మన్మథుడు

హిందూ ప్రేమ దేవుడు
(మన్మధుడు నుండి దారిమార్పు చెందింది)

మన్మథుడు హిందూ పురాణాలలో ప్రేమకు సంబంధించిన దేవుడు. ఇతని భార్య రతీదేవి.

మన్మథుడు
హిందువుల కామ దేవుడు
దేవనాగరిकाम देव
తమిళ లిపిகாம தேவன்
సంప్రదాయభావంప్రద్యుమ్నుడు, వాసుదేవుడు
ఆవాసంKetumala-varsa
మంత్రంకామ గాయత్రి[1]
ఆయుధంచెఱుకు విల్లు , పూల బాణం
భార్యరతి, ప్రీతి
వాహనంచిలుక

పురాణాలలో మన్మథుడు

మన్మథునికి శివునికి గల సంబంధం వివరించే కథలు మత్స్య పురాణము, శివ పురాణములలో తెలుపబడినవి.[2][3] ఇంద్రుడు, ఇతర దేవతలను తారకాసురుడు బాధించసాగెను. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.

వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. వీరి కుమారుడు కార్తికేయుడు తారకాసురున్ని వధిస్తాడు.[4]

శివునిపై మదన బాణాన్ని సంధిస్తున్న కామదేవుడు.

స్వరూపం

మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు చూపుతారు. ఇతని విల్లు చెఱుకు గడతోను, బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.[5][6] ఈ పువ్వులు: అశోకం, తెలుపు, నీలం పద్మాలు, మల్లె, మామిడి పూలు. ప్రాచీనమైన మన్మథుని విగ్రహం మథుర సంగ్రహాలయంలో భద్రపరచబడింది.

రతి, ప్రీతి భార్యలతో కామదేవుడు.

ఆరాధన

  • కామ గాయత్రి : "ఓం కామ దేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్"

ఇతర పేర్లు

మూలాలు

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు