దోడా జిల్లా

జమ్మూ అండ్ కాశ్మీర్ లోని జిల్లా

జమ్మూ కాశ్మీర్ లోని 20 జిల్లాలలో దోడా జిల్లా ఒకటి. ఇది వైశాల్యపరంగా రాష్ట్రంలో 3 వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో వరుసగా లెహ్ జిల్లా, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. 1948లో ఉధంపుర్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి దోడా జిల్లా రూపొందించబడింది. హిమాలయాల మద్యలో ఉన్న కారణంగా జిల్లా భూభాగం కొండ ప్రాంతాగా ఉంటుంది. అతివశాలంగా ఉంటూ అసౌకర్యవంతమైన ప్రదేశంలో అక్కడక్కడా నివాసప్రాంతాలున్న ప్రాంతాన్ని పాలనా నిర్వహణ కొరకు 2006లో ఈ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం దోడా, రంబాన్ (కాశ్మీర్), కిష్త్‌వార్ జిల్లాలుగా విభజించింది. ఈ జిల్లా ఉత్తరసరిహద్దులో అనంతనాగ్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో కిష్త్‌వార్ జిల్లా, దక్షిణ సరిహద్దులో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని చంబా జిల్లా, కథువా జిల్లా, నైరుతీ సరిహద్దులో ఉధంపుర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో రంబాన్ జిల్లా ఉన్నాయి.

దోడా
City in a mountain valley, with mountains in the background
దోడా నగరం యొక్క దృశ్యం
Location of Doda District within Jammu & Kashmir state
Location of Doda District within Jammu & Kashmir state
దేశంభారతదేశం
కేంద్రపాలిత ప్రాంతంజమ్మూ కాశ్మీరు
ప్రాంతంజమ్మూ విభాగం
ముఖ్య కార్యాలయందోడా
Area
 • Total11,691 km2 (4,514 sq mi)
Population
 (1991)
 • Total5,25,000
 • Density45/km2 (120/sq mi)
అక్షరాస్యత65.97 % (2011)
Websitehttp://doda.nic.in

పేరు వెనుకచరిత్ర

దోడా జిల్లాకు సుసంపన్న చరిత్ర ఉంది. జిల్లాలో దోడా పట్టణం వైశాల్యపరంగా ప్రథమ స్థానంలో ఉంది. జిల్లా కేంద్రమైన దోడా పట్టణం పేరును జిల్లాకు పెట్టారు. కిష్త్‌వార్ పురాతన రాజు తనసామ్రాజ్యాన్ని దోడా వరకు విస్తరించాడు. ఆ సమయంలో ఇక్కడకు ముల్తాన్ నుండి వలస వచ్చిన పనిముట్లు చేసే వ్యక్తి తాను ఇక్కడ స్థిరపడడానికి మహారాజు వద్ద అనుమతి పొందాడు. అంతేకాక ఇక్కడ పనిముట్లు చేసే కర్మాగారం ఏర్పాటుచేయడానికి రాజు అనుమతి పొందాడు. క్రమంగా ఆవ్యక్తి ఇక్కడ ఒక గ్రామం ఏర్పాటు చేసాడు. తరువాత ఆ గ్రామం ఆవ్యక్తి పేరైన " డీడా " పేరుతో పిలువబడింది. కాలక్రమంలో గ్రామం పట్టణం రూపుదాల్చింది. అంతే కాక డీడా పేరు దోడాగా మారింది.

చరిత్ర

ఈ ప్రాతం ఇక్కడ ఉన్న అల్లాక్వా డెంగ్బాతల్ (మహోర్ తెహ్సిల్) పూర్వం కిష్త్‌వార్కకు చెందిన రెండు జాగీర్లుగా (కిస్త్వర్, భదేర్వా) ఉండేవి. కిస్త్వర్ రాజ్యంలో ఒకప్పుడు ప్రస్తుత దోడా జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. అందులో దోడా జిల్లాకు చెందిన సిరాజ్, ప్రస్తుత భడేర్వా, భల్లెస్సా, తత్రి తెహ్సిల్, మర్మత్, గలిహాన్, రగ్గి, అస్సర్, బటోటే, రంబాన్ జిల్లాలు అందులో భాగంగా ఉండేవి. బధేర్వా జహంగీర్‌లో 15 తారాలు లేక పాలనా విభాగాలు ఉండేవి. భలెస్సాతో చేరి భధేర్వా జాగీర్ వైశాల్యం 533 చదరపు మైళ్ళు ఉండేది. 1931లో ఉధంపూర్ జిల్లా ఏర్పడిన తరువాత ఇది 213 చ. మైళ్ళకు కుదించబడింది. సా.శ. 1112 నుండి సా.శ. 1930 వరకు భధెర్వా జాగీర్ వివిధ రాజుల ఆధీనంలో ఉంటూ వచ్చింది. తరువాత దీనికి ప్రివతె జాగీర్‌గా మార్చి ప్రివతె రాజ్యంగా చేసి జాగీర్ స్థానంలో ప్రివతె రాజ్యం డైరెక్టరును ఏర్పాటు చేసారు. " ప్రివతె డోమియన్ అస్సిలిలేషంకమిటీ " సిఫారసు అనుసరించి 1930లో భధేర్వా రాజ్యహోదా ముగింపుకు వచ్చింది. ఫలితంగా 1931 న భధెర్వా ఉధంపుర్ జిల్లా తెహ్సిల్‌గా రూపొందించబడింది. 1948లో ఉధంపుర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి దోడా జిల్లాను ఏర్పాటు చేసిన తరువాత భధేర్వా దోడా జిల్లాలోని తెహ్సిల్‌ అయింది. తరువాత 1981లో నైబత్ తహ్త్రి, నైబత్ భలెస్సా కూడా పూర్తి స్థాయి తెహ్సిల్స్‌గా మారాయి.

భౌగోళికం

దోడా జిల్లా మొత్తం వైశాల్యం 4,500 చ.కి.మీ. 1948లో మునుపటి ఉధంపుర్ జిల్లా లోని కొంతభూభాగం వేరుచేసి దోడా జిల్లా ఏర్పాటు చేయబడింది. రాష్ట్ర ప్రభుత్వం 2006లో ఈ జిల్లాను 3 జిల్లాలుగా (దోడా, రంబాన్, కిష్త్‌వార్]] జిల్లాలుగా విభజించబడింది. ఈ జిల్లా ఉత్తర అక్షాంశంలో 32-53, 34-21 డిగ్రీలు, తూర్పు రేఖాంశంగా 75-1, 76-47 డిగ్రీలు ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో అనంతనాగ్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో కిష్త్‌వార్ జిల్లా, నైరుతీ, దక్షిణ సరిహద్దులో ఉధంపుర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రనికి చెందిన కథువా, చంబా జిల్లాలు ఉన్నాయి. పశ్చిమ సరిహద్దులో రంబాన్, తూర్పు, ఆగ్నేయ సరిహద్దులో లెహ్ జిల్లా ఉన్నాయి. దోడా జిల్లా సురు సరిహద్దులో మార్బుల్ పాస్ వద్ద నన్‌కున్ వంటి ప్రముఖ పర్వత శిఖరాలు ఉన్నాయి. ఈ శిఖరం సముద్రమట్టానికి 2,300 మీ ఎత్తున ఉంది. అంతే కాక బ్రహ్మ, చంద్ర సికిల్ శిఖరాలు కూడా ఈ జిల్లాలో ఉన్నాయి.

వాతావరణం

దోడా జిల్లాలో భూభాభాగం భౌతికంగా వేరుపడి ఉన్నందువలన వాతావరణం కూడా వేరుగానే ఉంటుంది. భదర్వా, కిష్త్‌వార్ ప్రాంతాలలో సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. రంబాన్ ప్రాంతంలో ఉపఉష్ణ మండల వాతావరణం ఉంటుంది. జిల్లా ససరి వర్షపాతం సంవత్సరానికి 35మి.మీ. మిగిలిన కాశ్మీర్ ప్రాంతంలో కంటే ఇది అల్పం కనుక దీనిని కరువుప్రాంతంగా గుర్తిస్తున్నారు. భదర్వా, కిష్త్‌వార్ వాతావరణం దోడా కంటే వ్యత్యాసంగా ఉన్నందువలన ఇక్కడ శీతాకాలంలో హిమపాతం ఉంటుంది. వేసవిలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో పర్యటినచడానికీ మంచును సందర్శిచడానికి ఇది అనువైన కాలం. ఈ కారణంగా దీనిని " మినీ కాశ్మీర్ " అంటారు.

ఆర్ధికం

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దోడా జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

సంస్కృతి

దోడా జిల్లా సుసంపన్నమైన సంస్కృతి వారసత్వానికి, నైతిక విలువలకు పేరుపొందింది. అంతేకాక మతసహనం, ఓర్పుకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ సంప్రదాయం ప్రజలను పురాతనకాలం నుండి ప్రజల ఐక్యతకు కారణమైంది. ఈ జిల్లాలోని ప్రశాంత వాతావరణం కారణంగా దీర్ఘ కాలం నుండి ఇక్కడ పలుమతాలకు చెందిన గురువులు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. జిల్లాలో విభిన్న సంప్రదాయాలు ఉన్నాయి.

భాషలు

ప్రజలలో అధికంగా పెహరీ భాష వాడుకలో ఉంది. ఈ జిల్లా శ్రీనగర్, హిమాచల్ ప్రదేశ్, లఢఖ్ లతో సంబంధితమై ఉన్నందున ఇక్కడి ప్రజలలో సాధారణంగా కాశ్మీరి, లఢక్, దోగ్రి, కొన్ని పెహరీ భాషలు (భధర్వహి, కిష్త్వరి, సెరజి ) కూడా వాడుకలో ఉన్నాయి. ఇక్కడి ప్రజలు భిన్నత్వం కానుకగా పొందిన భాగ్యవంతులు. జిల్లాలో ప్రాంతీయ భాషలేకాక 12 వివిధప్రాంతాలకు చెందిన భాషలు (కాశ్మీరి, దోగ్రీ, భధర్వాహి, కిష్త్వరి, సిరాజ్, పొగ్లి, ఖషలి, గోజ్రి, పద్ద్రి, పంజాబి) కూడా వివిధ ప్రాంతాలలో వాడుకలో ఉన్నాయి.

డాక్టర్ జి.ఎ

డాక్టర్ ఫియర్సన్ మాటలలో పహరి మాట్లాడే ప్రజలు ఉప- హిమాలయపర్వతాల ప్రాంతానికి చెందినవారని తెలుస్తుంది. భదర్వా నుండి నేపాల్ తూర్పు భూభాగం వరకు ఈ వర్గంలోకి చేరుతుంది. భదర్వా జాతిలో 3 ఇతర భాషలు వాడుకలో (భదర్వా, భలేస్వి, పద్రి) ఉన్నాయి. భదర్వా భాష పదజాలం, సామెతలు, పొడుపు కథలు వంటి వాటితో సుసంపన్నమైనది.సా.శ.1650లో " షాహ్ ఫరీద్ ఉద్ దిన్ " రంబాన్ మీదుగా దోడాలో ప్రవేశించిన తరువాత ఇస్లాం మతం ఈ ప్రాంతంలో ప్రవేశించింది. షాహ్ ఫరీద్ ఉద్ దిన్ దోడాలో 14 సంవత్సరాల కాలం నివసించిన తరువాత కిష్త్‌వార్ ప్రాంతానికి తరలి వెళ్ళాడు.

చేరుకునే మార్గం

దోడా జిల్లా ప్రధాన కేంద్రం దోడా జమ్ముకు 175 కి.మీ, శ్రీనగర్కు దూరంలో ఉంది. ఈ జిల్లా కొండప్రాతం. ఈ జిల్లాగుండా జాతీయ రహదారి 1ఎ, 1బి పోతుంది. రహదారి మార్గంలో జిల్లా అంతటా ప్రయాణించడానికి వీలుగా ఉంది. టాక్సీ, డీలక్స్ బసులు మొదలైనవి లభిస్తాయి. దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణీకులకు జమ్ము, శ్రీనగర్ రైల్ స్టేషను, విమానాశ్రయం అందుబాటులో ఉన్నాయి. దోడా నుండి ఇతర పర్యాటక ప్రాంతాలకు ప్రయాణించడానికి పలు రహదారి మార్గాలు ఉన్నాయి. దోడాను చేరే సమయంలో చినాబ్ నదిని చూస్తూ పయనించవచ్చు.

2001 లో గణాంకాలు

విషయాలువివరణలు
జిల్లా జనసంఖ్య409,576, [2]
ఇది దాదాపుమాల్టా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోనినగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో556వ స్థానంలో ఉంది. .[2]
1చ.కి.మీ జనసాంద్రత79.[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం27.89%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి922:1000.[2]
జాతియ సరాసరి (928) కంటేఅల్పం
అక్షరాస్యత శాతం65.97%.[2]
జాతియ సరాసరి (72%) కంటేఅల్పం

దోడా జిల్లాలో కాశ్మీరి భాష వాడుకలో ఉంది. జిల్లాలో ముస్లిములు అధిక సంఖ్యలో ఉన్నారు. తరువాత స్థానంలో ఉన్న హిందువులు మొత్తం జనసంఖ్యలో 40% ఉంటుంది.[4]

భాషలు

దోడాలో ప్రధానభాషగా కాశ్మీరి భాష వాడుకలో ఉంది. జానపద భాషకుగా సిరాజ్, గొజారీ, భద్రవాహి భాషలు వాడుకలో ఉన్నాయి. డోగ్రి కగ్రి భాషను జిల్లాలో 53,000 మంది మాట్లాడుతున్నారు. ఈ భాషను అరబిక్, దేవనాగరి లిపిలో వ్రాస్తున్నారు.[5]

పాలన

దోడా జిల్లాలో 406 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 3 నిర్జనగ్రామాలు ఉన్నాయి. జిల్లా 2 ఉపవిభాగాలుగా (దోడా, భదర్వా) విభజించబడి ఉంది. జిల్లాలో 4 తెహ్సిల్స్ (తాత్రి, గందో, దోడా, భదర్వా ) లు ఉన్నాయి. జిల్లాలో గ్రామీణ అభివృద్ధి బ్లాకులు 8 (భదర్వా, ఘాట్ (దోడా), తాత్రి, గందో, భగ్వా, అస్సర్, మర్మాత్, గుండానా.జిల్లాలో 232 పంచాయితీలు ఉన్నాయి.[6]

ప్రత్యేకతలు

దోడా జిల్లా విస్తారంగా ప్రకృతి సౌందర్యం, అడవి సంపద కలిగిన ప్రదేశంగా ఖ్యాతి చెందినది. ఈ ప్రాంతంలో మంచుతో కప్పబడిన పలు పర్వతశిఖరాలు ఉన్నాయి. అంతే కాక జిల్లాలో శక్తివంతమైన చీనాబ్ నది ప్రవహిస్తుంది. జిల్లాలో కొన్ని మైదానాలు, దిగువభూములు తప్ప మిగిలిన భూభాగం పర్వతాలు, కొండప్రాంతాలు అధికంగా ఉన్నాయి. భూభాగంలో వ్యత్యాసాల కారణంగా వాతావరణంలో కూడా అధికమైన వ్యత్యాసాలు ఉంటాయి. చీనాబ్ నదీ ప్రవాహాలు కలపను రవాణాచేయడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. చీనాబ్ నదీ ప్రవాహం నుండి 15,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ఔతుందని అంచనా.

రాజకీయాలు

దోడా జిల్లాలో 2 అసెంబ్లీ నియోజక వర్గాలు (భధర్వా, దోడా) ఉన్నాయి.[7]

ఇవికూడా చూడండి

మూలాలు

సరిహద్దులు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు