మండలం

భారతదేశంలో జిల్లాల ఉప పరిపాలనా విభాగాలు

మండలం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఒక రెవెన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం.అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది.[1] పరిపాలనా సౌలభ్యం కొరకు ఇదివరకటి తాలూకాలను రద్దు చేసి, 1985లో తెలుగు దేశం ప్రభుత్వ పరిపాలనలో, నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను 1985 మే 25న ప్రవేశపెట్టడం జరిగింది.[2] మండలాలు ఇవి బ్లాకు లేదా సమితి కన్నా ఏరియాలో, జనాభాలో కొంచెం చిన్నవిగా ఉండేటట్లు, కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే జిల్లాని కూడా కొన్నిపట్టణ ప్రాంతపు మండలాలుగా విభజించబడ్డాయి.[3][3][4]

చరిత్ర

1985 కు ముందు1985 తర్వాత
జిల్లాజిల్లా
డివిజన్‌డివిజన్‌
తాలూకామండలం/తాలూకా
బ్లాకు / సమితి
గ్రామంగ్రామం

పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజనుగా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, ఫిర్కా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్ " మండలం అనే పేర్లు వాడుకలో ఉన్నాయి.సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి.

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని నగర పంచాయితీగా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీల్ లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

ఇవీ చూడండి

మూలాలు

మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య ఎంత ?An ;- https://www.youtube.com/@SGVCrazyQuiz/featured?sub_confirmation=1