మోలార్ ద్రవ్యరాశి

రసాయన శాస్త్రంలో, ఓ రసాయన సమ్మేళనపు శాంపిల్‌ను తీసుకుని దాని ద్రవ్యరాశిని ఆ శాంపిల్‌లో ఉన్న మొత్తం మోల్‌ల సంఖ్యతో భాగహారించగా వచ్చే సంఖ్యను ఆ సమ్మేళనపు మోలార్ ద్రవ్యరాశి అంటారు. మోలార్ ద్రవ్యరాశి అనేది ఒక పదార్ధపు ధర్మం. దాని పరమాణు ధర్మం కాదు. మోలార్ ద్రవ్యరాశి అనేది సమ్మేళనంలో ఉండే అనేక ఉదాహరణల సగటు. ఇది ఐసోటోపుల ఉనికి కారణంగా ఇది మారుతూ ఉంటుంది. సర్వసాధారణంగా, మోలార్ ద్రవ్యరాశి ప్రామాణిక పరమాణు భారాల ఆధారంగా లెక్కిస్తారు. ఇది భూమిపై ఉన్న పరమాణువుల ఐసోటోపుల సాపేక్ష సమృద్ధి యొక్క ప్రమేయం. పదార్ధపు ద్రవ్యరాశి, ఆ పదార్ధం మొత్తం పరిమాణం ల మధ్య సంబంధాన్ని మోలార్ ద్రవ్యరాశి ఇస్తుంది.

మోలార్ ద్రవ్యరాశి
సాధారణ చిహ్నాలు
M
SI యూనిట్kg/mol
ఇతర యూనిట్లు
g/mol

పరమాణు ద్రవ్యరాశి, ఫార్ములా ద్రవ్యరాశి అనే మాటలను సాధారణంగా మోలార్ ద్రవ్యరాశికి పర్యాయపదాలుగా ఉపయోగిస్తారు, ముఖ్యంగా పరమాణు సమ్మేళనాలకు; అయితే, అత్యంత అధికారిక వర్గాలు దానిని విభిన్నంగా నిర్వచించాయి. వ్యత్యాసం ఏమిటంటే, పరమాణు ద్రవ్యరాశి అనేది ఒక నిర్దిష్ట కణం లేదా అణువు యొక్క ద్రవ్యరాశి, అయితే మోలార్ ద్రవ్యరాశి అనేక కణాలు లేదా అణువుల సగటు.


కొన్ని మూలకాలు సాధారణంగా అణువులుగా లభిస్తాయి. ఉదా హైడ్రోజన్ (H2), సల్ఫర్ (S8 ), క్లోరిన్ (Cl2 ). ఈ మూలకాల మోలార్ ద్రవ్యరాశి, పరమాణువుల మోలార్ ద్రవ్యరాశిని ప్రతి అణువులోని పరమాణువుల సంఖ్యతో గుణిస్తే వస్తుంది.:

మూలకాల యొక్క మోలార్ ద్రవ్యరాశి

ఒక మూలకపు సాపేక్ష పరమాణు ద్రవ్యరాశిని మోలార్ ద్రవ్యరాశి స్థిరాంకంతో గుణిస్తే ఆమూలకపు పరమాణువుల మోలార్ ద్రవ్యరాశి వస్తుంది. మోలార్ ద్రవ్యరాశి స్థిరాంకం Mu = 0.99999999965(30)×10−3 kg⋅mol−1.[1] భూమిపై సాధారణంగా ఉండే ఐసోటోపులతో కూడిన నమూనాల పరమాణు బరువును ప్రామాణిక పరమాణు బరువు లేదా సాంప్రదాయ పరమాణు బరువు ద్వారా అంచనా వేయవచ్చు.

M(H) = 1.00797(7) × Mu = 1.00797(7) g/mol
M(S) = 32.065(5) × Mu = 32.065(5) g/mol
M(Cl) = 35.453(2) × Mu = 35.453(2) g/mol
M(Fe) = 55.845(2) × Mu = 55.845(2) g/mol.

మోలార్ ద్రవ్యరాశి స్థిరాంకం ద్వారా గుణించడం అనేది డైమెన్షనల్‌గా లెక్క సరైనదని నిర్ధారిస్తుంది: ప్రామాణిక సాపేక్ష పరమాణు ద్రవ్యరాశి యూనిట్లు లేని పరిమాణాలు (అంటే, స్వచ్ఛమైన సంఖ్యలు) అయితే మోలార్ ద్రవ్యరాశి యూనిట్‌లను కలిగి ఉంటుంది (ఈ సందర్భంలో, గ్రాములు/మోల్‌).

M(H
2
) = 2 × 1.007 97(7) × Mu = 2.01588(14) g/mol
M(S
8
) = 8 × 32.065(5) × Mu = 256.52(4) g/mol
M(Cl
2
) = 2 × 35.453(2) × Mu = 70.906(4) g/mol.

సమ్మేళనాల మోలార్ ద్రవ్యరాశి

సమ్మేళనం మోలార్ ద్రవ్యరాశి, ఆ సమ్మేళనం లోని పరమాణువుల సాపేక్ష పరమాణు ద్రవ్యరాశుల మొత్తం A
r
ను మోలార్ ద్రవ్యరాశి స్థిరాంకం M
u
తో గుణిస్తే వస్తుంది:

ఇక్కడ, M
r
అనేది సాపేక్ష మోలార్ ద్రవ్యరాశి, దీనిని ఫార్ములా వెయిట్ అని కూడా అంటారు. సాధారణ ఐసోటోపుల కూర్పుతో భూమిపై లభించే నమూనాల ప్రామాణిక పరమాణు భారాన్ని ఉజ్జాయింపుగా ఆ నమూనా యొక్క సాపేక్ష పరమాణు ద్రవ్యరాశి అని అనుకోవచ్చు. ఉదాహరణలు:

M(NaCl) = [22.98976928(2) + 35.453(2)] × 1.000000 g/mol = 58.443(2) g/mol
M(C
12
H
22
O
11
) = ([12 × 12.0107(8)] + [22 × 1.00794(7)] + [11 × 15.9994(3)]) × 1.000000 g/mol = 342.297(14) g/mol.

సమ్మేళనాల మిశ్రమాలకు సగటు మోలార్ ద్రవ్యరాశిని నిర్వచించవచ్చు. పాలిమర్ సైన్స్‌లో ఇది చాలా ముఖ్యమైనది, ఇక్కడ వివిధ పాలిమర్ అణువులు వేర్వేరు సంఖ్యలో మోనోమర్ యూనిట్‌లను కలిగి ఉండవచ్చు (నాన్-యూనిఫాం పాలిమర్‌లు). [2] [3]

మూలాలు