గాంధీనగర్ జిల్లా

గుజరాత్ లోని జిల్లా

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో గాంధీనగర్ జిల్లా ఒకటి. గాంధీనగర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 649 చ.కి.మీ. 1964లో గాంధీనగర్ జిల్లా ఏర్పాటు చేయబడింది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,334,455. .[1]

  • జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి:- చంద్ఖేడా, మొటెర, ఆదలా.
  • జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి:- గాంధీనగర్, కాలోల్ ఐ.ఎన్.ఎ., దహెగం, మనస (గుజరాత్)
  • జిల్లాలో 216 గ్రామాలు ఉన్నాయి.
మధ్య గుజరాత్ జిల్లాలు
అదాలజ్ స్టెప్‌వెల్

సరిహద్దులు

జిల్లా ఈశాన్య సరిహద్దులో సబర్‌ కాంతా జిల్లా, ఆరవల్లి జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఖేడా జిల్లా, నైరుతీ సరిహద్దులో అహమ్మదాబాదు జిల్లా, వాయవ్య సరిహద్దులో మహెసనా జిల్లా ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యాలు

జిల్లా సర్ఖెజ్ - గాంధీనగర్ రథారిమార్గం, అహమ్మదాబాదు- వదోదరా రహదారులతో అనుసంధానమై ఉంది. ఇవి గుజరాత్ మధ్యభాగంలో వాణిజ్యకూడళ్ళుగా ఉన్నాయి.

నైసర్గికం

గాంధీనగర్ నగరం పంజాబు రాష్ట్ర చండీగఢ్ నగరంలా చక్కాగా ప్రణాళికాబద్ధంగా నిర్మించబడింది. ఇది ఒకచదరపు మీ వైశాల్యం ఉన్న 30 విభాగాలుగా ఉంది. ఒక్కో విభాగంలో ఒక్కోక ప్రాథమిక పాఠశాల, ఒక మాధ్యమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, ఒక మెడుకల్ డిస్పెంసరీ, ఒక నిర్వహణా కార్యాలయం ఉంటుంది. .

ఆర్ధికం

గాంధీనగర్ సమీపంలో ఐ.టి సంస్థలు ఉన్నాయి. జిల్లాలో టాటా కంసల్టెంసీ, సైబేజ్ వంటి సంస్థలు ఉన్నాయి. ఇంఫోసిటీలో పలు కపనీలు కార్యాలయాలు ఆరభిస్తున్నాయి. జిల్లాలో క్రీడాకారులు కూడా అధికంగా ఉన్నారు.[2] జిల్లాలో ప్రధాన ఆలయ సమూహం అయిన అక్షరధాం ఉంది.

విధ్య

గాంధీనగర్‌లో పలు విద్యాసంస్థలు ఉన్నాయి. దీరూభాయ్ అంబానీ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఐ.సి.టి, ఎంటర్‌ప్రీనర్‌షిప్ డెవెలెప్మెంట్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ప్లాస్మా రీసెర్చ్ ఇంస్టిట్యూట్, గుజరాత్ లా యూనివర్శిటీ ఉన్నాయి. గాంధీనగర్ విద్యావిధానం గుజరాత్‌లో ప్రథమ స్థానంలో ఉంది. అక్షరాస్యత 87.11%. గాంధీ నగర్ గుజరాత్ హృదయంగా ప్రస్తుతించబడుతుంది.

2001 లో గణాంకాలు

విషయాలువివరణలు
జిల్లా జనసంఖ్య .1,387,478, [3]
ఇది దాదాపు.స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని.హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో.వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.660 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం.12.15%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి.920:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.తక్కువ
అక్షరాస్యత శాతం.85.78% in 2011.[3]
జాతియ సరాసరి (72%) కంటే.అధికం

2001లో జిల్లా అక్షరాస్యత 76.5% ఉంది. 2011 నాటికి అక్షరాస్యత దాదాపు 10% అభివృద్ధి చెందింది.

ఇవి కూడా చూడండి

సరిహద్దులు

మూలాలు

23°13′00″N 72°41′00″E / 23.2167°N 72.6833°E / 23.2167; 72.6833

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ