ప్రపంచ కప్

ప్రపంచ కప్ అనేది ప్రపంచ క్రీడా పోటీ. ఇందులో పాల్గొనే సంస్థలు - సాధారణంగా అంతర్జాతీయ జట్లు లేదా వారి దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కోసం పోటీపడతారు. ఆయా క్రీడలలో ప్రపంచ కప్ ఒక ప్రధాన పోటీగా పరిగణించబడుతుంది. విజేతలైనవారు ఆ క్రీడలో అత్యున్నత గౌరవాన్ని పొందుతారు, వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఏదేమైనా, కొన్ని క్రీడలలో ఒలింపిక్ టైటిల్ గెలవడమే ప్రతిష్టాత్మకంగా ఉంటుంది.

దస్త్రం:Tour da Taça da Copa do Mundo (14231974005).jpg
ఫుట్‌బాల్ ప్ర్ప్ంచ కప్ ట్రోఫీ

అనేక ప్రపంచ కప్ లు ఉన్నాకూడా ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్, ఫిఫా ప్రపంచ కప్ (అసోసియేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్, మొదట 1930లో జరిగింది)లు మాత్రమే "ప్రపంచ కప్" పోటీలుగా " పేరొందాయి.[1]

టీంల పోటీలు

కొన్ని క్రీడా సంస్థలు "ప్రపంచ ఛాంపియన్‌షిప్" లేదా దానికి సంబంధించిన పదాన్ని ఇష్టపడతాయి; కొందరు ప్రపంచ కప్, ప్రపంచ ఛాంపియన్‌షిప్ రెండింటినీ వేర్వేరు నియమాలతో నిర్వహిస్తారు. ప్రపంచ కప్ లేదా ప్రపంచ ఛాంపియన్‌షిప్ సాధారణంగా నాకౌట్ టోర్నమెంట్ రూపంలో చాలా రోజులు లేదా వారాలలో జరుగుతాయి. ప్రారంభంలో ఎక్కువ జట్లు పోటీలో ఉండి, చివరికి రెండు జట్లు మిగులుతాయి. టోర్నమెంట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఒకరు విజేతగా నిలుస్తారు. విజేత (లు) ప్రపంచ ఛాంపియన్ (లు) టైటిల్ తీసుకొని, తదుపరి పోటీ జరిగే వరకు (సాధారణంగా ఒకటి, రెండు, లేదా నాలుగు సంవత్సరాల తరువాత) తమవద్ద ఉంచుకుంటారు. ఫిఫా ప్రపంచ కప్ లేదా ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ వంటి పోటీలలో ఇలానే ఉంటుంది.

వ్యక్తిగత పోటీలు

వ్యక్తిగత క్రీడలలో ఏడాది పొడవునా జరిగే పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరచినవారు ప్రపంచ ఛాంపియన్ లేదా ప్రపంచ కప్ విజేతగా నిలుస్తారు. పోటీదారులు సంవత్సరకాలంలో అన్ని పోటీలలో పొందిన పాయింట్లను బట్టి పోటీలు ముగిసిన తర్వాత ప్రపంచ ఛాంపియన్ లేదా ప్రపంచ కప్ విజేతను నిర్ణయిస్తుంది. తదుపరి ప్రపంచ కప్ వరకు విజేతను ఛాంపియన్‌గా పరిగణిస్తారు.

రకాలు

  • ఫిఫా ప్రపంచ కప్ (పురుషుల ఫుట్‌బాల్; విశాలంగా చెప్పాలంటే "ప్రపంచ కప్".)
  • ఫిఫా మహిళల ప్రపంచ కప్ (మహిళల ఫుట్‌బాల్)
  • ప్రపంచ కప్ క్రికెట్, ప్రపంచ కప్ మహిళల క్రికెట్
  • ప్రపంచ కప్ వాలీబాల్
  • ప్రపంచ కప్ హాకీ
  • ప్రపంచ కప్ క్రికెట్

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు