శనివారపుపేట

ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, ఏలూరు మండల జనగణన పట్టణం

శనివారపుపేట, ఏలూరు జిల్లా, ఏలూరు మండలానికి చెందిన జనగణన పట్టణం. ఇది ఏలూరు రెవెన్యూ డివిజన్‌ లోని ఏలూరు మండలంలో ఉంది. ఈ పట్టణం ఏలూరు పట్టణ సమ్మేళనంలో ఒక భాగం. ఏలూరు నుండి ముసునూరు మీదుగా నూజివీడు వెళ్ళేమార్గంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం దాదాపు ఏలూరు నగరంలో కలిసిపోయింది. గ్రామం శివారులలోని పొలాలలో వరి, కొబ్బరి, కూరగాయలు ప్రధానమైన పంటలు. గ్రామంలో చెన్నకేశవ స్వామి, రామ లింగేశ్వర స్వామి వార్ల దేవాలయం ప్రధానమైన ఆకర్షణ. ఈ ఆలయం చిన్న తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో ఉంది. ఈ ఆలయ గోపురం చాలా ఎత్తైంది, వివిధ పురాణ గాథలు చక్కని శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి.

శనివారపుపేట
—  జనగణన పట్టణం  —
శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం, శనివారంపేట
శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం, శనివారంపేట
శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం, శనివారంపేట
శనివారపుపేట is located in Andhra Pradesh
శనివారపుపేట
శనివారపుపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°43′26″N 81°05′46″E / 16.723789°N 81.096208°E / 16.723789; 81.096208
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలంఏలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం8,142
 - పురుషులు4,112
 - స్త్రీలు4,030
 - గృహాల సంఖ్య2,114
పిన్ కోడ్ 534002
ఎస్.టి.డి కోడ్

పట్టణ జనాభా

  • 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం శనివారపుపేట పట్టణ జనాభా మొత్తం 8,142, అందులో 4,112 మంది పురుషులు కాగా, 4,030 మంది స్త్రీలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 822, ఇది శనివారపుపేట (సిటి) మొత్తం జనాభాలో 10.10 %. శనివారపుపేట పట్టణంలో స్త్రీ లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 993కి వ్యతిరేకంగా 980గా ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939తో పోలిస్తే శనివారపుపేటలో బాలల లింగ నిష్పత్తి 971గా ఉంది. శనివారపుపేట పట్టణ అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు కంటే 85.25 % 67% ఎక్కువ శనివారపుపేటలో పురుషుల అక్షరాస్యత దాదాపు 88.17% కాగా స్త్రీల అక్షరాస్యత 82.26 %.ఉంది.[1] పట్టణ పరిధిలోని గృహాల 2,114 ఉన్నాయి.
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7456. ఇందులో పురుషుల సంఖ్య 3812, మహిళల సంఖ్య 3644, గ్రామంలో నివాస గృహాలు 1742 ఉన్నాయి.

రవాణా

శనివారపుపేట రోడ్డు ద్వారా ఇతర ప్రాంతాలకు బాగా అనుసంధానం ఉంది.[2] ఏలూరు నగరపాలక సంస్థ ద్వారా శనివారపుపేట రహదారిని 4 మార్గాల (60 అడుగుల) రహదారిగా మెరుగు పర్చారు.[3]

చదువు

ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్య రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ, సహాయ, ప్రైవేట్ పాఠశాలల ద్వారా అందించబడుతుంది. [4][5]

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు