అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి ఒక తెలుగు సినీ రచయిత, దర్శకుడు.[3][4] పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.[5] అంతకు మునుపు కందిరీగ, మసాలా, ఆగడు మొదలైన సినిమాలకు రచయితగా పనిచేశాడు.

అనిల్ రావిపూడి
జననం (1982-11-23) 1982 నవంబరు 23 (వయసు 41)[1][2]
విద్యఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
విద్యాసంస్థవిజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల
వృత్తిసినీ రచయిత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2008 - ప్రస్తుతం
బంధువులుఅరుణ్ ప్రసాద్ (బాబాయి)

బాల్యం, విద్యాభ్యాసం

అనిల్ స్వస్థలం ప్రకాశం జిల్లా, చిలుకూరువారి పాలెం. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా, అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు. [4] అతని ప్రాథమిక పాఠశాల చదువు మహబూబ్ నగర్ లో సాగింది. చిన్నప్పటి నుంచే గ్రామంలో ఉండే టెంటు హాలులో కూర్చుని సినిమాలు చూసే అలవాటు కలిగింది. తండ్రికి ఆర్టీసీలో డ్రైవరుగా ఉద్యోగం వచ్చింది. తర్వాత వారి కుటుంబం అద్దంకికి తరలి వచ్చింది. పదో తరగతి దాకా అద్దంకిలో తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరులో చదివాడు. తర్వాత వడ్లమూడి లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదివాడు.

సినిమాలు

ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీరంగంవైపు వచ్చాడు. ఇతని బాబాయి అరుణ్ ప్రసాద్ కూడా సినీ దర్శకుడే. పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు చిత్ర దర్శకుడు అతను. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు. 2005 లో విడుదలైన గౌతమ్ ఎస్.ఎస్.సి. చిత్రానికి సహాయకుడిగా పనిచేశాడు.[6]

రచయితగా

సంవత్సరంచలన చిత్రంపాత్ర
2008శౌర్యంసంభాషణ రచయిత
2009శంఖంసంభాషణ రచయిత
2011కందిరీగకథ/ సంభాషణ రచయిత
2012దరువుసంభాషణ రచయిత
2012సుడిగాడుసంభాషణ రచయిత
2013మసాలాసంభాషణ రచయిత
2014ఆగడుకథ/ సంభాషణ రచయిత
2015పండగ చేస్కోకథ రచయిత
2021గాలి సంపత్స్క్రీన్ ప్లే రచయిత

దర్శకుడిగా

దర్శకుడిగా అనిల్ తొలి సినిమా కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన పటాస్. రెండో చిత్రం సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్. రవితేజ కథానాయకుడిగా నటించిన రాజా ది గ్రేట్ 2017 లో విడుదలైంది.

సంవత్సరంచలన చిత్రంతారాగణం
2018ఎఫ్2దగ్గుబాటి వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా
2017రాజా ది గ్రేట్రవితేజ , మెహ్రీన్ పిర్జాదా
2016సుప్రీమ్.సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా
2015పటాస్కళ్యాణ్ రామ్, శృతి సోది
2020సరిలేరు నీకెవ్వరుమహేష్ బాబు, రష్మిక మందన్న
2023భగవంత్ కేసరి[7]నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌శ్రీలీల

అవార్డ్స్

అనిల్‌ రావిపూడి 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో 2019గాను మోస్ట్‌ పాపులర్‌ డైరెక్టర్‌ (ఎఫ్2) సినిమాకు గాను అవార్డును అందుకున్నాడు.[8]

మూలాలు

బయట లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు