ఎమీ జాక్సన్

ఎమీ జాక్సన్ (జననం 31 జనవరి 1992)[3][4] బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్, నటి. ఆమె తమిళ,హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది.[5][6] ఆమె తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గానూ, 2010లో మిల్ లివర్ పూల్ గానూ నిలిచింది ఎమీ. ఆ తరువాత తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ 2010లో తీసిన తమిళ చిత్రం మద్రాసపట్టిణంలో కథానాయిక పాత్రకు ఈమెను ఎంపిక చేశాడు. అలా ఎమీ లండన్ లో మోడల్ గా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే, భారత్ లో వివిధ భాషల్లోని సినిమాల్లో నటించడం ప్రారంభించింది. 2012లో  ఆమె నటించిన మొదటి బాలీవుడ్ సినిమా ఏక్ దీవానా థా విడుదలైంది.[7] అదే ఏడాది ఆమె మొదటి తెలుగు సినిమా ఎవడు (సినిమా) విడుదలైంది. ఆ తరువాత 2015లో ఎమీ ప్రభుదేవా దర్శకత్వంలో,అక్షయ్ కుమార్ నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలో నటించింది.

ఎమీ జాక్సన్
అమీ జాక్సన్ 'తాండవం' సంగీత విడుదల సమయంలో.
జననం
ఎమీ లొయిస్ జాక్సన్

(1992-01-31) 1992 జనవరి 31 (వయసు 32)[1]
డౌగ్లస్ , ఐసల్ ఆఫ్ మ్యాన్
వృత్తి
  • నటి
  • ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • అలెన్ జాక్సన్
  • మార్గరెటా జాక్సన్

తొలినాళ్ళ జీవితం, కెరీర్

ఐరిష్ సముద్రం మధ్యలోని ఐస్లే ఆఫ్ మాన్ అనే ద్వీపంలో జన్మించింది ఎమీ. ఆమె తల్లిదండ్రులు బ్రిటీష్ క్రిస్టియన్స్. ఆమె తండ్రి అలన్ జక్సన్, తల్లి మార్గరీటా జాక్సన్. ఆమె అక్క అలిసియా జాక్సన్. ఎమీ జన్మించిన రెండేళ్ళకే వారి కుటుంబం లివర్ పూల్ లోని వూల్టన్ లో వారి స్వంత ఇంటికి మారిపోయింది. ఆమె తండ్రి బిబిసి రేడియో మెర్సిసిడ్ కు నిర్మాత. తన మీడియా కెరీర్ ను కొనసాగించేందుకే లివర్ పూల్ కు మకాం మార్చాల్సి వచ్చింది. సెయింట్ ఎడ్వర్డ్స్ కళాశాలలో చదువుకొంది ఎమీ. ఆ తరువాత ఆంగ్ల భాష, ఆంగ్ల సాహిత్యం, తత్త్వ శాస్త్రం, నీతి శాస్త్రం చదువుకునేందుకు ఆరవ ఫారంలో చేరింది ఎమీ.[8][9][10]


నటించిన చిత్రాలు

సూచిక
ఇంకా విడుదలైన సినిమాలను సూచిస్తుంది

చలన చిత్రాలు

సంవత్సరంచలన చిత్రంపాత్రభాషఇతర వివరాలు
2010మదరాసపట్టినమ్ఎమి విల్కిన్సన్తమిళంతెలుగులో 1947 ఏ లవ్ స్టోరీగా అనువాదమైంది
2012ఎక్ దీవానా థాజెసీ తెక్కుట్టుహిందీ
తాండవంసారా వినాయగమ్తమిళంతెలుగులో శివ తాండవంగా అనువాదమైంది
2014ఎవడుశ్రుతితెలుగు
2015ఐ మనోహరుడుదియాతమిళంతెలుగులో అదే పెరుతో అనువాదమైంది
సింగ్ ఈస్ బ్లింగ్సారా రాణహిందీ
తంగ మగన్హేమా డిసౌజాతమిళంతెలుగులో నవ మన్మదుడుగా అనువాదమైంది
2016గెత్తునందిని రామానుజంతమిళం
తెఱిఅన్నీతమిళంతెలుగులో పొలిసోడుగా అనువాదమైంది
ఫ్రికీ అలిమేఘాహిందీ
దేవిజన్నిఫర్తమిళం"చల్ మార్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
అభినేత్రితెలుగు
తూతక్ తూతక్ తూతియాహిందీ
20182.0తమిళం

హిందీ

ది విలన్ఇంకా ప్రకటించలేదుకన్నడచిత్రీకరణ జరుగుతుంది
బూగి మ్యాన్నిమిషాఆంగ్లం

బుల్లితెర

సంవత్సరంధారావాహికపాత్రఇతర వివరాలు
2017- ప్రస్తుతంసూపర్ గర్ల్ఇమ్రా అర్దీన్[11]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ