విన్‌క్రిస్టీన్

విన్‌క్రిస్టీన్ (Vincristine) అనేది మడగాస్కర్ పెరివింకిల్, కాథరాంథస్ రోసస్‌లో(బిళ్ళ గన్నేరు)మొక్కలో కనిపించే వింకా ఆల్కలాయిడ్. ఇది ల్యుకేమియా, లింఫోమా, మైలోమా, రొమ్ము క్యాన్సర్ మరియు తల మరియు మెడ క్యాన్సర్ చికిత్సకు కీమోథెరపీ ఔషధంగా (సాధారణంగా సంబంధిత సల్ఫేట్ లవణం వలె) ఉపయోగించబడుతుంది. ఇది ట్యూబులిన్ మాడ్యులేటర్, మైక్రోటూబ్యూల్-అస్థిరపరిచే ఏజెంట్, ప్లాంట్ మెటాబోలైట్, యాంటినియోప్లాస్టిక్ ఏజెంట్ మరియు డ్రగ్‌గాప్రాముఖ్యత కలిగిఉంది. ఇది మిథైల్ ఈస్టర్, అసిటేట్ ఈస్టర్, తృతీయ ఆల్కహాల్, ఫార్మామైడ్‌ల సముహానికి చెందినది, ఆర్గానిక్ హెటెరోపెంటాసైక్లిక్ సమ్మేళనం, ఆర్గానిక్ హెటెరోటెట్రాసైక్లిక్ సమ్మేళనం, తృతీయ అమైనో సమ్మేళనం మరియు వింకా ఆల్కలాయిడ్.ఇది విన్‌క్రిస్టిన్ (2+) యొక్క సంయోగ ఆధారం. ఇది వింకాలేయుకోబ్లాస్టైన్ యొక్క హైడ్రైడ్ నుండి ఉద్భవించింది.[1]విన్‌క్రిస్టీన్ అనేది టాక్సస్ కస్పిడేటా, ఓఫియోపర్మా వెంటోసా మరియు ఇతర జీవులలో లభించే సహజమైన ఉత్పత్తి.

2 D చిత్రం
2 గిఫ్

చరిత్ర

విన్కా ఆల్కలాయిడ్స్ యొక్క సంభావ్య చికిత్సా లక్షణాలను పరిశోధకులు పరిశోధించడం ప్రారంభించిన 1950ల ప్రారంభంలో విన్‌క్రిస్టీన్ చరిత్రను గుర్తించవచ్చు. ఎలుకలు మరియు పిల్లలలో తీవ్రమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియా (ALL) కోసం విన్‌క్రిస్టీన్ యాంటీ-ల్యుకేమిక్ చర్యను చూపించిందని పరిశోధకులు కనుగొన్నారు. జూలై 1963లో, విన్‌క్రిస్టీన్ U.S. నుండి ఆమోదం పొందింది. ఆన్‌కోవిన్ అనే వాణిజ్య పేరుతో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA).[2]

మడగాస్కర్‌లోని స్థానిక ప్రజలు పెరివింకిల్ యొక్క ఔషధ గుణాలను మొదట కనుగొన్నారు, మొదట్లో మధుమేహం చికిత్సకు మొక్క యొక్క సారాలను ఉపయోగించారు. కానీ మొక్కలను ప్రపంచవ్యాప్తంగా కంటి ఇన్ఫెక్షన్లు మరియు తామర నుండి మలేరియా, అధిక రక్తపోటు మరియు కందిరీగ కుట్టడం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. సాంప్రదాయ వైద్యంలో వారి ఉపయోగం యొక్క కథ 1950 లలో జేమ్స్ కొలిప్ యొక్క ల్యాబ్‌లో ప్రారంభమయింది.1920 లలో క్లినికల్ ట్రయల్స్ కోసం మొదటిసారి ఇన్సులిన్‌ను శుద్ధి చేసిన టొరంటోలోని కెనడియన్ పరిశోధకులలో ఒకరు జేమ్స్ కొలిప్.కొలిప్ బృందం, రాబర్ట్ నోబెల్ అనే డాక్తరుతో సహా, మధుమేహం కోసం కొత్త నోటి ఔషధాలను కనుగొనాలనే ఆశతో సాంప్రదాయ మూలికా ఔషధాల లక్షణాలను పరిశోధించారు. కెనడాలో శిక్షణ పొందిన జమైకాలో పనిచేస్తున్న నల్లజాతి శస్త్రవైద్యుడు CD జాన్స్టన్, మధుమేహాన్ని నియంత్రించడానికి సాంప్రదాయకంగా ఉపయోగించే పెరివింకిల్ ఆకులతో తయారు చేసిన టీ గురించి వారికి చెప్పి, వారికి పరీక్ష కోసం మొక్క యొక్క నమూనాను పంపాడు. దురదృష్టవశాత్తు, ఎలుకలకు టీ ఇవ్వడం వల్ల వాటి రక్తంలో చక్కెర లేదా హార్మోన్ స్థాయిలపై ఎలాంటి ప్రభావం లేదు. ప్రయోగాన్ని వదిలిపెట్టే బదులు, ఏమి జరిగిందో చూడటానికి, పెరివింకిల్ సారాలను జంతువులలోకి ఇంజెక్ట్ చేయాలని నోబెల్ నిర్ణయించుకుని సూది మందు రూపంలొ ఇచ్చాడు.ఆసక్తికరంగా, సూదిమందు ఇచ్చిన వాటిల్లో వ్యాధి గడ్డలుపెరిగాయి.[3]పోలిష్-జన్మించిన శాస్త్రవేత్త మరియు హోలోకాస్ట్ ప్రాణాలతో బయటపడిన హలీనా క్జాజ్‌కోవ్‌స్కీ-రాబిన్సన్ రంగంలోకి వచ్చారు. కెమికల్ ఇంజనీర్, అయిన ఆమె రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్‌లోని ప్రతిష్టాత్మక కరోలిస్కా ఇన్‌స్టిట్యూట్‌లో క్యాన్సర్ రీసెర్చ్ ల్యాబ్‌లో పనిచేసింది మరియు ఆమె కుటుంబం కెనడాకు వెళ్లినప్పుడు కొలిప్ ల్యాబ్‌లో లేబొరేటరీ టెక్నీషియన్‌గా పనిచేసింది.నోబెల్ పర్యవేక్షణలో, ఎలుకలు పెరివింకిల్(బిళ్ళగన్నేరు) టీ తాగిన తర్వాత వాటిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కొలవడం ఆమె పని. కానీ ఆమె స్వీడన్‌లో నేర్చుకున్నఇన్‌ఫెక్షన్-పోరాట తెల్ల రక్త కణాల సంఖ్యను చూసే టెక్నిక్‌ను కూడా తన కొత్త పరిశోధన లొ వర్తింపజేయడానికి కూడా ఆసక్తిగా గమనించేది.[3]

ప్రయోగాలు ఇంజెక్షన్ల వైపుకు వెళ్ళినప్పుడు, క్జాజ్కోవ్స్కీ-రాబిన్సన్ జంతువుల తెల్ల రక్త కణాల గణనలు క్షీణించడాన్ని గమనించారు, అవి మొక్కల సారం ద్వారా చంపబడుతున్నాయని గమనించింది. ఇది తెల్ల రక్త కణాల అధిక-విస్తరణ ఫలితంగా. లుకేమియా మరియు లింఫోమా - రక్తం మరియు ఎముక మజ్జ క్యాన్సర్‌లకు సంభావ్య చికిత్సగా నోబెల్ ఆసక్తిని రేకెత్తించింది. తదుపరి దశ మొక్కలలో క్రియాశీల పదార్ధాన్ని వేరుచేయడం. సమ్మేళనాన్ని శుద్ధి చేయడానికి క్రోమాటోగ్రఫీ అనే టెక్నిక్‌ను ప్రయత్నించాలని క్జాజ్‌కోవ్స్కీ-రాబిన్సన్ ఇప్పటికే సిఫార్సు చేశారు.[3]

అయితే 1954లో చార్లెస్ బీర్ ' అనే రసాయన శాస్త్రవేత్త ల్యాబ్‌లో చేరిన తరువా తఅది వాస్తవంగా వేరు చెయ్యడం జరిగింది. అతను దానికి విన్కాలేయుకోబ్లాస్టైన్ అని పిలిచాడు. త్వరగా విన్‌బ్లాస్టైన్‌గా కుదించాడు మరియు అతని బృందం జంతువులలోని క్యాన్సర్‌లపై పరీక్షించడం ప్రారంభించింది.

విన్‌క్రిస్టీన్ ను మొక్క నుండి వేరు చెయ్యడం

విన్‌బ్లాస్టిన్ మరియు విన్‌క్రిస్టీన్, క్యాన్సర్‌కు అద్భుత ఔషధాలు, పొలంలో పెరిగిన కాథరాంథస్ రోజస్ మొక్క ఆకుల నుండి కణజాల సంవర్ధనం ద్వారా [4]అలాగే జీవకోశము సంవర్ధనం ద్వారా [5],. మొలక/చిగురు సంవర్ధనం[6],మరియు పాక్షిక సంష్లెషణ లేదా సంపుర్ణ సంష్లేషణ వంటి పద్ధతుల ద్వారా వేరుచేయబడుతున్నాయి.[7]

భౌతిక ధర్మాలు

విన్‌క్రిస్టీన్ తెల్లటి స్ఫటికాకార ఘన పదార్థంగా కనిపిస్తుంది.[8]

  • IUPAC పేరు:methyl (1R,9R,10S,11R,12R,19R)-11-acetyloxy-12-ethyl-4-[(13S,15S,17S)-17-ethyl-17-hydroxy-13-methoxycarbonyl-1,11-diazatetracyclo[13.3.1.04,12.05,10]nonadeca-4(12),5,7,9-tetraen-13-yl]-8-formyl-10-hydroxy-5-methoxy-8,16-diazapentacyclo[10.6.1.01,9.02,7.016,19]nonadeca-2,4,6,13-tetraene-10-carboxylate[9]
లక్షణం/గుణంమితి/విలువ
అణు ఫార్ములాC46H56N4O10
అణు భారం825.0 గ్రా/మోల్
ద్రవీభవన ఉష్ణోగ్రత218-220°C[10]
మరుగు స్థానం761.92°C (స్థూల అంచనా)[11]
సాంద్రత1.1539(స్థూల అంచనా)[11]
వక్రీభవన గుణకం1.6000(అంచనా)[11]
ద్రావణీయతక్లోరోఫామ్, డైక్లోరోమీథేన్, ఇథైల్ అసిటేట్, DMSO, అసిటోన్ మొదలైన వాటిలో కరుగుతుంది.

వియోగం చెందెలా వేడి చేసినప్పుడు అది నైట్రోజన్ ఆక్సైడ్ల విషపూరిత పొగలను విడుదల చేస్తుంది.[12][10]

ఔషధంగా వినియోగం

  • విన్‌క్రిస్టిన్ అనేది వింకా ఆల్కలాయిడ్స్ అనే ఔషధాల సమూహానికి చెందిన కెమోథెరపీ ఔషధం.విన్‌క్రిస్టీన్ క్యాన్సర్ కణాలను 2 కొత్త కణాలుగా విడిపోకుండా ఆపడం ద్వారా పనిచేస్తుంది.కాబట్టి, ఇది క్యాన్సర్ పెరుగుదలను ఆపుతుంది.[13]విన్‌క్రిస్టిన్ వివిధ రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగి స్తారు. ఇది క్యాన్సర్ కెమోథెరపీ ఔషధం, దీనిని సాధారణంగా ఇతర కెమోథెరపీ మందులతో కలిపి క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించడానికి లేదా ఆపడానికి ఉపయోగిస్తారు.[14]

ఔషధంగా ముందుజాగ్రత్తలు

  • ఈ ఔషధం ఒక ఆరోగ్య సంరక్షణ నిపుణుడి ద్వారా సిరలోకి ఇంజెక్షన్ ద్వారా మాత్రమే ఇవ్వాలి. ఇది డాక్టర్ నిర్దేశించిన షెడ్యూల్‌లో సాధారణంగా వారానికి ఒకసారి ఇవ్వబడుతుంది.మోతాదు రోగి వైద్య పరిస్థితి, శరీర పరిమాణం మరియు చికిత్సకు ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది. చిన్న పిల్లల, మోతాదు కూడా బరువుపై ఆధారపడి ఉంటుంది.[14]వైద్యుడు సూచించకపోతే, ఈ మందులను ఉపయోగిస్తున్నప్పుడు పుష్కలంగా ద్రవాలు త్రాగాలి. ఇది కిడ్నీకి వచ్చే కొన్ని దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

దుష్పలితాలు

ఈ మందు వాడటం కొందరిలొ వికారం, వాంతులు, బరువు తగ్గడం, అతిసారం, నోటి పుండ్లు, మైకము లేదా తలనొప్పి సంభవించవచ్చు. ఈ ప్రభావాలు అధ్వాన్నంగా ఉంటే, వెంటనే డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ చెప్పాలి. ఈ ఔషధం కూడా మలబద్ధకానికి కారణమవుతుంది, ఇది కొన్ని సందర్భాల్లో తీవ్రంగా మారవచ్చు.[14]తాత్కాలికంగా జుట్టు రాలిపోవచ్చు. చికిత్స ముగిసిన తర్వాత సాధారణ జుట్టు పెరుగుదల తిరిగి రావొచ్చు.

ఇవి కూడా చదవండి

మూలాలు