రవి కన్నన్

కాన్సర్ శస్త్ర చికిత్స వైద్యుడు

రవి కన్నన్ భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఉన్న కాన్సర్ శస్త్రచికిత్సా వైద్యుడు (సర్జికల్ ఆంకాలజిస్ట్). ఆయన ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందించే లాభాపేక్షలేని ఆసుపత్రి అయిన కచార్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (CCHRC) అధిపతి (డైరెక్టర్).[1] ఆయన చెన్నై అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సర్జికల్ ఆంకాలజీ విభాగానికి మాజీ అధిపతి. ఆయన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ, ఆసియాలో అత్యున్నత పురస్కారం అయిన రామన్ మెగసెసే అవార్డు ("నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఆసియా " అని పిలువబడుతుంది) గ్రహీత.[2][3]

ఆర్. రవి కన్నన్
మానవుడు
లింగంపురుషుడు మార్చు
పౌరసత్వ దేశంభారతీయుడు మార్చు
మాట్లాడే భాషలుఇంగ్లీషు మార్చు
వృత్తివైద్యుడు మార్చు

విద్య

కన్నన్ చెన్నైలోని కిల్ పాక్ మెడికల్ ఇన్స్టిట్యూట్ నుండి ' ఎంబిబిఎస్' డిగ్రీ పట్టా పొందడం జరిగింది[4]. న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ నుండి సర్జికల్ అంకాలజీలో మాస్టర్ ఆఫ్ సర్జరీ డిగ్రీని పొందడం జరిగింది.

భారత ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ 2013లో రవి కన్నన్ ఆర్ కు వైద్యశాస్త్రంలో మహావీర్ అవార్డును ప్రదానం చేశారు.

వృత్తి, ఉద్యోగం

కన్నన్ చెన్నై లోని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంకాలజి విభాగానికి అధిపతిగా ఉన్నాడు.[5] అతను ఒక సహోద్యోగి అభ్యర్థన మేరకు అస్సాం రాష్ట్రంలోని కాచల్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ను సందర్శించాడు. ఆ సమయంలోనే ఆయన అప్పటి సి.సి.హెచ్.ఆర్.సి అధిపతిని కలుసుకున్నారు. ఆయన ఈ కేంద్రానికి నాయకత్వం వహించాలని ప్రతిపాదించారు.[6] బరాక్ వ్యాలీ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు అందించడానికి కన్నన్ చెన్నైలో విడిచి అస్సాం రాష్ట్రానికి వెళ్లారు.

వైద్య విద్యలో డాక్టర్ రవి కన్నన్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు.

పురస్కారాలు

ఇతని సేవలకు గుర్తింపు గాను ఆసియా నోబెల్ పురస్కారంగా పిలిచే రామన్ మెగసెసే అవార్డు 2023వ సంవత్సరంలో అందుకున్నారు. 2020 వ సంవత్సరం జనవరి 26వ తేదీన భారతదేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీని అందుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇతను చేసిన వైద్య సేవలకు గానూ 2013 వ సంవత్సరంలోభారత ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ 2013లో మహావీర్ పురస్కారాన్ని అందజేశారు[7].

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు