ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా
(సబ్ కలెక్టర్ నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ లో 76 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) అధిపతిగా ఉంటాడు. రెవెన్యూ డివిజన్లు కేంద్రాలను ఉప జిల్లాలు అనికూడా అంటారు.

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు

చరిత్ర

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022కు ముందు 2021 డిసెంబరు 22న ఏర్పడిన బద్వేల్ రెవెన్యూ డివిజనుతో కలిపి రాష్ట్రంలో 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. తొలి పునర్వ్యవస్థీకరణలో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాడ్డాయి.[1] ఆ తరువాత కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో 7 మండలాలతో 2022 జూన్ 29 న కొత్తపేట కేంద్రంగా కొత్తపేట రెవెన్యూ డివిజను, వైఎస్ఆర్ జిల్లాలో 8 మండలాలతో పులివందుల కేంద్రంగా పులివెందుల రెవెన్యూ డివిజను, కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో 9 మండలాలతో 2022 ఆగస్టు 5న రేపల్లె కేంద్రంగా రేపల్లె రెవెన్యూ డివిజను ఏర్పడ్డాయి.

అయితే తూర్పు గోదావరి జిల్లా లోని ఎటపాక రెవెన్యూ డివిజనులో ఉన్న నాలుగు మండలాలు, డివిజను కేంద్రం ఎటపాకను, పునర్వ్యవస్థీకరణలో కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగంగా చేర్చి, ఎటపాక రెవెన్యూ డివిజనులో ఉన్న మండలాలు కొత్తగా ఏర్పడిన రంపచోడవరం రెవెన్యూ డివిజనులో కలిసాయి.దాని పర్యవసానంగా ఎటపాక రెవెన్యూ డివిజను రద్దై, చారిత్రాత్మక రెవెన్యూ డివిజనుగా మిగిలింది. ఆ తరువాత 2022 అక్టోబరు 25 న రంపచోడవరం రెవెన్యూ డివిజనులోని నాలుగు మండలాలతో (ఈ మండలాలు ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 కు ముందు ఎటపాక రెవెన్యూ డివిజనులో ఉన్నాయి) చింతూరు రెవెన్యూ డివిజను ఏర్పడింది.[2]

రెవెన్యూ విభాగాల జాబితా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 76 రెవెన్యూ డివిజన్ల పట్టిక[3][4]

జిల్లారెవెన్యూ డివిజన్ల సంఖ్యరెవెన్యూ డివిజన్ల పేర్లు
అనకాపల్లి2అనకాపల్లి, నర్సీపట్నం
అనంతపురం3గుంతకల్ (కొత్త), అనంతపురం, కళ్యాణదుర్గం
అన్నమయ్య3రాజంపేట, రాయచోటి (కొత్త), మదనపల్లి
అల్లూరి సీతారామరాజు3పాడేరు, రంపచోడవరం, చింతూరు
ఎన్టీఆర్3విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)
ఏలూరు3జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు
కర్నూలు3కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)
కాకినాడ2పెద్దాపురం, కాకినాడ
కృష్ణా3గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)
కోనసీమ3రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త) [5][6]
గుంటూరు2గుంటూరు, తెనాలి
చిత్తూరు4చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)
తిరుపతి4గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి
తూర్పుగోదావరి2రాజమహేంద్రవరం, కొవ్వూరు
నంద్యాల3ఆత్మకూరు (కొత్త), నంద్యాల, డోన్ (కొత్త)
పల్నాడు3గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)
పశ్చిమగోదావరి2నర్సాపురం, భీమవరం (కొత్త)
పార్వతీపురం మన్యం2పార్వతీపురం, పాలకొండ
ప్రకాశం3మార్కాపురం, కనిగిరి (కొత్త), ఒంగోలు
బాపట్ల3బాపట్ల (కొత్త), చీరాల (కొత్త), రేపల్లె (కొత్త) [7]
విజయనగరం3బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం
విశాఖపట్నం2భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం
వైఎస్‌ఆర్4బద్వేల్,[8] కడప, జమ్మలమడుగు, పులివెందుల (కొత్త) [9]
శ్రీకాకుళం3పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు4కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు
శ్రీ సత్యసాయి4ధర్మవరం, కదిరి, పుట్టపర్తి (కొత్త), పెనుకొండ

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు