బార్పేట జిల్లా

అస్సామ్ లోని జిల్లా

బార్పేట జిల్లా, (అస్సామీ:বৰপেটা জিলা) భారతదేశం, అస్సాం రాష్ట్రం లోని ఒక జిల్లా.బార్పేట పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 3245 చ.కి.మీ. జనసంఖ్య 16,42,420.

బార్పేట జిల్లా
বৰপেটা জিলা
Temple gates
శంకర్ దేవ్ సత్రా పట్బావుసి దేవాలయం
Barpeta district's location in Assam
Barpeta district's location in Assam
దేశంభారత దేశము
రాష్ట్రంఅసోం
పరిపాలన విభాగంLower Assam
జిల్లాకేంద్రంబార్పేట
Area
 • Total3,245 km2 (1,253 sq mi)
Population
 (2011)
 • Total16,93,190
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
ISO 3166 codeIN-AS-BA
Websitehttp://barpeta.gov.in/

చరిత్ర

1983లో కామరూప్ జిల్లా నుండి కొంత భూభాం వేరు చేసి బార్పేట జిల్లా ఏర్పాటు చేయబడింది .[1] 2004 జూన్ 1 బక్సా జిల్లా ఏర్పాటు చేయబడిన సమయంలో జిల్లాలో అధికభాగం బక్సా జిల్లాలో చేర్చబడింది.[1]

భౌగోళికం

బార్పేట జిల్లా వైశాల్యం 3245 చ.కి.మీ.[2] వైశాల్యపరంగా రష్యా లోని ఇతురప్ ఐలాండ్ వైశాల్యానికి సమానంగా ఉంటుంది.[3]

జిల్లా లోని ముఖ్యపట్టణాలు

  • బార్పేట: ఇది జిల్లా కేంద్రం అంతేకాక జిల్లాలో వైశాల్యంలో రెండవ స్థానంలో ఉంది. ఇది ప్రశాంతమైన, కాలుష్యరహితమైన పట్టణం. నగరంలో మితమైన మోటర్ వాహనాలు మాత్రమే ఉన్నాయి. నగరమంతటా సెలయేర్లు, నీటి కాలువలు ఉన్నాయి. వైష్ణవ సన్యాసి మహాదేవ్ స్థాపించిన బార్పేట సత్రం ప్రముఖ కేంద్రంగా ఉంది. గతంలో ఇది ట్రాంఫోర్ట్ పరిశ్రమకు కేంద్రంగా ఉంటూ ఉండేది. అయినప్పటికీ ఇది ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. నగరం దంతం పనితనానికి ప్రత్యేకత కలిగి ఉంది.
  • హోలీ: ఇది జిల్లాలో రద్దిగా ఉండే వాణిజ్య కేంద్రం. ఇది బార్పేట రోడ్డు, బార్పేట పట్టణం మద్య ఉంది. ఇక్కడ పలు సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. జాతీయ రహదారి 31 నగరం మద్య నుండి పయనిస్తుంది. ఇక్కడ జరిగే అస్సామీ రాసలీల ఉత్సవంలో అనేక మంది పాల్గొంటారు. నగరంలో అధికంగా విద్యావంతులు ఉన్నారు. నగరంలో వక్కల పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో వక్కల తయారు చేస్తున్న నగరంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
  • బార్పేట రోడ్డు: జిల్లాలో వైశాల్యపరంగా ప్రథమస్థానంలో ఉంది. ఇది పశ్చిమ అస్సాంలో ప్రధాన రద్ది అయిన వ్యాపారకేంద్రాలలో ఒకటి. నగర పరిసరాలలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు.
  • సర్భోగ్: ఇది జాతీయరహదారి 31 పక్కన ఉన్న చిన్న పట్టణం. ఇక్కడ పాలవారు విక్రయించే గేదె పెరుగు ప్రత్యేకత సంతరించుకుంది.
  • పత్సల: ఇది అస్సాం హాలీవుడ్‌గా ప్రత్యేకత సంతరుంచుకుంది. ఇక్కడ పలు మొబైల్ చలన చిత్ర ప్రదర్శన శాలలు ఉన్నాయి. ఈ పట్టణంలో విద్యావతులు అధికంగా ఉన్నారు. ఇది ఒక చిన్న పట్టణం.
  • బర్మర: ఇది ఒక చిన్న పట్టణం. చెంగ, రౌలీ మద్య ఇది రావాణా కేంద్రంగా ఉంది. ఇక్కడ వారాంతర సంత జరుగుతుంది. సంతలో పేదలకు, మద్యతరగతి వారికి అందుబాటులో వస్తువులు లభిస్తుంటాయి.
  • సర్తెబరి: ఇది జిల్లాలో గంటల తయారీకి గుర్తింపు పొందిన చిన్న పట్టణం.
  • కల్గచై: ఇది జిల్లా పశ్చిమ భాగంలో ఉన్న పట్టణం. ఇక్కడ బెంగాలీ భాష ముస్లిములు అధికంగా నివసిస్తున్నారు. ఇది ప్రముఖ విద్యాకేంద్రంగా, అస్సాంలోని బెంగాలీ భాధా ముస్లిం సాహిత్య కార్యకలాపాలకు ఇది ప్రత్యేకత సంతరించుకుంది.
  • భవానిపూర్: ఇది జాతీయరహదారి-31 పక్కన ఉంది. ఇది జిల్లాకు కేంద్రస్థానంలో ఉంది. నగరంలో మంచి సాంకేతిక వ్యవస్థ ఉంది. ఇది చక్కని విద్యావంతులు కలిగిన నగరం. అంతేకాక అధికంగా జనసాంధ్రత కలిగిన నగరం. నగరంలో ప్రబలమైన భవానీపురియా గోపాల్ ఆతా సత్రం ఉంది.
  • సరుపేట: ఇది ఒక వ్యాపార కూడలి. ఇది భవానిపూర్ సమీపంలో ఉంది.
  • జనియా: జనియా బజార్ ఇది ఎఫ్.ఏ.ఎ. ఎం మెడికల్ కాలేజ్ (బార్పేట) సమీపంలో ఉంది..

ఆర్ధికం

2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బార్పేట జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న అస్సాం రాష్ట్రం లోని 11 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

శాసన వ్యవస్థ

శాసనసభ నియోజకవర్గాలు

జిల్లాలో 6 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.[5]

లోక్‌సభ నియోజకవర్గాలు

కోక్రాఝర్ లోక్‌సభ నియోజకవర్గం దీనిలో సోర్భోగ్ శాసనసభ నియోజకవర్గం భాగంగా ఉంది. పైవాటిలో మిగిలిన 5 నియోజకవర్గాలు బార్పేట లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[6]

2001 లో గణాంకాలు

విషయాలువివరణలు
జిల్లా జనసంఖ్య .1,693,190, [7]
ఇది దాదాపు.గునియా-బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని.ఇదాహో నగర జనసంఖ్యకు సమం.[9]
640 భారతదేశ జిల్లాలలో.292 వ స్థానంలో ఉంది.[7]
1చ.కి.మీ జనసాంద్రత.632[7]
2001-11 కుటుంబనియంత్రణ శాతం.21.4%.[7]
స్త్రీ పురుష నిష్పత్తి.951:1000 [7]
జాతియ సరాసరి (928) కంటే.అధికం
అక్షరాస్యత శాతం.65.03%.[7]
జాతియ సరాసరి (72%) కంటే.తక్కువ
  • 2001 గణాంకాలను అనుసరించి జిల్లాలో అధికంగా ముస్లిములు 977,943 (59.37%), తరువాత స్థానంలో హిందువులు 662,066, తరువాత స్థానంలో క్రైస్తవులు 5,267 ఉన్నారు.

మూలాలు

వెలుపలి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు