ప్రశాంతి నిలయం

ప్రశాంతి నిలయము సత్య సాయి బాబా ముఖ్య ఆశ్రమం. ఇది సముద్రమట్టము[1] నుండి 800 మీటర్ల (2624 అడుగులు) ఎత్తులో ఉంది. ప్రశాంతి నిలయము శ్రీ సత్య సాయి బాబా జన్మించిన పుట్టపర్తి అనే గ్రామములో ఉంది. ఈ ప్రదేశము దక్షిణ భారతదేశములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅనంతపురము జిల్లాలో ఒక భాగము.[2] ప్రశాంతి నిలయం అంటే "మహోన్నత శాంతి యొక్క దామము"[1][2]. జీవించి ఉన్నప్పుడు సత్య సాయి ఈ ఆశ్రమములో ప్రతిరోజూ వేలకొలది తన భక్తులకు దర్శనము ఇచ్చేవాడు. సత్య సాయి బాబా సాధారణంగా జూన్ మొదలు నుండి మార్చి మధ్య వరకు ప్రశాంతి నిలయములో ఉండేవాడు.[2] అతను గతించాక ఇక్కడి సాయి కుల్వంత్ హాల్ లో సమాధి చేయబడ్డాడు.

ప్రశాంతి నిలయం, పుట్టపర్తి, ఆం.ప్ర.

చరిత్ర

పదిహేడవ సంవత్సరములో, సత్య సాయి బాబా ఒక భక్తునితో ఇలా అన్నాడు, "సాయి ప్రవేశము (సాయి యొక్క ఆగమనము) ఈ ప్రాంతమును ప్రశాంతి ప్రదేశముగా (అత్యున్నత శాంతి ఉన్న ప్రదేశము) మారుస్తుంది. ఒక భవనము (సౌధం) నిర్మిస్తారు! భారత దేశము అంతటి నుంచే కాక ప్రపంచము అంతటి నుంచి లక్షల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి సాయి దర్శనము కొరకు వేచి ఉంటారు.[3][3]

1944లో పెరుగుతున్న సాయి బాబా భక్తుల[4] సౌకర్యార్ధం ఒక మందిరము నిర్మించబడింది, అది ఇప్పుడు "పురాతన మందిరము" అని ప్రస్తావించబడుతోంది.[5][6] ప్రశాంతి నిలయం 1950 నవంబరు 23న ప్రారంభించబడింది. ఆ రోజు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఇరవై-నాలుగవ పుట్టినరోజు. దానిని నిర్మించుటకు దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది."[4] "సత్య సాయి బాబా ఈ నిర్మాణపు పనిని మొత్తం నిర్దేశించాడు. కాబట్టి అతనే ఈ పని నిర్మాణశిల్పి, వాస్తు శాస్త్ర సూత్రధారి అని చెప్పవచ్చు".[4] అని నారాయణ కస్తూరి అన్నారు. సత్య సాయి బాబా ఈ నిర్మాణ సమయంలో మొత్తం పనిని పర్యవేక్షించాడు. అతని భక్తులు కొండ వాలు వెంట వరుసలో నిలబడి నిర్మాణమునకు అవసరమైన లోహము, రాళ్ళు, ఇటుకలు, నీళ్ళు, మట్టి,, నిర్మాణమునకు అవసరమైన ప్రతిదానిని ఒకరి చేతుల నుండి ఇంకొకరి చేతులకు మార్చుకుంటూ పనిచేసేవారు."[4]

బరువైన గిర్డర్లను ప్రధాన ప్రార్థనా మందిరమునకు రవాణా చేయుటకు ఎదుర్కొన్న సమస్యల గురించి ఎన్నో కథనాలు ఉన్నాయి. ఈ గిర్డర్లు సమీపములోని తిరుచునాపల్లి నుండి రైలు మార్గము ద్వారా పెనుకొండ చేరేవి, ఆ తరువాత అక్కడి నుండి జిల్లా రోడ్డు రవాణా మార్గము ద్వారా పదహారు మైళ్ళు ఉన్న మార్గములో ఏడవ మైలు వద్ద ఉన్న ఇసుక కాలువ దాటి తేవలసి ఉండేది.[4] మందిరమునకు నీలము, పసుపుపచ్చ, గులాబి రంగులు వేయబడ్డాయి. ఈ రంగులు ఆత్మ, బుద్ధి, మనసుల సమన్వయమును సూచిస్తాయి; నీలము ఆత్మను, పసుపుపచ్చ బుద్ధిని, గులాబి మనసు (ప్రేమ) ను సూచిస్తాయి. ఈ మూడింటి యొక్క సమన్వయము శాంతి, ప్రశాంతి (మహోన్నత శాంతి) కి దారితీస్తుంది. ఇది ప్రశాంతి మందిరము యొక్క నిజమైన సందేశము."[3]

"1957 అక్టోబరులో ఈ నిలయము వెనుక ఉన్న కొండపై ఒక ఆసుపత్రి ప్రారంభించబడింది."[4] పూర్ణచంద్ర సభామదిరము 1973లో నిర్మించబడింది. "ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు, దసరా సమయములో యజ్ఞాలు జరిగేవి."[7] ఈ సభామందిరము సుమారు 15,000 మంది కూర్చొనగలిగే 60 x 40 మీటర్ల విస్తీర్ణము గలిగినది.[7] "వేదిక పైన ఉన్నటువంటి మేడలో సత్య సాయి బాబా నిరాడంబర నివాసము ఉంది."[8]

అవతారము యొక్క ఆగమనము యొక్క గుర్తుగా 1975 నవంబరులో ఒక సర్వ ధర్మ స్టూపము నిర్మించబడింది. ఇది అన్ని మతముల ఐక్యతను చాటే 50 అడుగుల స్థూపము.[9]

ప్రతి రోజు దర్శనము జరిగేది సాయి కుల్వంత్ హాలు.[9] "అది ఒక విశాలమైన ఆవరణము"[8] . ఇది 20,000 మంది ప్రజల సామర్ధ్యము కలిగినది.[8][9] సాయి కుల్వంత్ హాలు సత్య సాయి బాబా నివాసము (పూర్ణచంద్ర హాలు), ప్రశాంతి మందిరముల మధ్య ఉంది. శ్రీ రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుని చెక్కిన విగ్రహాలు 1999, సెప్టెంబరు 30వ తేదీన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారిచే ప్రతిష్ఠించబడ్డాయి.[9] బాబా మరణానంతరం అతని సమాధిని ఈ ప్రదేశంలోనే ఏర్పాటు చేసారు.

ప్రశాంతి నిలయములో వివిధ మందిరాలు కూడా ఉన్నాయి. (గణేశ మందిరము, సుబ్రహ్మణ్య మందిరము, గాయత్రి మందిరము) [7], ఒక ధ్యాన వృక్షము (సాయి బాబాచే స్వయంగా 1950 లో నాటబడింది, [8][9] రెండు మ్యూజియములు (ఎక్స్టర్నల్ హెరిటేజ్ మ్యూజియం, ది చైతన్య జ్యోతి మ్యూజియము, [9][10] ఉత్తర, దక్షిణ భారత క్యాంటీనులు, ఒక పశ్చిమ దేశాల క్యాంటీను[11], శ్రీ సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ లర్నింగ్ (శ్రీ సత్య సాయి యూనివర్సిటి) యొక్క పరిపాలనా భవనములు ఉన్నాయి.[9]

"ప్రశాంతి నిలయములో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి శాఖ కార్యాలయము కూడా ఉంది.[12]

ఆశ్రమ విధానములు

ఆశ్రమములో ఉన్నప్పుడు భక్తులకు కొన్ని మార్గదర్శకాలు, ప్రవర్తనా నియమావళి నిర్దేశించబడింది."[13]భక్తులు అన్నివేళలలో ఆడంబరము లేని, శుభ్రమైన, వివేకవంతమైన వస్త్రధారణ పాటించాలి." [13] సామాజిక విషయానికి వస్తే, "పురుషులు, స్త్రీలు కాలక్షేపము కోసం గదుల బయట కాని లోపల కానీ కలవకూడదు."[13] ఆశ్రమము ఇతర నిబంధనలు:

  • నిశ్శబ్దముగా ఉండటం.
  • ఇతరులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తనను అడ్డుకోవడం, ఉదాహరణకు రేడియోలను పెద్ద శబ్దముతో పెట్టడం, వ్యక్తులు గాని సమూహములో కాని భజనలు గట్టిగా పాడటము, పిల్లలను అదుపులో ఉంచుకోవడం వంటివి.
  • ధూమపానం, జూదము, మద్యపానము లేక మాంసాహారము తీసుకొనడము (గుడ్లతో సహా), మత్తుమందులు మొదలగునవి ఆశ్రమములో ఖండితముగా నిషేధించబడ్డాయి.
  • "అపరిచితులతో కలవ వద్దని"[13] "మోసాల నుండి, చందాలు వసూలు చేసే వారి నుండి జాగ్రత్తగా ఉండమని"[13] భక్తులకు విజ్ఞప్తి చేస్తారు. "సాయి బాబాతో అత్యంత సన్నిహితత్వం ఉందని చెప్పేవారిని కాని అంతర్గతంగా సందేశాలు వచ్చాయని కాని సత్య సాయి బాబా యొక్క ప్రత్యేక ఆశీస్సులు ఉన్నాయని చెప్పేవారిని కానీ" నమ్మవద్దని ఆశ్రమము వారు ప్రజలకు స్పష్టంగా హెచ్చరిస్తారు.[13]
  • భద్రత, పరిశుభ్రత కొరకు అదనపు సూచనలు[13]

ఆశ్రమ వివరాల జాబితా

పశ్చిమ ఫలహారశాల, ప్రశాంతి నిలయం
  • 5.00.a.m. దేవాలయ గంట 9 సార్లు మ్రోగుతుంది
  • 5.10.a.m. దేవాలయ గంట 5 సార్లు మ్రోగుతుంది.
  • 5.20.a.m. ఒక దేవాలయ గంట 21 ఓంకారాలు, సుప్రభాతం
  • 5.40.a.m. ఆశ్రమము పరిసరాలలో వేద పఠనము, నగర సంకీర్తన
  • 6.45.a.m. - 9:00.a.m. మధ్యలో ఉదయకాల దర్శనము
  • 9.00.a.m. భజనలు
  • 9.30.a.m. సమయంలో ఆరతి
  • 3.00.p.m. - 5:00.p.m. మధ్యలో సాయంత్ర దర్శనము
  • 5.30.p.m. భజనలు
  • 6.00.p.m. సమయంలో హారతి.[14]
  • 9 P.M. వరకే దీపాలు వెలిగింపబడతాయి.[13]

వాతావరణం

వాతావరణము "సాధారణంగా సమ్వత్సరము పొడుగునా వేడిగా, పొడిగా ఉంటుంది,"[1] వేసవి ఉష్ణోగ్రతలు 30 °C-40 °C, (81F - 108F) మధ్యలో ఉంటాయి, చలికాలం 20 °C-27 °C (54F - 73F) [15] ఉష్ణోగ్రతలు ఉంటాయి.

వీటిని కూడా చూడండి

మూలాలు

బాహ్య లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు