ఉద్యానకృషి

ఉద్యానకృషి (హార్టికల్చర్) అనేది వ్యవసాయ శాస్త్రం యొక్క ఒక ప్రత్యేక విభాగం. ఉద్యానకృషిలో పూల సాగు, పండ్ల సాగు, కూరగాయల సాగు ముఖ్యమైనవి. ఉద్యానకృషిలో దుక్కి దున్నడం దగ్గర నుంచి పండించిన పంటను అమ్ముకునే వరకు అనేక నిర్వహణ కార్యక్రమాలు ఉంటాయి. ఇది తోటల యొక్క ఆచరణాత్మక వృక్షశాస్త్రం. హార్టికల్చర్‌లో పండ్లు, కూరగాయలు, చెట్లు, సుగంధ, మసాలా పంటలు, పువ్వుల సాగు ఉంటుంది. ఉద్యానకృషిలో అనేక కార్యకలాపాలు ఈ మొక్కలను పెంచే కళ క్రిందకు వస్తాయి.[1][2][3] హార్టికల్చర్ అనే పదం లాటిన్ పదాలైన హార్టస్, “తోట”,, కోలెర్ “పండించడం” నుండి తీసుకోబడింది.

మామిడిలో తలమార్పిడి

ఉద్యానకృషిలో ముఖ్యమైన పండ్ల చెట్లు: జీడిమామిడి, మామిడి, జామ, అరటి, నిమ్మ, బొప్పాయి

ఉద్యానకృషి చేసే వ్యక్తిని ఉద్యానకృషివలుడు లేదా హార్టికల్చరిస్ట్ అంటారు. హార్టికల్చరిస్ట్‌లు పువ్వులు, పండ్లు, కూరగాయలు లేదా అలంకార మొక్కల శాస్త్రం, నైపుణ్యం గురించి పరిశోధనలు నిర్వహిస్తారు.

ఉద్యానకృషికి సంబంధించి ముఖ్యమైనవి:

అధ్యాయాలు

ఉద్యానకృషి యొక్క ప్రధాన శాఖలు.

  • 1.ఫ్లోరికల్చర్ (పూల సాగు)
  • 2.పోమాలజీ (పండ్ల సాగు)
  • 3.ఆలరికల్చర్ (కూరగాయల సాగు)

మూలాలు