ఆంధ్రప్రదేశ్‌లో విద్య

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ స్థాయిలలో విద్యా నిర్వహణ వివిధ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది.

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు

చరిత్ర

స్త్రీ విద్య

1953 సంవత్సరం వరకూ నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసు రాజధానిగా కలిగిన మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. చారిత్రికంగా 1881 నాటికి అప్పటి రాష్ట్ర రాజధాని మద్రాసు నగరంలో దాదాపుగా 543 బాలికల పాఠశాలలు ఉండేవి. వాటిలో ఆనాటికి దాదాపుగా 32, 341మంది విద్యార్థినులే ఉన్నారు. మద్రాసులోనే 1908 నాటికి 1238 బాలికల పాఠశాలలు, వాటిలో చదువుకునేందుకు 1, 68, 697 మంది విద్యార్థినులు చదువుకునేవారు.[1]

నిర్వహణ

పాఠశాల విద్య

పాఠశాల విద్యాశాఖ[2] పాఠశాల విద్యను నిర్వహిస్తుంది.

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం అక్షరాస్యత 67.41%గా నమోదైంది. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యను ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే, ఇంకా ప్రైవేట్ పాఠశాలలు అందిస్తాయి. వీటిని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ[3] నియంత్రిస్తుంది, ప్రభుత్వ పాఠశాలలను నిర్వహిస్తుంది.[4][5] రాష్టంలో గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాలలు కూడా ఉన్నాయి.[6][7] పిల్లలు, పాఠశాల సమాచార నివేదిక 2018–19 ప్రకారం, మొత్తం 62,063 పాఠశాలల్లో 70,41,568 విద్యార్థులు ఉన్నారు.[8][9] ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్ఎస్సి) పరీక్షలు నిర్వహిస్తుంది.[10] 2019 ఎస్ఎస్సి పరీక్షకు 600,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 5,464 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణతతో పాటు మొత్తంగా 94.88% ఉత్తీర్ణత నమోదైంది.[11] బోధనా మాధ్యమాలు ప్రధానంగా తెలుగు, ఇంగ్లీష్ అయినప్పటికి, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒడియా, తమిళ భాషలు కూడా ఉన్నాయి.[12]

2020-21 విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలలో 1-6 తరగతుల విద్యా మాధ్యమంగా తెలుగును తొలగించి దాని స్థానంలో ఆంగ్లం ప్రవేశపెట్టాలని, ఆ తరువాత సంవత్సరం నుండి పై తరగతులకు ఈ పద్ధతిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.[13] ఇది కోర్టులో వ్యాజ్యం వలన అమలు కాలేదు.

ఇంటర్మీడియట్ విద్య

ఇంటర్మీడియట్ విద్యను ఇంటర్మీడియట్ విద్యామండలి (ఆంధ్రప్రదేశ్)[14] నిర్వహిస్తుంది.

ఉన్నత విద్య

రాష్ట్రంలో ఉన్నత విద్యను ఉన్నత విద్యా శాఖ[15] నిర్వహిస్తుంది. ఉన్నత విద్యా పరిషత్ అనే సంస్థ ఉన్నత విద్యను సమన్వయం చేస్తుంది.[16]

సాంకేతిక విద్య

సాంకేతిక విద్యను సాంకేతిక విద్యా శాఖ[17] నియంత్రిస్తుంది.

ఇతరాలు

ఇవి కాక, భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐటిఐ కోర్సుల ద్వారా నిపుణులైన కార్మికులను తయారు చేస్తున్నది. వైద్య విద్య జాతీయ స్థాయిలో నియంత్రించబడుతుంది.

విద్యా సంస్ధలు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), ఐఐఎం (IIM) విశాఖపట్నం, ఐఐటి (IIT) తిరుపతి, ఎన్ఐటి (NIT) తాడేపల్లిగూడెం, ఐఐఐటిడిఎమ్ (IITDM) కర్నూలు,[18] ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIOPAE),[19] ఎన్ఐడివి (NIDV), సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఐఐటి (IIIT) శ్రీ సిటీ, ఐఐఎస్ఇఆర్ (IISER) తిరుపతి, వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు, ఐఐఎఫ్టి (‌IIFT) కాకినాడ ముఖ్యమైన కేంద్ర విశ్వవిద్యాలయాలు. గ్రామీణ యువకుల విద్యా అవసరాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 లో రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జియుకెటి) ను స్థాపించింది.[20] యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకారం, గీతం, కెఎల్ విశ్వవిద్యాలయం, విజ్ఞాన్ విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలుగా పరిగణించబడతాయి.[21] ఉద్యానవన, న్యాయశాస్త్రం, వైద్యశాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, వేదాలు, జంతు వైద్య శాస్త్రాలలో ఉన్నత విద్యను అందించేందుకు 18 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.[22] రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో 1926 లో స్థాపించబడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పురాతనమైనది.[23][24]

చదువులకు ప్రవేశ పరీక్షలు

ఉపాధ్యాయ శిక్షణ ప్రవేశాలు

తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్పస్థానం, సమాజంలో గౌరవం ఉపాధ్యాయులకే ఉంది. దీనికొరకు వివిధ ప్రవేశపరీక్షలున్నాయి[25]

  1. డైట్ సెట్ (DIETCET) : ఉపాధ్యాయ శిక్షణ డిప్లొమా (డిఇడి) కోర్సులకొరకు: రెండు సంవత్సరముల ఉపాధ్యాయ శిక్షణ డిప్లొమా (డిఇడి) కోర్సులకొరకు ప్రవేశ పరీక్ష. 23 ప్రభుత్వ జిల్లా ఉపాధి, శిక్షణ సంస్థ (District Institute of Education and Training ), 220 ప్రైవేటు సంస్ధలలో ఈ కోర్సులు ఉన్నాయి. పరీక్ష ఏప్రిల్, మే నెలలో జరుగుతుంది. ఇంటర్మీడియట్ విద్య (వృత్తి సంబంధము కాని కోర్సులు) లేక సరిసమానమైన పరీక్షలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత అర్హత. సామాజిక (sc, st), శారీరక బలహీన వర్గాలకు సడలింపు ఉంది. వయస్సు పరంగా సెప్టెంబరు 1 న 17 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
  2. ఎడ్సెట్ ( EdCET) : ఉపాధ్యాయ శిక్షణ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల (బిఇడి) కొరకు
  3. పిఈసెట్ (PECET) : ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఆటల శిక్షణ) అండర్ గ్రాడ్యుయేట్, (బిపిఇడి) డిప్లొమా (యుజిడిపిడి) కోర్సులుకొరకు

ఇతర వృత్తివిద్యల ప్రవేశాలు

  1. సీప్ (CEEP) : పాలిటెక్నిక్ (డిప్లమా) కోర్సులకోరకు.
  2. ఎప్సెట్ (EAPCET) : ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసి కోర్సులకొరకు. (బిఇ, బిఫార్మ్, బిఅగ్రి..)
  3. ఈసెట్ ( ECET) : ఇంజనీరింగ్, పార్మా డిగ్రీ కోర్సులో, మొదటి లేక రెండవ సంవత్సరంలో ప్రవేశానికి డిప్లొమా వారికి. (బిఇ, బిటెక్)
  1. లా సెట్: న్యాయంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు.

పిజి పరీక్షల ప్రవేశాలు

  1. ఎమ్ఎ (MA) ప్రవేశ పరీక్ష
  2. ఎమ్ఎస్సి (MSc) ప్రవేశ పరీక్ష
  3. ఐసెట్ (ICET) : ఎంబిఎ, ఎంసిఎ కోర్సులకు.
  4. పిజిఈసెట్ ( PG ECET) : ఇంజినీరింగ్, ఫార్మా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకొరకు (ఎమ్ఇ ఎమ్టెక్)
  5. పిజిలాసెట్: న్యాయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు.

విద్యార్థుల వసతి గృహాలు

ప్రభుత్వం దాదాపు 5000 విద్యార్థుల వసతి గృహాలు నిర్వహిస్తున్నది.వీటిలో 8 లక్షల మంది వుంటున్నారు.

విద్యార్థిఉపకార వేతనాలు

ప్రభుత్వం విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నది.

ఇవీ చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు