1676 బ్రాడ్ గేజ్
ఎలక్ట్రిఫికేషన్2005 సం. నుండి 25 కెవి ఓవర్ హెడ్ లైన్ తో
ఆపరేటింగ్ వేగం130 కి.మీ./గంటకు వరకు (ఖరగ్పూర్-విజయవాడ విభాగము) , 160 కి.మీ./గంటకు వరకు (హౌరా-ఖరగ్పూర్, విజయవాడ-చెన్నై విభాగాలు)

విభాగములు

ఈ 1,661 km (1,032 mi) పొడవైన ప్రధాన రైలు మార్గం (ట్రంక్ లైన్) చిన్న రైలు మార్గాలు (విభాగాలు) లో మరింత వివరంగా చూపబడింది:

  1. హౌరా - ఖరగ్‌పూర్ రైలు మార్గం
  2. ఖరగ్‌పూర్ - పూరి రైలు మార్గం / ఖరగ్‌పూర్ - ఖుర్దా రోడ్ రైలు మార్గం
  3. ఖుర్దా రోడ్ - విశాఖపట్నం రైలు మార్గం
  4. విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గం
  5. విజయవాడ-చెన్నై రైలు మార్గం

భౌగోళికం

హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గం మహానది, గోదావరి, కృష్ణా వంటి ప్రధాన నదులు దాటుతూ తూర్పు తీర మైదానాలు గుండా ప్రయాణిస్తుంది. తూర్పు కనుమలు, బంగాళాఖాతం మధ్య ఉన్న తీర మైదానాల జనాభాలో అధిక సాంద్రతతో కూడి సారవంతమైన వ్యవసాయ భూములు కలిగి ఉన్నాయి.[1][2]

చరిత్ర

హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గం (లైన్) భారతదేశంలో రెండు మహానగరాల మధ్యన కనెక్ట్ చేయబడిన మొదటి ట్రంక్ మార్గం. ఇది 1866 సం.లో ప్రారంభించబడింది.[3] హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గం అయిన రెండవ ట్రంక్ మార్గంగా 1870 సం.లో ప్రారంభించబడింది.[4] హౌరా-నాగ్పూర్-ముంబై లైన్ దేశంలో మూడవ ట్రంక్ మార్గంగా 1900 సం.లో ప్రారంభించబడింది. దాని తర్వాత 1901 సం.లో హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గముగా ఉంది.[5]

చెన్నై లోని రోయపురం రైల్వే స్టేషను (వ్యాసర్పాడి జీవా (చెన్నై సబర్బన్ రైల్వే) నుండి ఆర్కట్ (వెల్లూర్) (ఆర్కాట్) సమీపంలోని వలఝా రోడ్ రైల్వే స్టేషన్ (వలఝా రోడ్) (వలఝాపేట్) వరకు 100 కి.మీ. (62 మైళ్ళు) పరిధిలో మద్రాస్ రైల్వే కంపెనీ ద్వారా నిర్వహించబడుతున్న రైలు 1856 జూలై 1 సం.న దక్షిణ భారతదేశంలో మొదటి సేవలు ప్రారంభమయ్యాయి. అనేక ఇతర మార్గాలు కూడా అభివృద్ధి చేయబడ్డాయి.[3] 1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,287 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గం, అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది.[5][6] ఇంతేకాక విజయవాడ-చెన్నై లింక్ నిర్మాణం భారతదేశ తూర్పు తీరం ప్రాంతంలో 1899 సం.లో సరాసరి (ఎకాఎకీ) నడుపుటకు ప్రారంభించబడింది.[4] బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో హౌరా-ఖరగ్పూర్, ఖరగ్పూర్-కటక్ విభాగాల్లో పనిచేసే రెండు రైలు మార్గాలు, రూప్‌నారాయణ్ నది పైన వంతెన 1900 సం.లో పూర్తి చేయడం జరిగింది, మహానది 1901 సంలో పూర్తి చేయడం ద్వారా వలన చెన్నై, కోలకతా మధ్య కనెక్షన్ ఏర్పడింది.[5]

రైల్వే పునర్వ్యవస్థీకరణ

ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[7] కటక్ ఈస్ట్ కోస్ట్ లైన్ ఉత్తరభాగం, 514 కిమీ (319 మైళ్ళు) పొడవైన పూరీ శాఖ లైన్ సహా 1902 సం.లో బెంగాల్ నాగ్పూర్ రైల్వే హస్తగతం చేసుకుంది.[6][8] మద్రాస్ రైల్వేను 1908 సం.లో మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వేగా ఏర్పాటు చేసేందుకు దక్షిణ మరాఠా రైల్వేలో విలీనం చేశారు.[9][10]

1950 సం.ప్రారంభంలో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదింఛడము జరిగింది. దక్షిణ రైల్వే జోన్ నిర్మించటానికి గాను, మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే, దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ, మైసూర్ స్టేట్ రైల్వే లను ఏప్రిల్ 14 న విలీనం చెయ్యబడ్డాయి. తదనంతరం, నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే కూడా సదరన్ రైల్వేలో విలీనమైంది. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు,, (2) దక్షిణ రైల్వే లో విలీనం చేయబడ్డ మద్రాసు రైల్వే, దక్షిణ మరాఠా రైల్వే లోని కొన్ని భాగాలను వేరుచేసి దక్షిణ మధ్య రైల్వే జోన్ (సౌత్ సెంట్రల్ రైల్వే) ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో, దక్షిణ రైల్వే లోని గుంతకల్లు డివిజన్ దక్షిణ మధ్య రైల్వేకు, సోలాపూర్ డివిజన్ సెంట్రల్ రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల రైల్వే జోన్ (సౌత్ వెస్ట్రన్ రైల్వే) అనేది దక్షిణ రైల్వే నుండి. వేరుచేసి ఏర్పాటు చేశారు.[11][11]

బెంగాల్ నాగ్పూర్ రైల్వే 1944 సం.లో జాతీయకరణ చేశారు.[12]తూర్పు రైల్వే జోను, ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ యొక్క మొఘల్‌సరాయ్ లోని తూర్పు భాగం, బెంగాల్ నాగ్పూర్ రైల్వే కలిపి 1952 ఏప్రిల్ 14 సం.న ఏర్పడింది.[13] దక్షిణ తూర్పు రైల్వే జోను 1955 సం.లో, ఈస్టర్న్ రైల్వే లోని కొన్ని భాగాలను వేరుచేసి ఏర్పరచారు. ఈ జోనులో ఇంతకు ముందు నుండి నిర్వహించిన బిఎన్‌ఆర్ రైలు మార్గములు ఎక్కువగా ఉన్నాయి.[13][14] కొత్త మండలాలు ఏర్పాటులో భాగంగా ఏప్రిల్ 2003 లో ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోనులు ప్రారంభమయ్యాయి. సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి ఈ రెండు రైల్వే మండలాలు కొత్తగా మలిచారు.[13]

విద్యుద్దీకరణ

హౌరా-చెన్నై మెయిల్ 1965 సం.లో ఒక డీజిల్ ఇంజిన్ (భారతీయ లోకోమోటివ్ తరగతి డబ్ల్యుడిఎమ్-2| డబ్ల్యుడిఎమ్-1) ద్వారా నెట్టబడే సౌత్ ఈస్టర్న్ రైల్వే లోని మొదటి రైలు.[14]

హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గం పూర్తిగా 2005 సం.లో విద్యుద్దీకరణ జరిగింది.[15]

వేగ పరిమితులు

చెన్నై సెంట్రల్ నుండి న్యూఢిల్లీ వరకు ఉన్న రైలు మార్గము లోని భాగమైన విజయవాడ-చెన్నై రైలు మార్గం, హౌరా-నాగ్పూర్-ముంబై లైన్ లోని ఒక భాగమైన హౌరా-ఖరగ్పూర్ రైలు మార్గం (విభాగం ) లు (గ్రాండ్ ట్రంక్ మార్గంగా), 160 కి.మీ/గంటకు వేగాన్ని అందుకోవచ్చును. ఇవి ఒక "గ్రూప్ ఏ" మార్గముగా వర్గీకరించారు. ఖరగ్పూర్-విజయవాడ రైలు మార్గం 130 కి.మీ/గంటకు వేగాన్ని అందుకోవచ్చును. ఇది ఒక గ్రూప్ గ్రూప్ బి మార్గం (లైన్) గా వర్గీకరించారు.[16]

ప్రయాణీకుల ప్రయాణాలు

హౌరా, ఖరగ్‌పూర్, కటక్, భువనేశ్వర్, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, నెల్లూరు, చెన్నై సెంట్రల్, వంటివి భారతీయ రైల్వేలు యొక్క ముఖ్య వంద బుకింగ్ స్టేషన్లు అనే వాటిలో ఇవి ఈ ప్రధాన రైలు మార్గం మీద ఉన్నాయి.[17]

గోల్డెన్ క్వాడ్రిలేటరల్

హౌరా-చెన్నై ప్రధాన లైన్ స్వర్ణ చతుర్భుజి లోని ఒక భాగం. ఈ రైలు మార్గాలు నాలుగు ప్రధాన మహానగరాలను (న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోలకతా) కలుపుతూ ఉన్నటువంటి వాటి కర్ణాలు, కలిసి సుపరిచితమైన స్వర్ణ చతుర్భుజిగా, ఈ స్వర్ణ చతుర్భుజి రైలు మార్గము పొడవు 16 శాతం మాత్రమే అయిననూ; దాదాపుగా సగం రవాణా సరుకు, అదేవిధముగా సగభాగం ప్రయాణీకుల రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది.[18]

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు