సోమనాథ్

(సోమనాథ లింగము నుండి దారిమార్పు చెందింది)

సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్‌ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్న హిందూ పుణ్య క్షేత్రం. సోమనాధ్ దేవాలయం పాలి మార్కెట్ లో ఉంది. ఇది అతి ప్రాచీనమైంది, పురాణప్రాశస్త్యం కలది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు[1][2][3].

సోమనాథ్ దేవాలయం
સોમનાથ મંદિર
సోమనాథ్ దేవాలయం સોમનાથ મંદિર is located in Gujarat
సోమనాథ్ దేవాలయం સોમનાથ મંદિર
సోమనాథ్ దేవాలయం
સોમનાથ મંદિર
గుజరాత్ రాష్ట్రంలో దేవాలయ స్థానం
భౌగోళికాంశాలు:20°53′16.9″N 70°24′5.0″E / 20.888028°N 70.401389°E / 20.888028; 70.401389
పేరు
స్థానిక పేరు:సోమనాథ్ మందిరం
దేవనాగరి:सोमनाथ मन्दिर
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:గుజరాత్
జిల్లా:గిర్ సోమనాథ్
ప్రదేశం:వెరవల్
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:సోమనాథుడు (శివుడు)
ప్రధాన పండుగలు:మహాశివరాత్రి
నిర్మాణ శైలి:Mandir,చాళుక్యులు
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
1951 (ప్రస్తుత కట్టడము)
నిర్మాత:సర్దార్ వల్లభాయి పటేల్ (ప్రస్తుతమున్న కట్టడం)
దేవాలయ బోర్డు:శ్రీ సోమనాథ ట్రష్టు, గుజరాత్
వెబ్‌సైటు:somnath.org somnath.org]
సోమనాథ్ దేవాలయం

అరేబియా సముద్రతీరాన వెలసిన పుణ్యక్షేత్రం. సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్ళతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది ఈ ఆలయం. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి, ఓం కారంతో అమర్చివుంటుంది. ఈ ఆలయానికున్న చరిత్ర చెప్పనలవికాదు. చారిత్రక ఆధారాలద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్ధానికి చెందినది. ఇది ఒకనాడు శిథిలమైపోగా తిరిగి క్రీస్తు.శ. 649లో అదే శిథిలాల మీద రెండవ ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తరువాత క్రీస్తు. శ. 722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడి, భారతదేశం మీద దృష్టి సారించారు. అప్పటి గవర్నరుగా ఉన్న జునాయద్‌ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలైన మార్వార్‌, బ్రోచ్‌, ఉజ్జయినీ, గుజరాత్‌ మొదలైన వాటిమీద యుద్ధానికి బయలుదేరారు. ఈ విధంగా జరిగిన దాడుల్లో రెండవ సారి నిర్మించిన సోమనాథ దేవాలయం ధ్వంసమయ్యింది.

ఆ తరువాత చాళుక్యుల కాలంలో దీనిని పునర్నిమించారు. వారి ఏలుబడిలో ప్రభాస నగరం మంచి ఓడరేవు కేంద్రంగా భాసిల్లడంతో, కనౌజ్‌ పాలకులైన ప్రతీహారుల కాలంలో ఈ క్షేత్రం కాశీతో సమానంగా విలసిల్లింది. ఆ కాలంలో ఇక్కడ వున్న అపార ధనరాసులే దండయాత్రలకి కారణాలని చెప్పవచ్చు. ఇదే కోవలో మాండలీకుల పాలనలో ఉండగా 6-1-1026న మహమ్మద్‌ ఘజనీ దండెత్తడం జరిగింది. ఈ పోరులో 50 వేలమంది నేలకూలారు. యుద్ధం మొదలైన ఏడు రోజులకి మాండలీకులు ఇక ఘజనీతో నిలబడలేక రాజ్యాన్ని విడిచి పారిపోయారు. ఈ యుద్ధంలో హమీర్‌గోపాల్‌ అనే రాజకుమారుడు శత్రుసేనలతో తలబడి ఎందరినో మట్టికరిపించాడు. ఈ రాజ్యాన్ని రక్షించడంలో తన ప్రాణాలు కోల్పోయాడు. అందుకు చిహ్నంగా ఇక్కడొక వీరశిలని నిర్మించారు. ఈ యుద్ధంలో విజయం సాధించిన ఘజనీ పోమనాథ్‌ ఆలయ గర్భగుడిలో ప్రవేశించి శివలింగాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సాధ్యపడక ఆలయ అర్చకుల్ని హింసించి, ఆలయాన్ని ధ్వంసం చేసి పోయాడు. అ సమయంలో పటాన్‌ ప్రభువైన పరమదేవ్‌, ఈ మూకలపై విరుచుకు పడ్డాడు. ఆతని దాటికి తట్టుకోలేక ఘజనీ సేనలు పారిపోయాయి. ఆ తరువాత 12-13 శతాబ్దంలో తిరిగి ఆలయ నిర్మాణం చేసాడు. ఇది నాల్గవ సారి జరిగిన ఆలయ నిర్మాణం. కాలగమనంలో ఇదికూడా శిథిలావస్థకు చేరుకోగా 1114 సంవత్సరంలో కుమారపాలుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని తన ఏలుబడిలోకి తీసుకుని, ఈ ఆలయాన్నీ, పట్టణాన్నీ పూర్తిగా పునరుద్ధరించాడు. ఆ కాలంలోనే అర్చకులకి వసతి గృహాలు, దేవాలయానికి బంగారు కలశాలు, ముఖమండపంతో శోభిల్లజేసాడు.

ఇక 1296లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ, తన మామని చంపి, రాజ్యవిస్తీర్ణ చేసుకునే నేపథ్యంలో దండయాత్రలు సాగించాడు. దారిపొడవునా ఎంతో బీభత్సాన్ని సృష్టించుకుంటూ సాగాడు. అలా బయలుదేరినవాడు 1299లో సామనాథ్‌ మీద పడి, ఉలుంఖాన్‌ అనే సేనాని శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా బద్దలుకొట్టి, ఆ శకలాల్ని ఖిల్జీకి కానుకగా సమర్పించాడు. ఆ తరువాత 1325-1331 ప్రాంతంలో జునాఘడ్‌ రాజకుమారుడు తిరిగి ఇక్కడ లింగప్రతిష్ఠ చేసాడు. ఆ తరువాతి కాలంలో 1459లో మహమ్మద్‌ బేగ్దా ఇక్కడున్న శివలింగాన్ని తీసివేసి, ఈ మందిరాన్ని మసీదుగా మార్చివేసాడు. ఆ తరువాత అక్భర్‌ పరమతసహనం కలిగివుండటం వల్ల ఇక్కడ ఏ విధమైన గొడవలూ లేకుండా కొంతకాలం ప్రశాంతత నెలకొంది. ఔరంగజేబు కాలంలో 1783లో ఇండోర్‌ మహారాణి అహల్యాభాయి సోమనాథ్‌ మందిరాన్ని పునర్నిర్మించడం జరిగింది. అయితే లింగప్రతిష్ఠ భూగర్భంలో చేసి శత్రువుల బారిన పడకుండా ఉండే ఏర్పాట్లు గావించింది. నాటినుండి తిరిగి కాల ప్రవాహంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ పురాతన క్షేత్రాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 11-5-1951న లింగప్రతిష్ఠ గావించి పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగించారు. ఈ దేవాలయానికి ముందు భాగంలో నవనగర్‌ మహారాణి భర్త దిగ్విజయసింగ్‌ జ్ఞాపకార్థం నిర్మించింది. దీనిని 19-5-1970 సంవత్సరంలో శ్రీ సత్యసాయిబాబా ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు అన్ని వసతులతోటీ, అన్ని దేశాలవారినీ ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక భావతరంగాలను వెదజల్లుతోంది.

ఉచ్చారణ

తెలుగులో ఈ మాటని తరచుగా సోమనాధ్ అని రాస్తూ ఉంటారు. నిజానికి సోమనాథ్ అని ఉండాలి.

చరిత్ర

స్థలపురాణం

స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాధ ఆలయం. ఇక్కడి శివుడు సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. ఆరు మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందు వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశపు మరియొక మంత్రి అయిన కే ఎమ్ మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.

పురాణ కథనం అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తరువాత రావణుడు వెండితోను, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితో పునర్నిర్మించారని చెబుతారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు, తన భార్యలు, అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారణార్ధం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాసతీర్ధము. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలు అందరిని సమానంగా చూసుకొమ్మని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు.

కాల నిర్ణయం

ఈ ఆలయాన్ని ముందుగా నిర్మించిన కాలము సాధారాణ యుగము (చరిత్ర ఆరంభానికి ముందుకాలము). రెండవసారి యాదవ రాజైన వల్లభాయి ముందు నిర్మించిన అదే ప్రదేశంలో ఆలయాన్ని క్రీ పూ 649లో పునర్నిర్మించాడని అంచనా. తరువాత క్రీ శ 725లో సింధూ నగర అరబ్ గవర్నర్ (రాజప్రతినిధి) జనయాద్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి సైన్యాలను పంపాడు. క్రీ శ 815లో గుర్జర ప్రతిహరా రాజైన రెండవ నాగబటా ఈ ఆలయాన్ని మూడవమారు ఎర్ర ఇసుక రాళ్ళతో బృహత్తరంగా నిర్మించాడని ఉహించబడుతుంది[4]. క్రీ. శ 1024 గజనీ మహమ్మద్ ధార్ ఎడారి గుండా ఈ ఆలయానికి చేరుకుని తన దండయాత్రలో భాగంగా మరొకసారి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసాడు[5][6]. ఆలయం తిరిగి గుర్జర్ పరమకు చెందిన మాల్వా రాజైన భోజి, అన్‌హిల్వారాకు చెందిన చోళంకి రాజైన భీమ్‌దేవ్‌ల చేత క్రీ. శ1026, 1042ల మధ్య ఈ ఆలయ పునర్నర్మాణం జరిగింది. కొయ్యతో చేయబడిన నిర్మాణం కుమరపాల్ చేత క్రీ శ 1143-1172 ల మధ్య పునర్నిర్మించబడింది[7][8]. క్రీ శ 1296 ఈ ఆలయం మరొకమారు సుల్తాన్ అల్లాయుద్దీన్ ఖిల్జీ సైన్యాల చేత తిరిగి కూల్చబడింది[5][8]. క్రీ శ 1308లో సౌరాష్ట్రా రాజైన చుదాసమా వంశీయుడైన మహీపాదావ చేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది. క్రీ శ 1326-1351[8] మధ్య ఈ ఆలయములో లింగ ప్రతిష్ఠ జరిగింది. క్రీ శ1375లో ఈ ఆలయం మరొకమారు గుజరాత్ సుల్తాన్ అయిన మొదటి ముజాఫర్ షాహ్ చేత కూల్చబడింది[5][8]. క్రీ శ 1451లో గుజరాత్ సుల్తాన్ అయిన ముహమ్మద్ చేత తిరిగి కూల్చబడింది[9]. క్రీ శ 1701లో ఈ ఆలయం మరొక మారు కూల్చబడింది. క్రీ శ 1701లో ఔరంగజేబు చేత ఈ ఆలయాన్ని మరొకమారు ధ్వంసం చేయబడింది. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన రాళ్ళను ఉపయోగించి ఔరంగజేబు మసీదును నిర్మించాడు. తరువాత సా.శ. 1783లో పూనా పేష్వా, నాగపూరుకు చెందిన ''భోన్స్‌లే, ఖోలాపూరుకు చెందిన చత్రపతి భోన్‌స్లే, ఇండోరుకు చెందిన హోల్కార్ రాణి అహల్యాభాయి గ్వాలియరుకు చెందిన శ్రీమంత్ పతిభువా సమష్టి సహకారంతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది. కూల్చబడి మసీదుగా కట్టబడిన నిర్మాణానికి సమీపంలోనే నిర్మించబడింది.

  • గజనీ మహమ్మద్ ఈ ప్రాంతంపై దాడిచేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆఖరిసారిగా ఔరంగజేబు పాలనలో నేలమట్టమయింది. భారత స్వాతంత్ర్యం తర్వాత 1950 సంవత్సరంలో సర్దార్ వల్లభాయి పటేల్ దీనిని తిరిగి నిర్మింపజేశాడు. ఇక్కడి స్తూపాలు, దేవతా మూర్తులు మొదలైన వాటిని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది.
  • దేవాలయానికి దగ్గరలో వెరావల్ సముద్రతీరం ఉంది. సమీపంలో భల్కా తీర్థం ఉంది. ఇక్కడే శ్రీకృష్ణుడు వేటగాడి బాణం తగిలి అవతారాన్ని చాలించాడని చెబుతారు. సోమనాథ్ లో త్రివేణీ సంగమంగా ప్రసిద్ధిచెందిన హిరణ్, సరస్వతి, కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది.

జకారియా అల్ క్వాజ్విని

1839-40 సుల్తాన్ మహ్ముద్ ఘజనిసమాధి వర్ణచిత్రం

13వ శతాబ్ధపు అరబ్ భూగోళశాస్త్రవేత్త జకారియా అల్ క్వాజ్విని వ్రాసిన వండర్స్ ఆఫ్ తింగ్స్ క్రియేటెడ్ండ్ మార్వెల్స్ ఆఫ్ తింగ్స్ ఎగ్జిస్టెడ్ వ్రాతల సారాంశం కింద ఇవ్వబడింది. ఇది సోమనాధ్ ఆలయ వివరణ, దాని ధ్వంసం గురించి వివరిస్తుంది." సోమనాధ్: భారతీయుల చేత పవిత్రక్షేత్రంగా భావించబడి సముద్రతీరాన ఉపస్థితమైన క్షేత్రం సోమనాధ్. ఈ ఆలయ విచిత్రాలలో ఒకటి చంద్రుడు ఈ ఆలయ లింగాన్ని ప్రతిష్టించడం. ఆలయం మధ్యభాగంలో భూమిలోపల ఎటువంటి ఆధారం లేకుండా ఈ లింగం నిలిచి ఉండడం ఒక ప్రత్యేకత. హిందువుల చేత అధికంగా కొనియాడబడుతున్న ఈ ఆలయ ప్రధానదైవమఇన పరమశివుడు భూమికి పైభాగంలో గాలిలో తేలినట్లుండి ఈ లింగరూపంలో నిలిచి ఉండడం ఒకవేళ ముసల్మాన్ కాని నాస్థికుడు కాని ఎవరికైనా ఒక వర్ణించ లేని అద్భుతం. చంద్రగ్రహణ కాలంలో లక్షకంటే అధికులైన హిందువులు ఇక్కడకి పవిత్రయాత్రార్ధం రావడం ఆనవాయితీ.

" ఎప్పుడైతే సుల్తాన్ యామిను డి దౌలా మహ్ముద్ సుబుక్తిజిన్ భారతదేశం మీద మతపరమైన దండయాత్రచేసాడో ఆయన సోమనాధ్‌ను స్వాధీనపరచుకొని ధ్వంసం చేయడానికి గొప్ప ప్రయత్నం చేసాడు. అందువలన హిందువులు ముహమ్మదీయులుగా మారతారని విశ్వసించబడింది. ఫలితంగా వేల మంది హిందువులు బలవంతంగా ఇస్లామ్ మతానికి మార్చబడ్డారు. ఆయన అక్కడికి 416 ఎ హెచ్ (ఎ డి 1025 డిసెంబరు) " రాజు ఈ లింగరూపాన్ని చూసి విస్మయం చెందాడు. తరువాత ఇక్కడి నిధులను మళ్ళించడానికి పడగొట్టడానికి అదేశాలు జారీచేసాడు. అక్కడ గొప్ప ప్రముఖల చేత ఆలయానికి దానంగా ఇవ్వబడిన అనేక స్వర్ణ , రజత విగ్రహాలు, ఆభరణాలతో నిండిన పాత్రలు కనుగొనబడ్డాయి. ఆలయంలో కనుగొనబడిన వస్తువుల విలువ 20 వేల దినార్లకు పైబడి ఉంది "

స్వాతంత్రం అనంతరం ఆలయ పునర్నిర్మాణం

1960లో సోమనాథ్ జ్యోతిర్లింగం

స్వాతంత్ర్యం రాక ముందు జునాగఢ్ రాజ సంస్థానం ప్రభాస్ పటాన్ అధీనంలో ఉంది. సమైక్య భారతదేశంలో జునాగఢ్ విలీనం అయిన తరువాత అప్పటి ఉపప్రధాని అయిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ 1947 నవంబరు 12న భారతీయ సైన్యాలను క్రమపరిచే నిమిత్తం ఇక్కడకు వచ్చి అదే సమయంలో ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశాలను జారీ చేసాడు. ఎప్పుడైతే సర్ధార్ పటేలు, కే ఎమ్ మున్షి, ఇతర నాయకులతో గాంధీని దర్శించి ఈ ప్రస్తావన తీసుకు వచ్చినప్పుడు గాంధీ ఆ ప్రస్తావనకు ఆనందంతో అంగీకరించి ఆలయ పునరుద్ధరణకు కావలసిన నిధులను ప్రభుత్వము నుండి మంజూరు చేయకుండా ప్రజల నుండి చందాలను గ్రహించి చేయవలసినదిగా సలహా ఇచ్చాడు. అయినా త్వరలోనే పటేల్, గాంధీ మరణించారు. ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలను కే ఎమ్ మున్షీ నిర్వహణలో జరిగింది. కే ఎమ్ మున్షి అప్పుడు నెహ్రూ ప్రభుత్వంలో ఫుడ్ అండ్ సివిల్ సప్లై మంత్రిగా పనిచేస్తున్నాడు. 1950 అక్టోబరు మాసంలో శిథిలాలు తొలగించబడి ప్రస్తుత మసీదు కొన్ని మైళ్ళ దూరానికి తీసుకు పోబడింది. 1951లో భారతప్రభుత్వ ప్రథమ రాష్ట్రపతి అయిన రాజేంద్రప్రసాదు ఆలయ కుంభాభిషేకానికి కే ఎమ్ మున్షి చేత అహ్వానించబడ్డాడు. ఆయన తన ప్రసంగంలో " నా దృష్టిలో ఈ పునాదుల నుండి అద్భుతమైన ఈ బృహత్తర ఆలయం పునర్నిర్మించబడడమే కాక పురాతన సోమనాధ ఆలయ పునరుద్ధణ వలన భారతీయ శిల్పకళావైభవానికి ఈ ఆలయం ఒక తార్కాణంగా నిలిచింది. అయన సన ప్రసంగం పొడిగిస్తూ " పునర్నిర్మించే శక్తి యొక్క గొప్పతనం పడగొట్టే శక్తికంటే ఘనమైనది అనడానికి సోమనాధ ఆలయ పునర్నిర్మణం ఒక ఉదాహరణ " అని ఉద్ఘాటించాడు. ఈ పూర్తి సంఘటన అప్పటి ప్రధాన మంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రపతుల మధ్య పెద్ద అఘాతాన్ని సృష్టించింది. జవహర్లా నెహ్రు దీనిని హిందువుల ప్రతి ఘటనగా భావించగా రాష్ట్రపతి రాజేంద్రప్రసాదు , కె ఎమ్ మున్షీ ఈ ఆలయ పునరుద్ధరణ స్వాతంత్ర ఫలంగా , తమకు జరిగిన అన్యాయానికి హిందువుల ప్రతిస్పందనగా భావించబడినది. రాజేంద్రప్రసాదు , కె ఎమ్ మున్షీల చేత పునరుద్దరించబడి దేశానికి సమర్పించిన ఈ సోమనాధ ఆలయం ఇప్పుడు సోమనాధ ఆలయ ట్రస్ట్ చేత నిర్వహించబడుతుంది.

నిర్మాణ శైలి

బాణ స్తంభం (యారో పిల్లర్)

కైలాస మహామేరు ప్రసాదం గా పిలవబడే నేటి ఆలయ కట్టడం చాళుక్యులనాటి ఆలయ నిర్మాణ శైలిని లేక కైలాష్ మహామేరు ప్రసాద్ శైలి ప్రతిబింబిస్తుంది. 1951లో ఈ నూతన ఆలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపనగావించిన నాటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ "సృష్టించే శక్తి నాశనం చేసే శక్తి కన్నా గొప్పది అనడానికి సోమనాథ్ ఆలయం ప్రతీక" అని అన్నారు. ఈ ఆలయం గుజరాత్ శిల్పాచార్యుల సోమపుర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం నిర్మించిన స్థలానికీ, ఎక్కడో దక్షిణాన ఉన్న అంటార్కిటిక్ ఖండానికీ మధ్య భూభాగమన్నదే లేదు. ఈ విశేషాన్ని సంస్కృత భాషలో తెలియచేస్తున్న ఒక శాసనం అక్కడి బాణ స్తంభం (యారో పిల్లర్) మీద చెక్కబడియున్నది. వెయ్యి సంవత్సరాల పైబడినదిగా భావిస్తున్న ఈ బాణ స్తంభం అక్కడి సముద్రతీరాన ఉన్న రక్షణకుడ్యము పై నిర్మింపబడింది. ఈ బాణ స్తంభం ఉత్తర దక్షిణ ధ్రువాల కేంద్ర బిందువుగా భావించబడుతుంది.

ప్రొక్లెమేషన్ ఆఫ్ గేట్స్

1782-1783ల మధ్య శ్రీనాధ్ మహదాజీ షిండే (ఉజ్జయిని, గ్వాలియర్, మధుర పాలకుడు) లాహోరు పాలకుడైన ముహమ్మద్ షాహ్‌ను ఓడించిన తరువాత విజయోత్సాహంతో లాహోరు నుండి మూడు వెండి ద్వారాలను తీసుకువచ్చాడు. గుజరాత్ పండితులు ఆ చర్యను నిరాకరించడంతో పాలకుడైన గైక్వాడ్ వాటిని సోమనాధ ఆలయంలో పెట్టించాడు. ఈ ద్వారాలు ప్రస్తుతం ఉజ్జయిని ఆలయాలలో ద్వారములుగా నిలబడి ఉన్నాయి. ప్రస్తుతం వాటిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ మందిరం, గోపాల్ మందిరంలలో చూడ వచ్చు. 1842లో 1 ఎర్ల్ ఆఫ్ ఎడిన్బర్గ్ కు చెందిన ఎడిన్బర్గ్ ప్రసిద్ధిచెందిన ప్రొక్లెమేషన్ ఆఫ్ గేట్స్ పేరుతో చేసిన ప్రకటనలో ఆఫ్ఘనిస్తాన్ లోని గజనీలో ఉన్న గజనీ మహ్ముద్ సమాధిలో ఉన్న ఈ ద్వారాలను గజనీ నుండి తీసుకు వచ్చి భారతప్రభుత్వానికి అందించమని ఆదేశాలను జారీచేసాడు. వీటిని గజనీ మహ్ముద్ సోమనాధ్ ఆలయం నుండి తీసుకు వెళ్ళబడినట్లు విశ్వసించబడింది. సోమనాథ ఆలయ ఈ ద్వారాల గురించిన చర్చ 1843లో లండన్లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య జరిగిన చెలరేగిన చర్చల మంటల తరువాత ఈ ద్వారాలు వెలికి తీసి విజయవంతంగా వెనుకకు తీసుకురాబడ్డాయి. కాని వచ్చిన తరువాత అవి అసలైన ద్వారాలకు ఖచ్ఛితమైన నమూనాలని తెలుసుకున్నారు. అవి ప్రస్తుతం ఆగ్రా స్టోర్ రూమ్ లో ఇంకా అలా పడి ఉన్నాయి.

సోమనాథుడు

ద్వాదశ జ్యోతిర్లింగాలలోని శివనామములలో ఒక పేరు సోమనాథుడు. సోమనాథుడు ఉన్న ఆలయాన్ని సోమనాథ్ దేవాలయం అంటారు. ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్‌లో ఉన్న సోమనాథ్ లో ఉంది. సోమనాథ్ ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రముగా విరాజిల్లుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు.

ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే భక్తులు ఇక్కడి నుంచే తమ యాత్రను ప్రారంభిస్తారు. ఈ క్షేత్రంపై పదహారుసార్లు దాడులు జరిగాయి, అయినా అన్నిసార్లూ పునర్నిర్మాణం జరిగింది. ఈ పుణ్యక్షేత్రం శివభక్తులకు మాత్రమే కాక విష్ణుభక్తులకు సందర్శనీయ క్షేత్రమే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడే తన అవతరాన్ని చాలించినట్లు ప్రతీతి.

స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. శాపవశాత్తు తేజస్సు కోల్పోయిన చంద్రుడు ఇక్కడి సరస్వతీ నదిలో స్నానమాచరించి, తిరిగి తేజస్సును పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాధ ఆలయం. ఇక్కడి శివుడు సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. అనేక మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందు వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశపు మరియొక మంత్రి అయిన కే ఎమ్ మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.

బంగూర్ మ్యూజియం

బంగూర్ మ్యూజియం పాత బస్ స్టాండ్ లో ఉంది. ఈ మ్యూజియం అరుదైన చారిత్రక వస్తువులు, నాణేలు, ఆయుధాలు ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియానికి స్ధానికంగా పేరొందిన బంగూర్ జువార్ అనే నేత పేరు పెట్టారు.

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు