సిర్సా జిల్లా

హర్యానా లోని జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో సిర్సా జిల్లా (హిందీ: सिरसा ज़िला, పంజాబీ: ਸਿਰਸਾ ਜ਼ਿਲਾ) ఒకటి. సిర్సా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. సిర్సా పట్టణం ఢిల్లీ నుండి 250 కి.మీ దూరంలో ఉంది. జాతీయ రహదారి 10 ఈ జిల్లా గుండా పోతుంది.

సిర్సా జిల్లా
सिरसा ज़िला
ਸਿਰਸਾ ਜ਼ਿਲਾ
హర్యానా పటంలో సిర్సా జిల్లా స్థానం
హర్యానా పటంలో సిర్సా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
ముఖ్య పట్టణంసిర్సా
Government
 • శాసనసభ నియోజకవర్గాలు5
Area
 • మొత్తం4,277 km2 (1,651 sq mi)
Population
 (2001)
 • మొత్తం11,16,649
 • Density260/km2 (680/sq mi)
 • Urban
26.28%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత60.55%
 • లింగ నిష్పత్తి882
Websiteఅధికారిక జాలస్థలి

పేరు వెనుక చరిత్ర

జిల్లా కేంద్రం సిర్సా పేరే జిల్లాకూ పెట్టారు. సిర్సా అనే పేరుకు మూలం సంస్కృత పదం " సైరిషక ". మహాభారతం కావ్యంలోని ఎనిమిదవ అధ్యాయంలో దివ్యవాదన విభాగంలో ఈ పేరు ప్రస్తావించబడింది. మహాభారతంలో నకులుని పశ్చిమదేశ జైత్రయాత్రలో సైరిషిక ప్రాంతం వర్ణించబడింది.క్రీ.పూ 5 వ శతాబ్దంలో ఈ ప్రాంతం సుసంపన్నంగా ఉండేదని భావిస్తున్నారు. పాణిని రచనలలో కూడా ఈ ప్రాంత ప్రస్తావన ఉంది.

ఈ ప్రాంతం పేరును గురించి వైవిధ్యమైన ప్రస్తావనలు ఉన్నాయి. ఈ ప్రాంతం పురాతన నామం సైరిషిక నుండి కాలక్రమంలో రూపాంతరం చెంది సిర్సా అయింది. ప్రాంతీయ కథనాలు ఈ ప్రాంతంలో 7వ శతాబ్దంలో సరస్ అనే రాజు నిర్మించాడని భావిస్తున్నారు. ఆయన ఇక్కడ ఒక కోటను నిర్మించాడని భావిస్తున్నారు. అందుకు చొహ్నంగా నగరానికి ఆగ్నేయంలో 5చ.కి.మీ వైశాల్యంలో ఇప్పటికీ కోట అవశేషాలు లభిస్తున్నాయి. ఈ నగరానికి సమీపంలో ప్రవహిస్తున్న సరస్వతి నది కారణంగా కూడా దీనికీ పేరు వచ్చిందని భావిస్తున్నారు. మద్యయుగంలో ఈ ప్రాంతాన్ని సరస్తుతి అని పిలిచే వారు. ఇక్కడ విస్తారంగా ఉన్న దిరిశన చెట్ల కారణంగా కూడా ఈ ప్రాంతానికి సిర్సా అన్న పేరు వచ్చిందని భావిస్తున్నారు. దీనిని పాణిని ఆయన శిష్యుని రచనలు బలపరుస్తున్నాయి. పురాతన కాలంలో సిర్సా సిరసపట్టణం అని పిలువబడేది. మరికొందరు ఇక్కడ ఉన్న ప్రఖ్యాతమైన " సరసైనాథ్ " ఆలయం కారణంగా కూడా ఈ ప్రాంతానికీ పేరు వచ్చిందని భావిస్తున్నారు.

చరిత్ర

1819లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆక్రమించి వాయువ్య ఢిల్లీ లోని భాగంగా చేసింది. 1820లో వాయువ్యఢిల్లీ నుండి ఉత్తర, పశ్చిమ డిల్లీ జిల్లాలు ఏర్పాటు చేయబడినప్పుడు ఈ ప్రాంతం పశ్చిమ ఢిల్లీలో భాగంగా మారింది. తరువాయ ఈ ప్రాంతం హర్యానా రాష్ట్ర జిల్లాగా మార్చబడింది. 1837లో హర్యానా నుండి వేరుచేయబడి కొత్తగా ఏర్పాటు చేయబడిన బట్టియానా జిల్లాలో భాగంగా మారింది. 1858లో బట్టియానా జిల్లా పంజాబు ప్రొవింస్‌కు బదిలీ చేయబడి తిరిగి సిర్సా జిల్లాగా మార్చబడింది. 1884లో సిర్సా జిల్లా నుండి సిర్సా, దబ్వాలి తాలూకాలు వేరుచేయబడి సిర్సా తాలూకా చేయబడి దానిని హిస్సార్లో భాగంగా చేసారు. 1968లో సిర్సా, దబ్వాలి రెండు తాలూకాలుగా చేయబడ్డాయి. 1975 నవంబర్ 1 న ప్రస్తుత సిర్సా జిల్లా రూపొందించబడింది.

ఆర్ధికం

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సిర్సా జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న హర్యానా రాష్ట్ర 2 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

విభాగాలు

విభాగాల వివరణ

విషయాలువివరణలు
ఉపవిభాగాలుసిర్సా, దబ్వాలి, రణియా, ఎలెనాబాద్.
ఉపవిభాగం7 డెవెలెప్మెంటు బ్లాకులు: బర్గుఢా, దబ్వాలి, ఎలెనాబాద్, నాథుసరి చోప్తా, ఓధన్, రనియా, సిర్సా.
అసెంబ్లీ నియోజక వర్గం5 - కలెంవాలి, దబ్వాలి, రనియా, సిర్సా, ఎలెనాబాద్.
పార్లమెంటు నియోజక వర్గంసిర్సా

2001 లో గణాంకాలు

విషయాలువివరణలు
జిల్లా జనసంఖ్య .1,295,114,[2]
ఇది దాదాపు.మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని.న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో.378వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత.303 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం.15.98%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి.896:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.70.4%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు

రాజస్థానీ ప్రాంతీయ భాష అయిన బగ్రి భాషను జిల్లాలో దాదాపు 2 100 000 మంది మాట్లాడుతుంటారు.[5][6] అంతేకాక హిందీ, పంజాబీ, సరైకి, ఉర్ధూ భాషలు కూడా వాడుకలో ఉన్నాయి.

గ్రామాలు

కింది సిర్సా జిల్లా గ్రామాల జాబితా:

  • ఖైరెకాన్
  • చౌతాలా
  • దర్బ
  • మధోసింఘన.
  • ఖరియన్ (భారతదేశం)
  • జోధ్కన్
  • భవ్దిన్
  • బప్పన్
  • మంగళ
  • మాలిక్పురా
  • మిత్రి
  • తిగ్రి
  • ఒధాన్
  • ఖుయియాన్
  • సావంత్ ఖేరా
  • నథుసరి చొప్తా
  • జలలన
  • చొర్మర్
  • అక్టోబర్
  • పిప్లి
  • మిత్రి
  • లుదెసర్
  • జసనియా
  • మొజుఖెర
  • షాపూర్ బేగు
  • హంజిరా
  • సికందర్పూర్
  • తజియా ఖేరా
  • వైద్వల
  • ఫెర్వియన్
  • పనిహరి
  • రాంపురాలను ధిల్లాన్
  • రూపవాస్
  • బరసరి
  • జమాల్
  • మొచీవాలి (డింగ్)
  • షెర్పురా
  • ఆలీ మొహమ్మద్
  • నెజియా ఖేరా
  • కుకర్బ్ తానా
  • ఖైరె
  • షక్కర్ మండోరి (సహారా నగర్)
  • చదివాల్
  • నెజదెల్ల ఖుర్ద్
  • తెరి బాబా సావన్ సింగ్
  • డర్బి
  • రసూల్పూర్
  • మొరివాలా
  • కోట్లి
  • సుచన్
  • ఖోఖర్
  • నౌరంగ్
  • చత్తా
  • హస్సు
  • మఖ
  • పన్నా
  • మాట్ దడు

వెలుపలి లింకులు

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు