పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో మొహాలీ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. 2008 లో ప్రారంభించబడిన ఈ జట్టుకు పేరు కింగ్స్ XI పంజాబ్ గా ఉండేది. 2021 లో దీనికి ప్రస్తుతమున్న పేరు పెట్టారు. మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింతా, కరణ్ పాల్ ఈ ఫ్రాంచైసీ యజమానులు. మొహాలీ లోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం దీనికి స్వంత మైదానం. 2010 నుంచి ఈ జట్టు తమ స్వంత మైదానంలో ఆడాల్సిన ఆటలను ధర్మశాలలోని HPCA స్టేడియం లేదా, ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో కూడా ఆడుతూ వస్తోంది.

పంజాబ్ కింగ్స్
దస్త్రం:Kings XI Punjab logo.svg
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్శిఖర్ ధావన్
కోచ్ట్రెవర్ బేలిస్
యజమాని
  • మోహిత్ బర్మన్ (46%)
    నెస్ వాడియా(23%)
    ప్రీతి జింటా (23%)
    కరణ్ పాల్(8%)[1]
జట్టు సమాచారం
నగరంమొహాలీ, చండీఘడ్, పంజాబ్
రంగులుKXIP
స్థాపితం2008 (2008)
స్వంత మైదానంపంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహాలీ
(సామర్థ్యం: 26,000)
రెండవ స్వంత మైదానంహోల్కర్ స్టేడియం, ఇండోర్ (సామర్థ్యం : 30,000)

T20 kit

2020లో కింగ్స్ XI పంజాబ్

ఈ జట్టుకు క్యాచ్ మెంట్ ఏరియా కాశ్మీర్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా. ఈ పేర్లలోని తొలి అక్షరాలు జట్టు చిహ్నం మీద ముద్రించి ఉండటం గమనించవచ్చు.[2][3] 2014 లో రన్నరప్ గా నిలవడం తప్ప మిగతా 12 సీజన్లలో ఈ జట్టుకు ప్లే ఆఫ్స్ కు చేరుకోలేదు.

ఈ జట్టుకు రవిచంద్ర అశ్విన్ ప్రాతినిధ్యం వహిస్తుండగా బ్రాడ్ హాగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

2021 ఫిబ్రవరి 17 న కింగ్స్ XI పంజాబ్ జట్టు పేరును పంజాబ్ కింగ్స్ గా మార్చారు.[4][5][6]

చరిత్ర

సెప్టెంబరు 2007 లో భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటును ప్రకటించింది. 2008 నుంచి మొత్తం ఎనిమిది జట్ల మధ్య 20-20 ఆటల పోటీలు జరుగుతాయని ప్రకటించింది.[7] ఈ ఎనిమిది జట్లు భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల నుంది ప్రాతినిథ్యం వహిస్తాయని పేర్కొంది. ఇందులో పంజాబ్ లో నగరం కూడా ఒకటి.

ఐపీఎల్ లో

సంవత్సరంటోర్నమెంట్‌లో స్థానం
2008సెమీ ఫైనలిస్ట్
2009ఐదవ
2010ఎనిమిదవ
2011ఐదవ
2012ఆరవ
2013ఆరవ
2014ఫైనల్లో ఓటమి
2015ఎనిమిదవ
2016ఎనిమిదవ
2017ఐదవ
2018ఏడవ
2019ఆరవ
2020ఆరవ
2021ఆరవ
2022ఆరవ

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు