డెకెన్

డెకెన్ (decane) అనేది C10H22 అనే రసాయన సూత్రంతో కూడినఆల్కేన్ హైడ్రోకార్బన్.డెకెన్ కు 75 సౌష్టవ ఐసోమర్‌లు సాధ్యమే అయినప్పటికీ, ఈ పదం సాధారణంగా CH3(CH2)8CH3 సూత్రంతో సాధారణ-డికేన్ ("n-decane")ని సూచిస్తుంది.అయితే, అన్ని ఐసోమర్‌లు ఒకే విధమైన లక్షణాలను ప్రదర్శిస్తాయి మరియు కూర్పు కూడా పెద్ద వ్యత్యాసం లేదు.ఈ ఐసోమర్లు మండే ద్రవాలు.గ్యాసోలిన్ (పెట్రోల్) మరియు కిరోసిన్ లో డెకెన్ చిన్న పరిమాణంలో (1% కంటే తక్కువ) ఉంటుంది.ఇతర ఆల్కేన్‌ల వలె, ఇది నాన్‌పోలార్(అదృవ)ద్రావకం, మరియు నీటిలో కరగదు, మరియు తక్షణమే మండేది.ఇది ఇంధనాలలో ఒక భాగం అయినప్పటికీ, కొన్ని ఇతర ఆల్కేన్‌ల వలె కాకుండా రసాయన ఫీడ్‌స్టాక్‌గా దీనికి పెద్దగా ప్రాముఖ్యత లేదు.[5]డెకేన్ అనేది 10 కార్బన్ పరమాణువులతో కూడిన సరళ శృంఖల ఆల్కేన్.[6]

డెకెన్
Skeletal formula of decane
Skeletal formula of decane with all implicit carbons shown, and all explicit hydrogens added
Ball-and-stick model of the decane molecule
పేర్లు
Preferred IUPAC name
Decane[1]
ఇతర పేర్లు
Decyl hydride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య[124-18-5]
పబ్ కెమ్15600
యూరోపియన్ కమిషన్ సంఖ్య204-686-4
డ్రగ్ బ్యాంకుDB02826
వైద్య విషయ శీర్షికdecane
సి.హెచ్.ఇ.బి.ఐCHEBI:41808
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య HD6550000
SMILESCCCCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక1696981
ధర్మములు
C10H22
మోలార్ ద్రవ్యరాశి142.29 g·mol−1
స్వరూపంColorless liquid
వాసనGasoline-like (in high concentrations)
సాంద్రత0.730 g mL−1
ద్రవీభవన స్థానం −30.5 to −29.2 °C; −22.8 to −20.6 °F; 242.7 to 243.9 K
బాష్పీభవన స్థానం 173.8 to 174.4 °C; 344.7 to 345.8 °F; 446.9 to 447.5 K
log P5.802
బాష్ప పీడనం195 Pa[2]
kH2.1 nmol Pa−1 kg−1
అయస్కాంత ససెప్టిబిలిటి-119.74·10−6 cm3/mol
Thermal conductivity0.1381 W m−1 K−1 (300 K)[3]
వక్రీభవన గుణకం (nD)1.411–1.412
స్నిగ్ధత
  • 0.850 mPa·s (25 °C)[4]
  • 0.920 mPa·s (20 °C)
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−302.1–−299.9 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−6779.21–−6777.45 kJ mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
425.89 J K−1 mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C315.46 J K−1 mol−1
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలుFlammable, moderately toxic
భద్రత సమాచార పత్రముhazard.com
జి.హెచ్.ఎస్.పటచిత్రాలుGHS02: Flammable GHS08: Health hazard
జి.హెచ్.ఎస్.సంకేత పదంDANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలుH226, H302, H304, H305
GHS precautionary statementsP301+310, P331
జ్వలన స్థానం{{{value}}}
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
210.0 °C (410.0 °F; 483.1 K)
విస్ఫోటక పరిమితులు0.8–2.6%
Lethal dose or concentration (LD, LC):
LD50 (median dose)
  • >2 g kg−1 (dermal, rabbit)
  • 601 mg/kg−1 (oral, rat)
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}}{{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

లభ్యత

డెకెన్ అనేది అరిస్టోలోచియా ట్రయాంగ్యులారిస్, జిమ్నోడినియం నాగసాకియన్స్ మరియు అందుబాటు లో ఉన్న ఇతర జీవులలో కనుగొనబడిన సహజ ఉత్పత్తి.[7]

ఉత్పత్తి

ముడి పెట్రోలియం ను శుద్ధి చేయడం ద్వారా చాలా వరకు డెకెన్ తయారవుతుంది. ఫిషర్-ట్రోప్ష్ సంశ్లేషణ ద్వారా బొగ్గు ద్రవీకరణ మరియు 1-డెకిన్ యొక్క హైడ్రోజనేషన్ ద్వారా డెకేన్ ను ఉత్పత్తి చేస్తారు.[8]

భౌతిక ధర్మాలు

డెకెన్ ఒక బలమైన వాసన తో రంగులేని ద్రవం.[9] నీటి కంటే తక్కువ సాంద్రత కల్గివున్నది. నీటిలో కరగదు.డెకెన్ ఆవిర్లు గాలి కంటేబరువు గా ఉండును. అధిక మొత్తంలో దాని ఆవిర్లు పీల్చిన మత్తుపదార్థం ప్రభావం చూపించ వచ్చు.[10]

లక్షణం/గుణంమితి/విలువ
అణు సూత్రంC10H22[11]
అణు భారం142.3 గ్రాం /మోల్ [11]
ద్రవీభవన ఉష్ణోగ్రత-30°C[12][11]
మరుగు స్థానం174°C[11]
ఫ్లాష్ పాయింట్46.0°C[13]
సాంద్రత0.7255గ్రా /ఘన. సెం. మీ,25°C వద్ద.[14]
బాష్పపీడనం1.43 మీ. మీ/పాదరస మట్టం,25°C వద్ద[15]
స్వయం జలిత ఉష్ణోగ్రత210°C[16]
స్నిగ్థత2.188 mPa/-25°Cవద్ద.[17]
వక్రీభవన గుణకం1.410,20°C వద్ద.[17]
బాష్పీభవన వేడి51.42కిలో జౌల్స్ /మోల్,25 °C[17]

ఇథనాల్ తో కలిసి పోతుంది. ఈథర్‌లో కరిగుతుంది. కార్బన్ టెట్రాక్లోరైడ్ లో కొద్దిగా కరుగుతుంది.[18]

రసాయన చర్యలు

దహన చర్య

2 C10H22 + 31O2 → 20 CO2 + 22 H2O + Heat Energy (Enthalpy)([11]

ఆరోగ్య ప్రమాదాలు

  • కళ్లలో పడిన తేలికపాటి చికాకును కలిగిస్తుంది.చర్మంతోసంపర్కం వలన,చర్మం లోని నూనె/కొవ్వు తొలగిపోవును.అందువలన చర్మం పొడిబారి పోవును.ఎరుపెక్కును , పొలుసులు ఏర్పడి మరియుచర్మం మీది జుట్టు రాలడానికి కారణం కావచ్చు.కడుపు లోకి వెళ్ళడం వల్ల అతిసారం, కొద్దిగా కేంద్ర నాడీ వ్యవస్థ మాంద్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు అలసట ఏర్పడవచ్చు.అధిక మొత్తంలో ఆవిర్లు పీల్చడం వల్ల వేగంగా శ్వాస తీసుకోవడం, అలసట, తలనొప్పి, మైకము మరియు ఇతర CNS ప్రభావాలకు కారణం కావచ్చు.[19]

అగ్ని ప్రమాదాలు

  • ఎక్కువగా మండగల స్వభావం ఉన్నది.: వేడి,నిప్పురవ్వలు, లేదా మంటల ద్వారా సులభంగా మండించబడుతుంది.
  • డెకెన్ ఆవిరి గాలితో మిశ్రమాలను ఏర్పడిన,నిప్పు తగిలిన పేలుడు సంభవించును.ఆవిరుల పేలుడు ప్రమాదం ప్రాంగణ లోపల, ఆరుబయట లేదా మురుగు కాలువలలో సంభవించ వచ్చును.

ఇవి కూడా చదవండి

ఆల్కేన్

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు