తిలోత్తమ షోమ్

తిలోత్తమ షోమ్ (ఆంగ్లం: Tillotama Shome; జననం 1979 జూన్ 25) భారతీయ నటి. అనేక చలనచిత్ర నిర్మాణాలలో ఆమె కృషికి ప్రసిద్ధి చెందింది. 2021లో, 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో సర్ (2018) చిత్రంలో ఇంటి పనిమనిషి పాత్రను ప్రశంసనీయంగా పోషించినందుకు ఆమె ఉత్తమ నటిగా (క్రిటిక్స్) ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.

తిలోత్తమ షోమ్
Press conference by Mrituniay Devvrat, Director of the film “CHILDREN OF WAR” Soumya Joshi Devvrat, Producer and Actress Tillotma Shome, at the 45th International Film Festival of India (IFFI-2014), in Panaji, Goa.jpg
45వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా - 2014లో తిలోత్తమ షోమ్
జననం (1979-06-25) 1979 జూన్ 25 (వయసు 44)[1]
వృత్తినటి
జీవిత భాగస్వామి
కునాల్ రాస్
(m. 2015)
[2]

2019లో విడుదలైన రాహ్గిర్ - ది వేఫేరర్స్ చిత్రానికి గానూ ఆమెను యూకె ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డు వరించింది.[3]

ప్రారంభ జీవితం

ఆమె కోల్‌కతాలో అనుపమ్, బైసాకి షోమ్‌ దంపతులకు జన్మించింది.[4] ఆమె తండ్రి భారత వైమానిక దళంలో ఉద్యోగి కావడంతో వారి కుటుంబం భారతదేశం అంతటా బదిలీలపై తిరిగింది.[5]

ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీలో అరవింద్ గౌర్ అస్మిత థియేటర్ గ్రూప్‌లో చేరింది.[6] ఆమె 2004లో న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషనల్ థియేటర్‌లో మాస్టర్స్ ప్రోగ్రాం కోసం న్యూయార్క్‌కు వెళ్లింది. 2008 మేలో భారతదేశానికి ఆమె తిరిగి వచ్చింది.[7]

ఆమె మీరా నాయర్ చలన చిత్రం మాన్‌సూన్ వెడ్డింగ్‌ (2001)లో ఆలిస్‌గా తన సినీ రంగ ప్రవేశం చేసింది.[8] ఇది ఆంగ్లంలో తన మొదటి సినిమా. కాగా, ఆమె హిందీ, ఇంగ్లీష్ చలనచిత్రాలతో పాటు బెంగాళీ, నేపాలీ, పంజాబీ, మరాఠీ, జర్మన్ భాషల్లో పలు చిత్రాలు, వెబ్ సీరీస్ లలోనూ నటించింది.

వ్యక్తిగత జీవితం

తిలోత్తమ షోమ్ 2015లో జయ బచ్చన్ మేనల్లుడు కునాల్ రాస్‌ను వివాహం చేసుకుంది.

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు