పైపెరిన్

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
పైపెరిన్
పేర్లు
Preferred IUPAC name
(2E,4E)-5-(2H-1,3-Benzodioxol-5-yl)-1-(piperidin-1-yl)penta-2,4-dien-1-one
ఇతర పేర్లు
(2E,4E)-5-(Benzo[d][1,3]dioxol-5-yl)-1-(piperidin-1-yl)penta-2,4-dien-1-one
Piperoylpiperidine
Bioperine
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య[94-62-2]
పబ్ కెమ్638024
సి.హెచ్.ఇ.బి.ఐCHEBI:28821
SMILESO=C(N1CCCCC1)\C=C\C=C\c2ccc3OCOc3c2
  • InChI=1/C17H19NO3/c19-17(18-10-4-1-5-11-18)7-3-2-6-14-8-9-15-16(12-14)21-13-20-15/h2-3,6-9,12H,1,4-5,10-11,13H2/b6-2+,7-3+

ధర్మములు
C17H19NO3
మోలార్ ద్రవ్యరాశి285.34 g·mol−1
సాంద్రత1.193 g/cm3
ద్రవీభవన స్థానం 130 °C (266 °F; 403 K)
బాష్పీభవన స్థానంDecomposes
నీటిలో ద్రావణీయత
40 mg/l
ద్రావణీయత in ethanolsoluble
ద్రావణీయత in chloroform1 g/1.7 ml
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రముMSDS for piperine
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references
పైపెరిన్
స్కోవిల్లె స్కేల్150,000[1] SHU

పైపెరిన్ ఒక ఆల్కలాయిడ్. దీనిని నల్ల మిరియాలు(piper nigrum) ల నుండి ఉత్పత్తి చేస్తారు. మిరియాలకు ఘాటైన వాసన,రుచి అనేది పైపెరిన్ వలననే వస్తుంది. ఇది నీటిలో కొద్దిగా కరుగుతుంది., ఆల్కహాల్, క్లోరోఫాం, ఈథరులలో ఎక్కువగా కరుగుతుంది. పైపెరిన్ కొన్ని రకాల సాంప్రదాయ ఔషధాలలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. దీని వాణిజ్య ఉపయోగం ఆధునిక మూలికా వైద్యంలో ఉంది. పైపెరిన్ యొక్క మూడు ఐసోమర్లు (చావిసిన్, ఐసోచావిసిన్, ఐసోపిపెరిన్), పైపెరనైన్ (పైపెరిన్ యొక్క డైహైడ్రోఫారం) అనేవి నల్ల మిరియాల్లో లభ్యం.[2] నల్ల మిరియాలు 2-7.4% వరకు పైపెరిన్‌ను కలిగి ఉండును, మిరియాలమొక్క పెరిగిన నేల స్వభావం,వాతావరణ పరిస్థితులు,మొక్క రకాన్ని బట్టి పైపెరిన్ శాతంలో హెచ్చు థగ్గులు వుండును.[3]

చరిత్ర

పైపెరిడిన్ అనే ఆల్కలాయిడ్‌ను నల్ల మిరియాల నుండి హాన్స్ క్రిస్టియన్ ఓర్స్టెడ్ అనే శాస్త్రవేత్త 1819 లో కనుగొన్నారు, వేరు చేశారు.[4][5]

పైపెరిన్ ఉత్పత్తి

నీటిలో కరిగే సామర్థ్యం తక్కువగా ఉన్నందున, డైక్లోరోమీథేన్ వంటి సేంద్రీయ ద్రావకాలను ఉపయోగించి పైపెరిన్ సాధారణంగా నల్ల మిరియాలు నుండి సంగ్రహించబడుతుంది.[6]నల్ల మిరియాలు పైపెరిన్ యొక్క నాలుగు ఐసోమెరిక్ రూపాలను కలిగి ఉంటాయి, అవి ట్రాన్స్-ట్రాన్స్ ఐసోమర్ (1, పైపెరిన్), సిస్-ట్రాన్స్ ఐసోమర్ (2, ఐసోపిపెరిన్), సిస్-సిస్ ఐసోమర్ (చావిసిన్, 3),, ట్రాన్స్-సిస్ ఐసోమర్ (ఐసోచావిసిన్, 4) పైపెరైన్‌పై తర్వాత జరిపిన పరిశోధనలలో నల్ల మిరియాల సారంలో ఉన్న కొన్ని ఇతర ఆల్కలాయిడ్‌లను గుర్తించారు. అవి పైపెరనైన్, పైపెరెటిన్,పైపెరిలిన్ A,పైపెరోలిన్ B,, పైపెరిసిన్లు.[7]మిరియాల నుండి పైపెరిన్ ను ఇథనాల్,మరియుగడ్డకట్టిన ఎసిటిక్ ఆమ్లం లను ద్రావణిగా ఉపయోగించి మొదట ముడి పైపెరైన్‌ ను ఉత్పత్తి చేస్తారు.వివిధ పద్దతులలో రసాయానాలను వాడి పైపెరిన్ ను శుద్ధి చేస్తారు.[7]

భౌతిక గుణాలు

పైపెరిన్ ఘన రూపంలో వుండును. సహజంగా రంగులేని, తెల్లని స్పటిక ఘనరూపం అయినప్పటికీ, సాధారణంగా లేత పసుపు రంగు కలిగి వుండును.[8]

భౌతిక గుణాల పట్టిక [8]

సంఖ్యగుణంమితి/శాతం
1ఫార్ములాC17H19NO3
2అణు భారం285.34 g/mol
3ద్రవీభవన ఉష్ణోగ్రత129 °C
4వేపరు ప్రెసరు0.00000013 [mmHg]
5సాంద్రత1.193
6మరుగు ఉష్ణోగ్రత498.00 to 499.00 °C. (1 atm )
7ద్రావణీయతఇథనాల్ ,ఈథరు లో క రుగును
8నీటిలో ద్రావణీయత0.04 mg/mL at 18 °C

రసాయనిక ధర్మాలు

పైపెరిన్ ను ఒక క్షారము ఉపయోగించి పిపెరిడిన్, పైపెరిక్ ఆమ్లం గా హైడ్రోలైజ్ చేయవచ్చు. [5]

పైపెరిన్ ఉపయోగాలు

1. పైపెరిన్ అనేక ఔషధ ప్రభావాలను, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నది , ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది , ఇన్సులిన్-నిరోధకత తగ్గింపు గుణం వున్నది , శోథ నిరోధక ప్రభావం వున్నది , హెపాటిక్ స్టీటోసిస్ ను తగ్గిస్తుంది.[9]

2.పైపెరిన్ అనేది ఒక రకమైన అమైడ్ ఆల్కలాయిడ్, ఇది యాంటీఆక్సిడెంట్,యాంటీక్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటీహైపెర్టెన్సివ్, హెపాటోప్రొటెక్టివ్, న్యూరోప్రొటెక్టివ్, జీవ లభ్యత, సంతానోత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలను మెరుగుపరుచడం వంటి వంటి ప్లియోట్రోపిక్ లక్షణాలను ప్రదర్శిస్తుంది.[10]

ఇవికూడా చూడండి

మూలాలు

మార్గదర్శకపు మెనూ