భారత-బంగ్లాదేశ్ ఎన్‌క్లేవులు

ఇండో-బంగ్లాదేశ్ ఎన్‌క్లేవులు, లేదా చిత్‌మహళ్ళు (బెంగాలీ: ছিটমহল చిత్‌మొహొల్), కొన్నిసార్లు పాషా ఎన్‌క్లేవులుగా పిలిచే,[1] ప్రాంతాలు భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారతదేశంలోని పశ్చిమ బంగ, త్రిపుర, అసోం, మేఘాలయాల్లోనూ, బంగ్లాదేశ్ లోనూ ఉన్న ఎన్‌క్లేవులు. ఎన్‌క్లేవ్ అన్న పదానికి పూర్తిగా వేరే దేశపు భూభాగాలు చుట్టుముట్టిఉన్న ప్రాంతాలు. 106 భారతీయ ఎన్‌క్లేవులు ఉండగా, 92 బంగ్లాదేశీ ఎన్‌క్లేవులు ఉన్నాయి, వీటిలో 102 ప్రథమశ్రేణి భారత ఎన్‌క్లేవులు కాగా, వీటిలోని 71 భారత ప్రధానభూభాగంలో ఉన్న బంగ్లాదేశీ ప్రథమశ్రేణి ఎన్‌క్లేవులు. మొత్తం ఎన్‌క్లేవుల్లో 24 ద్వితీయ శ్రేణి ఎన్‌క్లేవులు లేదా కౌంటర్-ఎన్‌క్లేవులు (21 బంగ్లాదేశీ, 3 భారత), తుదకు ఒక కౌంటర్-కౌంటర్ ఎన్‌క్లేవ్(బంగ్లాదేశ్ లోని భారతదేశం ప్రాంతంలో మళ్ళీ బంగ్లాదేశ్ ప్రాంతం ఉండగా దానిలో ఈ ఎన్‌క్లేవ్ నెలకొంది) కూడా ఉంది. 2010లో నిర్వహించిన సంయుక్త జనగణనలో, 51,549 మంది ఈ ఎన్‌క్లేవుల్లో నివసిస్తున్నారు; వారిలో 37,334 మంది బంగ్లాదేశ్ లోని భారత ఎన్‌క్లేవుల్లో మిగిలినవారు భారతదేశంలోని బంగ్లాదేశీ ఎన్‌క్లేవుల్లో ఉన్నారు.[2][3]

ఎన్క్లేవుల పూర్తిస్థాయి పటం. పటం పై భాగం తూర్పు, భారతదేశం నారింజ రంగులోనూ, బంగ్లాదేశ్ లేతనీలం రంగులోనూ చిత్రించారు.

1974లో ఎన్‌క్లేవులను ఇచ్చి పుచ్చుకునేందుకు, అంతర్జాతీయ సరిహద్దులు సరళీకరించేందుకు ఉద్దేశించిన భూసరిహద్దు ఒప్పందంపై భారత, బంగ్లాదేశ్ ప్రధానులు సంతకాలు చేశారు. అయితే 41 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించి 7 మే 2015న భారత రాజ్యాంగానికి 100వ సవరణను భారత పార్లమెంటు ఆమోదించాకనే, ఒప్పందపు సవరించిన ప్రతి స్వీకరించారు.[4][5] 6 జూన్ 2015న ఆమోదం పొందిన ఈ ఒప్పందం ప్రకారం, భారత ప్రధానభూభాగంలో ఉన్న 51 బంగ్లాదేశీ ఎన్‌క్లేవులను ((7,110 ఎకరాలు[convert: unknown unit] విస్తరించి ఉన్నాయి) భారతదేశం స్వీకరించగా, బంగ్లాదేశ్ ప్రధానభూభాగంలో విస్తరించిన 111 భారతీయ ఎన్‌క్లేవులు (17,160 ఎకరాలు[convert: unknown unit] విస్తరించివున్నాయి) బంగ్లాదేశ్ కు చెందుతాయి.[6] ఎన్‌క్లేవుల్లో నివాసం ఉంటున్నవారిని ప్రస్తుతం ఉంటున్నచోటే ఉండి కొత్తదేశపు పౌరసత్వాన్ని పొందేందుకైనా, లేదా తమకు నచ్చిన దేశానికి వెళ్ళిపోయేందుకైనా అనుమతిస్తారు.[7]

నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు, పిల్లలను చదివించేందుకు, కాన్పు కోసం దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళేందుకు ఎన్‌క్లేవుల్లోని ప్రజలు ఊరు దాటినా సాంకేతికంగా వేరే దేశపు సరిహద్దుల్లోకి ప్రవేశించినందుకు జైలుశిక్షలు అనుభవించేవారు. లేదంటే వారి నివాసాన్ని, పేర్లను తప్పుగా చెప్పాల్సివచ్చేది. ప్రధాన భూభాగంలోని వ్యక్తులు వీరికి ఐడెంటిటీని కూడా అమ్మేవారు. జూన్ 2015లో భారత-బంగ్లాదేశ్ భూసరిహద్దు ఒప్పందం వల్ల ఏ ప్రధాన భూభాగంలోని ప్రాంతాలు ఆ దేశంలో కలిసినందుకు ఎన్ క్లేవుల ప్రజలు సంతోషిస్తున్నారు.[8] భారత-బంగ్లదేశ్ భూసరిహద్దు ఒప్పందం వల్ల 51వేలకు పైగా ఇరు దేశాల ప్రజల పౌరసత్వ సమస్య తీరింది.[9]

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు