రావు బహదూర్

రావు బహదూర్ అనేది భారతదేశంలో బ్రిటిషు పాలనలో ఉన్నపుడు వ్యక్తులకు విశ్వాసపూర్వక సేవ చేసినందుకు లేదా సామ్రాజ్యానికి ప్రజా సంక్షేమ కృషి చేసినందుకు ఇచ్చిన గౌరవ బిరుదు. దీన్ని దక్షిణ భారతదేశంలో రావు బహదూర్ అనగా, ఉత్తర భారతంలో రాయ్ బహదూర్ అంటారు. 1911 నుండి, బిరుదుతో పాటు పతకాన్ని కూడా ఇచ్చేవారు. [1] రావు అంటే "రాజు" అని బహదూర్ అంటే "ధైర్యవంతుడు" లేదా "అత్యంత గౌరవప్రదమైన" అనీ అర్థం. దీన్ని ప్రధానంగా హిందువులకు ఇచ్చేవారు. ముస్లింలకు, పార్సీలకూ దీనికి సమానమైన బిరుదు ఖాన్ బహదూర్ . సిక్కులకు సర్దార్ బహదూర్ .

రావు బహదూర్ బిరుదు పతకం

రావు బహదూర్ బిరుదు పొందే వ్యక్తులను సాధారణంగా, దీనికంటే తక్కువ స్థాయి బిరుదైన రాయ్ సాహిబ్ బిరుదు పొందిన వారి నుండి ఎంపిక చేసేవారు. ఈ రెండు బిరుదులూ దివాన్ బహదూర్ కంటే తక్కువ స్థాయికి చెందినవి. [2] ఈ బిరుదులన్నీ స్థాయిలో నైట్ హుడ్ లోని రెండు ఆర్డర్ల - ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్, ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా - కంటే దిగువన ఉంటాయి. [1]

కొందరు రావు బహదూర్ బిరుదు గ్రహీతలు

విద్యావేత్తలు

  • సదాశివ జైరామ్ దేహద్రాయ్, సంస్కృత ప్రొఫెసర్, జబల్పూర్ కళాశాల. [3]
  • యర్రమిల్లి నారాయణ మూర్తి పంతులు గారు, నరసాపురం, పశ్చిమగోదావరి జిల్ల. Advocate, సామాజిక కార్యకర్త.
  • ప్రియా నాథ్ దత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, పంజాబ్ యూనివర్సిటీ [4]
  • SN (సత్య నంద్) ముఖర్జీ ఎస్క్, BA (కాంటాబ్), MA (కాంటాబ్), సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ 6 వ ప్రిన్సిపాల్,రాంగ్లర్ కేంబ్రిడ్జిలోని క్వీన్స్ కాలేజీ నుండి గణితశాస్త్ర ట్రిపోస్. లిండ్సే కమిషన్ సభ్యుడు. [5] [6] [7] [8]

సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు

  • SA సమీనాథ అయ్యర్, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త.
  • దామోదర్ బంగేరా, స్వాతంత్ర్య సమర యోధుడు
  • మాణిక్ లాల్ జోషి, బుంది ముఖ్యమంత్రి [9]
  • జస్వంత్ రాజ్ మెహతా  రాజకీయ నాయకుడు, లోక్‌సభకు ఎన్నికయ్యాడు ; 1947 లో జోధ్‌పూర్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు
  • సి. జంబులింగం ముదలియార్ (1857 - 1906), రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు
  • TM జంబులింగం ముదలియార్ (1890 - 1970), NLC ఇండియా లిమిటెడ్ స్థాపించడానికి 620 ఎకరాల భూమిని ఇచ్చిన పరోపకారి, స్వాతంత్ర్య సమరయోధుడు
  • కూర్మా వెంకట రెడ్డి నాయుడు, మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి.
  • సేఠ్ విశందాస్ నిహల్‌చంద్, సింధీ రాజకీయవేత్త, సంఘ సంస్కర్త, పరోపకారి
  • చోటూ రామ్, పంజాబ్ వ్యవసాయ, హోం వ్యవహారాల మంత్రి, 1945. పంజాబ్ శాసనసభకు తొలి భారతీయ స్పీకర్.

పౌర సేవకులు, ప్రభుత్వ అధికారులు

  • జగన్ నాథ్ భండారి రాజ్ రతన్, ఇదార్ స్టేట్ దివాన్ [10]
  • లాడా దామోదర్ దాస్, పంజాబ్‌లో అసిస్టెంట్ కమిషనర్ [4]
  • దివాన్ జగ్గత్‌నాథ్, డేరా ఇస్మాయిల్ ఖాన్ మునిసిపల్ కమిటీ, జిల్లా బోర్డుల కార్యదర్శి [9]
  • సాహు పర్సోతం సరన్ కోఠీవాలా, జిల్లా బోర్డు సభ్యుడు, మొరాదాబాద్ [4]
  • లాలా జై లాల్, మున్సిపల్ కమిటీ సభ్యుడు, సిమ్లా [4]
  • ఎ. సవరినాథ పిళ్లై, మద్రాస్ ప్రెసిడెన్సీ ఆదాయ పన్ను సహాయ కమిషనర్; విశిష్ట ప్రజా సేవ, రాజు పట్టాభిషేక అవార్డు విజేత, లండన్ [11]
  • అక్షయ్ కుమార్ సర్కార్, సూపరింటెండెంట్, వాణిజ్య పరిశ్రమల శాఖ, భారత ప్రభుత్వం [9]
  • బేతారం శర్మ, సబ్-డిప్యూటీ కలెక్టర్, తేజ్‌పూర్, అస్సాం [4]

వాణిజ్యం, పరిశ్రమ

  • జమ్నాలాల్ బజాజ్, పారిశ్రామికవేత్త (తరువాత బిరుదును వెనక్కి ఇచ్చేసాడు) [12]
  • దివాన్ బహదూర్ పి. సోమసుందరం చెట్టియార్, కోయంబత్తూర్ - పారిశ్రామికవేత్త, వస్త్రపరిశ్రమకు మార్గదర్శకుడు. [13]
  • జగ్మల్ రాజ చౌహాన్, పారిశ్రామికవేత్త, ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్
  • జైరామ్ వాల్జీ చౌహాన్, పారిశ్రామికవేత్త
  • సేథ్ సరూప్‌చంద్ హుకంచంద్, (1874-1959) ఇండోర్ వ్యాపారి, భారతీయ పరిశ్రమకు సితార, జైన సమాజ నాయకుడు [9]
  • గుజార్ మల్ మోడీ, మోడీ గ్రూప్ వ్యవస్థాపకుడు
  • మోహన్ సింగ్ ఒబెరాయ్, ఒబెరాయ్ గ్రూప్ వ్యవస్థాపకుడు

ఇంజనీరింగ్, సైన్స్, మెడిసిన్

  • గోడే వెంకట జగ్గారావు - గణిత, ఖగోళ శాస్త్రవేత్త
  • అంకితం వెంకట నరసింగరావు - ఖగోళ శాస్త్రవేత్త
  • దయా రామ్ సాహ్నీ - పురావస్తు శాస్త్రవేత్త
  • కైలాష్ చంద్రబోస్, CIE, OBE, మొదటి నైట్ ఇండియన్ వైద్యుడు. [14]
  • ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి, బెంగాల్ ప్రెసిడెన్సీ , కాలా అజార్ చికిత్స కోసం యూరియా స్టిబమైన్ ఆవిష్కరణ
  • బాల్కిషెన్ కౌల్, సర్జన్, లెక్చరరు, లాహోర్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంటు [4]
  • పుట్టన వెంకట్రమణ రాజు (1894-1975), సివిల్ ఇంజనీర్, భారత ప్రభుత్వ పారిశ్రామిక సలహాదారు, విద్యావేత్త.
  • రామ్ ధన్ సింగ్ (డా.), అగ్రగామి వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రిన్సిపాల్, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ల్యాల్‌పూర్, పూర్వ పంజాబ్, 1947. [15]

చట్టం, న్యాయం

  • బాబూ రామ్ సదన్ భట్టాచార్జీ, డిప్యూటీ మేజిస్ట్రేట్, బెంగాల్ [4]
  • చౌదరి దివాన్ చంద్ సైని MBE, పంజాబ్ గురుదాస్‌పూర్, పంజాబ్ హైకోర్టు ప్రముఖ న్యాయవాది, క్రిమినల్ బార్ నాయకుడు; వలసరాజ్యాల పంజాబ్ శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యాడు
  • రాజేంద్రనాథ్ దత్, న్యాయమూర్తి, బెంగాల్ [4]
  • సోతి రఘుబన్స్ లాల్, సబార్డినేట్ జడ్జి, షాజెహాన్పూర్ [4]
  • సాధ్ అచరాజ్ లాల్, గౌరవ మేజిస్ట్రేట్, మునిసిపల్ బోర్డు సభ్యుడు, మీర్జాపూర్ [4]
  • జ్వాలా ప్రసాద్, ప్రభుత్వ ప్లీడర్ [4]
  • రఘునాథ్ శరణ్, బీహార్‌లో జిల్లా న్యాయమూర్తి [16]
  • బాబు బహదూర్ సింగ్, గౌరవ మేజిస్ట్రేట్, పిలిభిత్ [4]
  • బాబు షుహ్రత్ సింగ్, చంద్‌పూర్‌ జమీందార్, గౌరవ మేజిస్ట్రేట్, బస్తీ [4]
  • గోపాల్ హరి దేశ్‌ముఖ్, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో న్యాయమూర్తి

సాహిత్యం, కళలు

  • మలయాళంలో ప్రచురించబడిన మొదటి నవల కుండలత రచయిత అప్పు నేడుంగడి

దాతృత్వం, మతం, సేవ

  • రాంచోడ్‌లాల్ చోటాలాల్, టెక్స్‌టైల్ మిల్లు మార్గదర్శకుడు, పరోపకారి
  • ధర్మరత్నాకర ఆర్కాట్ నర్రెయిన్‌సామి ముదలియార్, పరోపకారి.
  • అంబ ప్రసాద్, ఢిల్లీ పరోపకారి
  • సాలిగ్ రామ్ (రాయ్ సాలిగ్రామ్)), (1829-1898) పోస్ట్ మాస్టర్-జనరల్, వాయువ్య ప్రావిన్సులు, శివ్ దయాల్ సింగ్ సేథ్ శిష్యుడు.
  • రణదప్రసాద్ సాహా, పరోపకారి
  • ఏలే మల్లప్ప శెట్టారు, పరోపకారి, 1887, బెంగళూరులో మొట్టమొదటి ప్రసూతి ఆసుపత్రిని నిర్మించాడు. వాణి విలాస్ హాస్పిటల్ నిర్మాణానికి నిధులు సమకూర్చాడు. బెంగళూరు లోని కాడు మల్లేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించాడు [9]
  • సర్దార్ బహదూర్ జగత్ సింగ్ (సంత్) (1884-1951), లియాల్‌పూర్, విభజనకు ముందు పంజాబ్ సూరత్ శబ్ద్ యోగా అభ్యాసకుడు, గురువు
  • వ్యాపారవేత్త, పరోపకారి అయిన గుబ్బి తోటడప్ప, ధర్మచాత్ర (ప్రయాణికులకు ఉచిత బస స్థలాలు), కర్ణాటక అంతటా విద్యార్థులకు ఉచిత హాస్టల్స్ స్థాపించాడు.
  • ఎ. వీరియా వండయార్, పరోపకారి.

పోలీసు, అత్యవసర సేవలు

  • తీరత్ సింగ్ బక్షి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, యునైటెడ్ ప్రావిన్స్
  • పూర్ణ చంద్ర లాహిరి, ఇండియన్ పోలీస్ ఆఫీసర్, కలకత్తా
  • PK మొన్నప్ప, మూడు రాష్ట్రాల దక్షిణ భారత పోలీసు చీఫ్, మద్రాస్, హైదరాబాద్, మైసూర్.
  • సత్యన్ నాథ్ (SN) ముఖర్జీ, కలకత్తాకు మొదటి భారతీయ పోలీసు డిప్యూటీ కమిషనర్. [17] [18] [19]

ఇతరులు

  • బాబు నళిని కాంత రే, అస్సాం దస్తీదార్ [4]

ఇవి కూడా చూడండి

మూలాలు

 

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు