ఆంటోని రాజు

ఆంటోని రాజు కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై విజయన్ రెండవ మంత్రివర్గంలో  2021 మే 2 నుండి 2023 డిసెంబరు 24 రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు.[2]

ఆంటోని రాజు
ఆంటోని రాజు


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
20 మే 2021 (2021-05-20)
ముందువీఎస్ శివకుమార్
నియోజకవర్గంతిరువనంతపురం

రోడ్డు రవాణా, మోటారు వాహనాలు, జల రవాణా మంత్రి
పదవీ కాలం
2 మే 2021 (2021-05-02) – 24 డిసెంబరు 2023 (2023-12-24)
ముందుఎకె శశీంద్రన్
నియోజకవర్గంతిరువనంతపురం

ఎమ్మెల్యే
పదవీ కాలం
మే 20, 1996 (1996-05-20) – మే 10, 2001 (2001-05-10)
ముందుఎం.ఎం. హసన్
తరువాతఎం.వీ. రాఘవన్
నియోజకవర్గంతిరువనంతపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1954-12-18) 1954 డిసెంబరు 18 (వయసు 69)
త్రివేండ్రం
రాజకీయ పార్టీజనాధిపత్య కేరళ కాంగ్రెస్[1]
నివాసంనాంథెన్‌కోడ్, తిరువనంతపురం , కేరళ
వెబ్‌సైటుwww.antonyraju.in

జననం, విద్యాభాస్యం

ఆంటోని రాజు 1954లో ఎస్ అల్ఫోన్స్, టి లూర్దమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తుంబలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్, మార్ ఇవానియోస్ కాలేజీలో కేరళ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అయిన కేరళ స్టూడెంట్స్ కాంగ్రెస్ (KSC) యూనిట్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. ఆంటోని రాజు తిరువనంతపురంలోని కేరళ లా అకాడమీ లా కాలేజీ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొంది 1982లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నాడు.

వివాహం

ఆంటోని రాజు గ్రేసీని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు, డాక్టర్ రోష్ని, రోహన్ ఉన్నారు.[3]

రాజకీయ జీవితం

ఆంటోని రాజు కేరళ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1991లో తిరువనంతపురం వెస్ట్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంఎం హసన్‌పై చేతిలో ఓడిపోయాడు. ఆయన 1996లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంఎం హసన్‌ను ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 2001లో కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ అభ్యర్థి ఎంవీ రాఘవన్ చేతిలో ఓడిపోయాడు. ఆంటోని రాజు న్యాయవాద వృత్తిపై వచ్చిన వివాదాల కారణంగా  2006, 2011 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన 2016లో పోటీ చేసి జానాధిపత్య కేరళ కాంగ్రెస్‌ అభ్యర్థి రాజు విఎస్ శివకుమార్ చేతిలో ఓడిపోయి తిరిగి 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై  2021 మే 2[4][5] నుండి 2023 డిసెంబరు 24 రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు.[6][7]

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు