మండీ

హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం

మండీ హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ప్రధాన పట్టణం. దీన్ని గతంలో మాండవ్ నగర్ అనేవారు. [3] [4] సాహోర్ అని కూడా పిలుస్తారు. పట్టణ పాలనను పురపాలక మండలి నిర్వహిస్తుంది. ఇది మండీ జిల్లాకు ముఖ్య పట్టణం.

మండీ
పట్టణం
Nickname(s): 
ఛోటీ కాశీ, పర్వత ప్రాంత వారణాసి
మండీ is located in Himachal Pradesh
మండీ
మండీ
Coordinates: 31°42′25″N 76°55′54″E / 31.70694°N 76.93167°E / 31.70694; 76.93167
దేశంభారతదేశం
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లామండీ
మునిసిపాలిటీమండీ
Founded byఅజ్బర్ సేబ్
Elevation
760 మీ (2,490 అ.)
Population
 (2011)[1]
 • Total26,422
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
175 001
టెలిఫోన్ కోడ్91-01905
Vehicle registrationHP-33 HP-65
 The Mandi Planning area also includes some portions of Mandi District.[2]

మండీ, వాయవ్య హిమాలయాలలో, రాష్ట్ర రాజధాని సిమ్లాకుకి ఉత్తరాన 145 కి.మీ. దూరంలో,[5] సముద్ర మట్టం నుండి 800 మీటర్ల ఎత్తున ఉంది. [6] వేసవి లోను, శీతాకాలం లోనూ వాతావరణం ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది. పఠాన్‌కోట్‌ వెళ్ళే జాతీయ రహదారి-20, మండీ గుండా పోతుంది. చండీగఢ్ నుండి మండీ సుమారు 184.6 కి.మీ. దూరంలోను, [7] ఢిల్లీ నుండి 440.9 కి.మీ. దూరంలోనూ ఉంది. [8] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, మండీ పట్టణ జనాభా 26,422. [1] కాంగ్రా జిల్లా తరువాత హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లా మండీయే.

మండీ, మండీ జిల్లాకు ముఖ్య పట్టణమే కాదు, సెంట్రల్ జోన్ ప్రధాన కార్యాలయం కూడా. ఈ జోన్‌లో కులు, బిలాస్‌పూర్, హమీర్‌పూర్ జిల్లాలు ఉన్నాయి. పర్యాటక ప్రదేశంగా, మండీని "పర్వత ప్రాంత వారణాసి" [9] అని, "చోటి కాశి" [10] అనీ, "హిమాచల్ కాశీ" అనీ పిలుస్తారు. అలాగే, ప్రాశర్ లేక్ ట్రెక్‌కు మండీయే ప్రారంభ స్థానం. మండీ నుండి, ట్రెక్కర్లు ప్రాశర్ సరస్సు ట్రెక్‌కు స్థావరమైన బాగి గ్రామానికి వెళతారు.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) నగరంలో ఉన్న ప్రధాన సంస్థ. [11] ఒకప్పటి మండీ సంస్థానానికి రాజధానియైన ఈ పట్తణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నగరాన్ని 1527 లో అజ్బర్ సేన్ స్థాపించాడు [12] 1948 వరకు మండీ సంస్థానానికి రాజధానిగా ఉంది. ఇక్కడ జరిగే మండీ శివరాత్రి తిరునాళ్ళు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రపు మొట్టమొదటి వారసత్వ నగరం. ఈ నగరంలో పాత రాజభవనాల అవశేషాలు, 'వలస' నిర్మాణానికి ముఖ్యమైన ఉదాహరణలు ఉన్నాయి.హిమాచల్ ప్రదేశ్ లోని అత్యంత పురాతన భవనాలలో కొన్ని మండీలో ఉన్నాయి.

వ్యుత్పత్తి

"మండీ" అనే పేరు దాని మునుపటి పేరు "మాండవ్ నగర్" నుండి వచ్చింది. [13] [14] [15] ఈ ప్రాంతంలో తపస్సు చేసిన 'మాండవ' మహర్షి పేరు మీదుగా దీనికి మాండవ్ నగర్ అనే పేరు వచ్చిందనేది ఐతిహ్యం. "సంత"కు హిందీ పేరైన మండీ [16] [17] నుండి ఉద్భవించి ఉండవచ్చుననేది మరో ఊహ. ఇది సంస్కృత మూల మండప్తికతో అనుసంధానించబడి ఉండవచ్చు, దీని అర్థం "బహిరంగ హాలు లేదా షెడ్డు". [18] [19]

పట్టణం పేరు "మండీ"గా మార్చేంత వరకు అధికారికంగా పేరు "మాండవ్ నగర్" అనే ఉండేది. [20] ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్న పేరు "మండీ"యే. [21] 81 ప్రాచీన రాతి శివాలయాలకూ, వాటి శిల్పకళకూ మండీ ప్రసిద్ధి చెందింది [22] [23] ఈ కారణంగానే దీనిని, "కొండప్రాంతపు వారణాసి" అని కూడా పిలుస్తారు.

జిల్లా కూర్పు

1948 ఏప్రిల్ 15 న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినపుడు మండీ, సుకేత్ సంస్థానాలను కలిపి మండీ జిల్లాను ఏర్పాటు చేసారు. అప్పటి నుండి, ఇది మండీ జిల్లాకు ముఖ్య పట్టణంగా పనిచేస్తోంది. మండీ జిల్లాలో జోగిందర్ నగర్, సర్కాఘాట్, సుందర్ నగర్, సదర్ మండీ, చచ్యోట్, తునాగ్, కర్సోగ్ అనే 7 తాలూకాలు, లాడ్‌భరోల్, పధేర్, సంధోల్, ధర్మాపూర్, మక్రేరీ, బల్‌ద్వారా, నిహిరి, కోట్లి, ఔట్, బలీచౌకీ అనే 9 ఉప తాలూకాలూ ఉన్నాయి.

మండీ నగర పరిషత్తు 1950 లో ఏర్పడింది. ఇందులో 13 వార్డులు ఉన్నాయి.

భౌగోళికం

మండీ నగరం గుండా వెళ్ళే బియాస్ నది (2004 లో తీసిన ఫోటో)

బియాస్ నది ఒడ్డున సుకేతి ఖాద్ వాగు బియాస్‌లో సంగమించే చోట మండీ పట్టణాన్ని నిర్మించారు. సికందర్ ధార్, ఘుగర్ ధార్, ధార్ కోట్‌లు నగరానికి సమీపంలో ఉన్న కొన్ని ప్రముఖ కొండలు, పర్వతాలు. మండీ 31 ° 72'N అక్షాంశం, 76 ° 92'E రేఖాంశం వద్ద ఉంది. సముద్ర మట్టం నుండి దీని ఎత్తు 764 మీటర్లు. [24] ఇది హిమాలయ శ్రేణిలోని మిడ్‌ల్యాండ్స్‌లో ఉంది. [25] ఎత్తులో విపరీతమైన వైవిధ్యం కారణంగా హిమాచల్ వాతావరణ పరిస్థితులలో గొప్ప వైవిధ్యం ఉంటుంది. దక్షిణ ప్రాంతాలలో వేడి, తేమతో కూడిన ఉష్ణమండల శీతోష్ణస్థితి నుండి ఉత్తర తూర్పు పర్వత శ్రేణులలో చల్లని ఆల్పైన్, హిమనదీయ శీతోష్ణస్థితి వరకూ మారుతూంటుంది. [26]

శీతోష్ణస్థితి

శీతోష్ణస్థితి డేటా - Mandi, Himachal Pradesh (1961–1990, rainfall 1951–2000)
నెలజనఫిబ్రమార్చిఏప్రిమేజూన్జూలైఆగసెప్టెంఅక్టోనవండిసెంసంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F)27.7
(81.9)
31.3
(88.3)
39.0
(102.2)
39.5
(103.1)
42.1
(107.8)
42.7
(108.9)
40.0
(104.0)
36.7
(98.1)
35.9
(96.6)
33.6
(92.5)
33.2
(91.8)
30.2
(86.4)
42.7
(108.9)
సగటు అధిక °C (°F)18.9
(66.0)
21.0
(69.8)
26.0
(78.8)
30.9
(87.6)
34.8
(94.6)
35.7
(96.3)
32.2
(90.0)
31.3
(88.3)
30.9
(87.6)
29.3
(84.7)
25.1
(77.2)
20.4
(68.7)
28.0
(82.4)
సగటు అల్ప °C (°F)2.3
(36.1)
3.9
(39.0)
8.7
(47.7)
13.6
(56.5)
17.3
(63.1)
19.5
(67.1)
20.7
(69.3)
20.1
(68.2)
17.8
(64.0)
11.9
(53.4)
6.8
(44.2)
2.8
(37.0)
12.1
(53.8)
అత్యల్ప రికార్డు °C (°F)−2.7
(27.1)
−2.0
(28.4)
0.0
(32.0)
4.3
(39.7)
5.4
(41.7)
8.5
(47.3)
12.0
(53.6)
11.4
(52.5)
9.7
(49.5)
4.3
(39.7)
1.0
(33.8)
−2.9
(26.8)
−2.9
(26.8)
సగటు వర్షపాతం mm (inches)82.0
(3.23)
66.0
(2.60)
72.4
(2.85)
33.8
(1.33)
70.9
(2.79)
164.3
(6.47)
515.7
(20.30)
445.8
(17.55)
151.4
(5.96)
33.3
(1.31)
14.9
(0.59)
35.1
(1.38)
1,685.6
(66.36)
సగటు వర్షపాతపు రోజులు (≥ 2.5 mm)4.54.14.63.03.97.815.916.77.51.81.02.172.9
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST)58544544444968746560607257
Source 1: India Meteorological Department[27]
Source 2: International Scholarly Research Network[28]

ఆర్థిక వ్యవస్థ

జాతీయ రహదార్లు - 20, 21, 70 లు కలిసే కూడలిలో ఉన్న మండీ పట్తణం, హిమాచల్ ప్రదేశ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఒకటి. ఇది కుల్లు, లాహౌల్, లేహ్ లడఖ్‌కు ప్రవేశ ద్వారం వంటిది. జిల్లా ప్రధాన కార్యాలయం కావడంతో, వ్యాపార వాణిజ్యాల కోసం, సేవలు, పౌర పరిపాలన కోసం జిల్లా యావత్తూ ఈ పట్టణంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతపు ఆర్థికవ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారితం. మొత్తం జనాభాలో 79% మంది తమ జీవనోపాధి కోసం వ్యవసాయంపై గానీ, దానితో సంబంధం ఉన్న కార్యకలాపాలపై గానీ ఆధారపడి ఉన్నారు.

రవాణా

మండీ, ఢిల్లీ నుంచి 475 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రయాణానికి సుమారు 12 గంటలు పడుతుంది. ఢిల్లీ నుండి మండీ చేరుకోవడానికి మరో పద్ధతి - ఢిల్లీ-ఊనా హిమాచల్ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో కిరాత్‌పూర్ సాహిబ్ వరకు ప్రయాణించి, అక్కడి నుండి బస్సులో మండీ వెళ్ళడం. ఢిల్లీ, చండీగఢ్‌ల నుండి మండీ వెళ్లే బస్సులన్నీ కిరాత్‌పూర్ గుండానే వెళ్తాయి. [29]

చండీగఢ్ నుండి మండీకి మనాలికీ బస్సులున్నాయి. ఢిల్లీ నుండి బస్సులు చండీగఢ్ గుండానే వెళతాయి. కొన్ని బస్సులు చండీగఢ్ నుండే బయల్దేరుతాయి. చండీగఢ్ మండీ ల మధ్య దూరం 200 కి.మీ. ఈ దూరం ప్రయాణించడానికి బస్సులో సుమారు 6 గంటలు పడుతుంది. [30]

75 కి.మీ.దూరంలో భుంతర్ వద్ద ఉన్న కుల్లు విమానాశ్రయం మండీకి సమీపం లోని విమానాశ్రయం. ఇది ఒక చిన్న దేశీయ విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, సిమ్లాల నుండి విమాన సేవలున్నాయి. [31]

ప్రస్తుతం మండీకి రైలుమార్గం లేదు. కాంగ్రా వ్యాలీ రైల్వేను మండీ వరకు పొడిగించి, కొత్త బిలాస్‌పూర్-లే లైన్‌తో అనుసంధానించే ప్రతిపాదన ఉంది. నగరం నుండి 50 కి.మీ. దూరం లోని జోగీందర్‌నగర్, మండీకి అత్యంత సమీపం లోని రైల్వే స్టేషన్. ఇదే కాంగ్రా వ్యాలీ రైల్వేలో చివరి స్టేషను.

జనాభా వివరాలు

2001 భారత జనగణన ప్రకారం [32] పట్టణ జనాభా 26,858. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. మండీ సగటు అక్షరాస్యత 83.5%. ఇది జాతీయ సగటు 65.38% కన్నా ఎక్కువ. రాష్ట్ర అక్షరాస్యత రేటు (83.57%) కు ఇది సమానం: పురుష అక్షరాస్యత 92%, మహిళా అక్షరాస్యత 75%.[33] మండీ జనాభాలో 11% మంది ఆరేళ్ళ కంటే చిన్న పిల్లలు. మండీలో పురుషులకంటే స్త్రీలు ఎక్కువ - 2011 లో ఇక్కడి లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 1013 మంది స్త్రీలు. మండీ జనాభాలో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు ఉన్నారు. జనాభాలో 90% కంటే ఎక్కువ మంది హిందువులు.[1]

విద్యా సౌకర్యాలు

జవహర్‌లాల్ నెహ్రూ ఇంజనీరింగ్ కళాశాల

నగరంలో DAV సెంటెనరీ పబ్లిక్ స్కూల్, [34] కేంద్రీయ విద్యాలయ, [35] మండీ పబ్లిక్ స్కూల్, సింధు గ్లోబల్ స్కూల్, ది ఫీనిక్స్ స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, [36] విజయ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్, [37] ప్రభుత్వం సీనియర్ సెకండరీ స్కూల్ (బాలికలు), [38] సర్వతి విద్యా మందిర్, సాయి పబ్లిక్ స్కూల్, [39] సెయింట్ జేవియర్ రెసిడెన్షియల్ స్కూల్, [40] DAV సీనియర్ సెకండరీ స్కూల్, [41] ఆంగ్లో సంస్కృత మోడల్ స్కూల్ వంటి పాఠశాలలు ఉన్నాయి. [42] మండీలో హిమాచల్ డెంటల్ కాలేజీ. [43] శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వ వైద్య కళాశాల, [44] జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, [45] టిఆర్ అభిలాషి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, [46] వల్లభ్ భాయ్ ప్రభుత్వ కళాశాల [47] వంటి ఉన్నత విద్యా సంస్థలు నగరంలో ఉన్నాయి. మండీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ కూడా ఉంది.

పట్టణ ప్రముఖులు

చిత్ర మాలిక

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు