బాలోత్సవ్

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రతి సంవత్సరం నవంబరు నెల రెండవ వారంలో మూడు రోజుల పాటు శుక్ర, శని, ఆది వారాల్లో జరిగే బాలల పండుగ బాలోత్సవ్. పిల్లలలోని సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి ఒక వేదిక ఈ బాలోత్సవ్.

బాలోత్సవ్
బాలోత్సవ్
బాలోత్సవ్ 2017 లోగో
స్థితిక్రియాశీలకం
ప్రక్రియపిల్లల పండుగ
తేదీ(లు)నవంబరు రెండవ వారంలో 3,4 రోజులు
(బాలల దినోత్సవం వలె) )
ఫ్రీక్వెన్సీవార్షికం
స్థలంకొత్తగూడెం [a]
VVIT[b]
దేశంభారతదేశం
క్రియాశీల సంవత్సరాలు32
ప్రారంభించినది1991
ఇటీవలి28–30 November 2019
మునుపటి28–30 November 2018
వెబ్‌సైటు
[a]
[b]

నేపథ్యం

1960 సంవత్సరంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోని ఉద్యోగులంతా కలిసి, వారి రిక్రియేషన్ కోసం ఒక క్లబ్‍ను ఏర్పాటు చేసుకున్నారు, వీరి ఆలోచన ఫలితంగానే 1991లో బాలోత్సవ్ రూపొందింది. 1991లో క్లబ్ కార్యవర్గ ఎన్నికలలో గెలుపొందిన డాక్టర్ వాసిరెడ్డి రమేష్‍బాబు ఈ బాలోత్సవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజ హితవే లక్ష్యంగా ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో మొదటగా నాలుగు అంశాలతో మండల స్థాయిలో పోటీని నిర్వహించారు. చిత్రలేఖనం, వక్తృత్వం, క్విజ్, గీతాలాపన అంశాలతో ప్రారంభించిన ఈ బాలోత్సవ్ పోటీలలో 150 మంది పాల్గొన్నారు, ఈ బాలోత్సవ్ విజయవంతమవటంతో అప్పటి నుంచి ఈ క్లబ్ కార్యవర్గం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ బాలోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానించింది. 1995 నాటికి బాలోత్సవ్ జిల్లా స్థాయికి ఎదిగింది. ప్రతి సంవత్సరం కొత్త పోటీ అంశాలను పెంచుకుంటూ నిర్వహిస్తున్న ఈ బాలోత్సవ్ పాటించే ప్రమాణాలు, పారదర్శకత, ప్రతిభను గుర్తించే న్యాయనిర్ణయం కారణంగా రాష్ట్రస్థాయికి ఎదిగింది. 150 మందితో ప్రారంభమయిన ఈ బాలోత్సవ్ పోటీలలో 2012 నాటికి 15 వేల మంది బాలబాలికలు పాల్గొనే వేదికగా మారింది.సుదూర ప్రాంతాలనుండి వచ్చే బాలబాలికలకు భోజన వసతి సౌకర్యాలు క్లబ్ వారె సమకూరుస్తారు. నర్సరీ నుండి 10 వ తరగతి విద్యార్థి, విద్యార్థినులు మాత్రమే పాల్గొంటారు. అనేక విషయాలలో బాలలో దాగి వున్న బహుముఖ ప్రతిభను వెలికి తీయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశము. చిత్రలేఖనము, క్విజ్, భరత నాట్యం, కూచిపూడి, చిత్రలేఖనము, జానపద నృత్యం, విచిత్ర వేష ధారణ, వక్తృత్వ పోటీలు, వంటి సుమారు 20 పైగా అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. పతి ఏటా నవంబరు నెలలో ఈ పోటీలు జరుగు తాయి.

ఇవి కూడా చూడండి

బామా

బయటి లింకులు

మూలాలు

సాక్షి ఫన్‍డే 2012 నవంబరు 4
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు