లిబ్రిస్

(LIBRIS నుండి దారిమార్పు చెందింది)

లిబ్రిస్ (లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) అనేది స్టాక్‌హోమ్‌లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్ నిర్వహిస్తున్న స్వీడిష్ జాతీయ యూనియన్ కేటలాగ్. [1]దీనిద్వారా దేశవ్యాప్తంగా 65 లక్షల శీర్షికలను ఉచితంగా శోధించడం సాధ్యమవుతుంది. [2]

బిబ్లియోగ్రాఫిక్ రికార్డ్‌లతో పాటు, ప్రతి పుస్తకానికి లేదా ప్రచురణకూ లిబ్రిస్‌లో ఒక వ్యక్తుల అధికార ఫైల్‌ కూడా ఉంటుంది. ఇందులో వ్యక్తి పేరు, పుట్టుక, వృత్తి లను ఒక ప్రత్యేక ఐడెంటిఫైయర్‌తో అనుసంధానించే రికార్డ్ ఉంది. 


స్వీడిష్ యూనియన్ కేటలాగ్ కోసం MARC కోడ్ SE-LIBR, సాధారణీకరించిన కోడ్: selibr. [3]

LIBRIS అభివృద్ధి 1960ల మధ్యకాలంలో మొదలైంది. [4] రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రెండు దశాబ్దాల పాటు లైబ్రరీల హేతుబద్ధీకరణ సమస్యగా ఉండగా, 1965లో ఏర్పాటైన ఒక ప్రభుత్వ కమిటీ, పరిశోధనా గ్రంథాలయాల్లో కంప్యూటర్ల వినియోగంపై నివేదికను ప్రచురించింది. 1965 ప్రభుత్వ బడ్జెట్లో ఒక పరిశోధన లైబ్రరీ కౌన్సిల్‌ను సృష్టించారు ( Forskningsbiblioteksrådet, FBR). [5] ప్రాథమిక రూపకల్పన పత్రం, Biblioteksadministrativt ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (BAIS) లను 1970 మేలో ప్రచురించారు. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌కి సంక్షిప్తంగా LIBRIS అనే పేరు 1970 జూలై 1 న ప్రారంభమైన సాంకేతిక ఉపసంఘం కోసం ఉపయోగించారు. [6]వార్తాలేఖ LIBRIS-meddelanden (ISSN 0348-1891 ) 1972 నుండి ప్రచురిస్తోంది. [7] [8] ఇది 1997 నుండి ఆన్‌లైన్‌లో ఉంది.

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు