కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్

గ్రామీణ ప్రాంతాలలో ప్రణాళిక, అభివృద్ధి కోసం ఏర్పడిన సంస్థ.

భారతదేశంలో, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ (సిడి బ్లాక్) లేదా బ్లాక్ అనేది తహసీల్ ఉప-విభాగం, ఇది గ్రామీణ ప్రాంతాలలో పరిపాలనపరంగా ప్రణాళిక, అభివృద్ధి కోసం కేటాయించబడింది.[1] గిరిజన ప్రాంతాలలో,ఇలాంటి ఉప-విభాగాలను ట్రైబల్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు (టిడి బ్లాక్‌లు) అంటారు.[2] ఈ ప్రాంతం బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO)చే నిర్వహించబడుతుంది, దీనికి ఇతర శాఖలకు చెందిన పలువురు సాంకేతికనిపుణులు, గ్రామస్థాయి కార్మికులు మద్దతు ఇస్తారు.[3] కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌ పరిధిలో అనేక గ్రామ పంచాయతీలు, గ్రామ స్థాయిలో స్థానిక పరిపాలనా విభాగాలుుగా ఉంటాయి.

భారతదేశం పరిపాలనా నిర్మాణం

నామకరణం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రమే సిడి బ్లాక్‌లు మూడవ స్థాయి పరిపాలనా విభాగాలుగా పరిగణించబడతాయి.(ఉత్తర భారతదేశంలోని తహసీల్‌లకు సమానం . ఇతర ప్రాంతాలలో, తహసీల్‌లను పశ్చిమ భారత రాష్ట్రాలైన గోవా, గుజరాత్, మహారాష్ట్ర. దక్షిణ భారత రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడులలో తాలూకా అని కూడా పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో, సర్కిల్‌లు అనే పదాన్ని ఉపయోగించారు, అయితే ఉప-విభాగాలు తూర్పు భారత రాష్ట్రాలైన బీహార్, జార్ఖండ్, అస్సాం, ఈశాన్య భారతదేశంలో ( మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర ) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్రాలలో మండలాలు అనే కొత్త పరిపాలనా విభాగం తహసీల్ స్థానంలో వచ్చింది.

గుజరాత్ రాష్ట్రం విభిన్నమైన నిర్మాణాన్ని కలిగి ఉంది.జిల్లా కలెక్టర్ లేదా డివిజనల్ మేజిస్ట్రేట్ (డిఎం), తర్వాత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్.డి.ఎం) అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువతాలూకాలను నిర్వహించే డిప్యూటీ కలెక్టర్. సబ్ డివిజన్ తాలూకాలుగా విభజించబడ్డాయి.

చరిత్ర

కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ భావనను 1952లో గ్రో మోర్ ఫుడ్ (GMF) ఎంక్వైరీ కమిటీ మొదటిసారిగా ఉమ్మడి లక్ష్యాల భావం లేకుండా పని చేస్తున్న బహుళ గ్రామీణ అభివృద్ధి సంస్థల సవాలును పరిష్కరించడానికి సూచించింది.[4] కమిటీ సిఫార్సుల ఆధారంగా, దేశంలోని వ్యవసాయ కార్యక్రమంలో గణనీయమైన పెరుగుదలను అందించడానికి, సమాచార వ్యవస్థల్లో మెరుగుదలకు, గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య మొదలగు వాటిలో గ్రామీణ అభివృద్ధి కోసం కమ్యూనిటీ డెవలప్‌మెంట్ పథకం 1952లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించబడింది. గ్రామస్తుల సామాజిక, ఆర్థిక జీవితాన్ని మార్చే లక్ష్యంతో సమగ్ర సంస్కృతి మార్పు ప్రక్రియను ప్రారంభించడం, నిర్దేశించడం వీటి ముఖ్యలక్ష్యం.[5] వాటి ఫలితంగా సమాజాభివృద్ధి కార్యక్రమం వేగంగా అమలు చేయబడింది. 1956లో, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ముగిసే సమయానికి, దేశంలోని జనాభాలో ఐదవ వంతు మందికి వాటివలన ప్రయోజనం కలుగుచేస్తూ 248 బ్లాక్‌లు ఏర్పడ్డాయి. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం ముగిసే సమయానికి, గ్రామీణ జనాభాలో 70 శాతం మందికి ప్రయోజనం కలుగుచేయాలనే లక్ష్యంతో చేసే 3,000 బ్లాకులు ఏర్పడ్డాయి.1964 నాటికి దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల మొత్తానికి ప్రయోజనం చోకూరటానికి విస్తరించబడ్డాయి. [6]

బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్

భారతదేశంలో, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బిడిఒ) స్థాయి సివిల్ సర్వీస్ అధికారి భారతదేశంలో సిడి బ్లాక్‌కు నిర్వహణ అధికారిగా ఉంటాడు.బిడిఒలు సాధారణంగా రాష్ట్ర-ప్రభుత్వ ప్రాతినిధ్య అధికారులు.వీరు సబ్ డివిజనల్ మేజిస్ట్రేటుకు (ఎస్.డి.ఎం.)కు పరిపాలనపై నివేదికలును నివేదిస్తారు.

రాష్ట్రాల వారీగా సిడి బ్లాక్‌లు సంఖ్య

రాష్ట్రంవివరం
సిడి బ్లాక్స్ సంఖ్య
బీహార్సిడి బ్లాక్534
హర్యానాసిడి బ్లాక్140
జార్ఖండ్సిడి బ్లాక్263 [7]
కేరళసిడి బ్లాక్152 [8]
ఒడిశాసిడిబ్లాక్314
త్రిపురసిడి బ్లాక్58
ఉత్తరాఖండ్సిడిబ్లాక్95
ఉత్తర ప్రదేశ్సిడి బ్లాక్822 [9]
పశ్చిమ బెంగాల్సిడి బ్లాక్342 [10] [11]

ఇది కూడ చూడు

ప్రస్తావనలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు