2022 భారత రాష్ట్రపతి ఎన్నికలు

భారత 16వ రాష్ట్రపతి ఎన్నికలు 2022లో జరగనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. ఈ క్రమంలో దేశ 16వ భారత రాష్ట్రపతి ఎన్నిక జులై 18న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తాడు.

రాష్ట్రపతి పదవికి అర్హత

రాజ్యాంగంలోని ఆర్టికల్-58 ప్రకారం పోటీ చేసే అభ్యర్థులకు ఈ కింద అర్హతలుండాలి.

  • 35సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులై ఉండాలి.
  • లోక్‌సభకు ఎన్నికయ్యే అర్హతలుండాలి.
  • కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదా వాటి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థల్లో లాభదాయక పదవుల్లో ఉండకూడదు.[1][2]

నామినేషన్ విధానం

రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థిని 50మంది ఎలక్టోరల్ సభ్యులు ప్రతిపాదించాలి. ఆ తర్వాత 50మంది ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ జాబితాను ఎన్నికల అధికారులకు సమర్పించి డిపాజిట్ కింద రూ.15వేలు కట్టాలి.

ఎన్నికల షెడ్యూల్

రాష్ట్రపతి ఎన్నికకు 2022 జూన్ 9న కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ ‎కుమార్ షెడ్యూల్ ప్రకటించాడు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఎన్నికల కమిషనర్ తెలిపాడు.[3]

సంఖ్యఎన్నికల ప్రకియతేదీవారం
1.ఎన్నికకు నోటిఫికేషన్2022 జూన్ 15బుధవారం
2.నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ2022 జూన్ 29బుధవారం
3.నామినేషన్ల పరిశీలన2022 జూన్ 30గురువారం
4.నామినేషన్ల ఉపసంహ‍రణకు చివరి తేదీ2022 జులై 2శనివారం
5.ఎన్నిక2022 జూలై 18సోమవారం
6.కౌంటింగ్2022 జూలై 21గురువారం

ఎన్నిక విధానం

రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు ఉభయసభల ఎంపీలు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు ఎలక్ట్రోల్ కాలేజీ సభ్యులుగా ఉంటారు. లోక్‌సభ, రాజ్యసభలోని నామినేటెడ్ సభ్యులకు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేదని, శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్‌ కాలేజీలో ఉండరని ఈసీ తెలిపింది. ఓటింగ్‌ బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికకు జరిగే పోలింగ్‌లో ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎంపీలు కనీసం 10 రోజులు ముందుగా సమాచారం ఇచ్చి దేశంలో మరెక్కడైనా (ఏ అసెంబ్లీలోనైనా) ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.[4]

ఫలితాలు

2022 భారత అధ్యక్ష ఎన్నికల ఫలితాలు[5][6]
అభ్యర్థిసంకీర్ణవ్యక్తిగత

ఓట్లు

ఎలక్టోరల్

కాలేజీ ఓట్లు

%
ద్రౌపది ముర్ముఎన్‌డీఏ2,824676,80364.03
యశ్వంత్ సిన్హాఉమ్మడి ప్రతిపక్షం1,877380,17735.97
చెల్లుబాటు అయ్యే ఓట్లు4,7011,056,98098.89
ఖాళీ మరియు చెల్లని ఓట్లు5315,3971.11
మొత్తం4,7541,072,377100
నమోదైన ఓటర్లు / పోలింగ్ శాతం4,8091,086,43198.86

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు