69వ భారత జాతీయ చలనచిత్ర అవార్డులు

2021 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో ప్రతిష్ఠాత్మకగా భావించే సినిమా అవార్డులు. ఇవి భారత ప్రభుత్వంచే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి రాష్ట్రపతి చేతులమీదగా గ్రహీతలకు అందజేయబడతాయి.[1] ముందటి సంవత్సరము దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూరీ పరిశీలించి ముఖ్య విభాగాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అంతేకాకుండా వివిధ భాషలలోని ఉత్తమమైన చిత్రాలను కూడా ఎంపిక చేస్తారు.

69వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
Awarded for2021 ఉత్తమ చలనచిత్రాలు
Awarded byచలనచిత్రోత్సవ డైరెక్టరేట్
Presented byద్రౌపది ముర్ము (భారత రాష్ట్రపతి)
Announced on2023 ఆగస్టు 24
Presented on2023 అక్టోబరు 17
Official websitedff.nic.in
Highlights
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రంరాకెట్రి
Best Non-feature Filmఏక్ థా గావ్
Best Bookలక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం: ది ఇన్‌క్రెడిబ్లీ మెలోడియస్ జర్నీ
Best Criticఎం. పురుషోత్తమాచార్యులు
Lifetime achievementవహీదా రెహమాన్
ఎక్కువ పురస్కారాలుఆర్ఆర్ఆర్ (6)

69వ జాతీయ చలనచిత్ర అవార్డులకు 2021లో విడుదలైన 281 ఫీచర్ ఫిల్మ్ లు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డుల కోసం పోటీపడగా 2023 ఆగస్టు 24న సాయంత్రం 4:00 గంటలకు ఫలితాలు ప్రకటించబడ్డాయి.[2] 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్మ్స్ కు, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు వచ్చాయి. హిందీ నుంచి 'గంగూబాయి కాఠియావాడి, తెలుగు నుంచి 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' సినిమాలకు అత్యధిక కేటగిరిల్లో అవార్డులు వచ్చాయి.[3]

69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘పుష్ప ది రైజ్’ సినిమాలో నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్, తెలుగు సినిమారంగం నుండి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తొలి హీరోగా నిలిచాడు.[4]

2023 అక్టోబరు 17న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతతోపాటు విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా బహుమతులు అందజేయబడ్డాయి.[5][6]

ఎంపిక విధానం

చలన చిత్రోత్సవ డైరెక్టరేట్ 2023 మార్చి 31న ఆన్‌లైన్ ఎంట్రీలను ఆహ్వానించింది. 2023 మే 10 వరకు ఎంట్రీలను స్వీకరించింది. 2021 జనవరి 1 నుండి 2021 డిసెంబరు 31 మధ్యకాలంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వారు సర్టిఫై చేసిన ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్స్ ఈ 69వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలకు అర్హత సాధించాయి. అలాగే భారతీయ వార్తాపత్రికలు, పత్రికలు, పత్రికలలో ప్రచురించబడిన సినిమాపై పుస్తకాలు, విమర్శనాత్మక అధ్యయనాలు, సమీక్షలు లేదా కథనాలు సినిమా విభాగంలో ఉత్తమ రచన పురస్కారానికి అర్హులు.

ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల విభాగాల కోసం, ఏదైనా భారతీయ భాషలోని సినిమాలు, 16 ఎంఎం, 35 ఎంఎం, ఫిల్మ్ గేజ్ లేదా డిజిటల్ ఫార్మాట్‌లో చిత్రీకరించబడి, సినిమాల్లో, డిజిటల్ ఫార్మాట్‌లలో విడుదల చేయడానికి అర్హత పొంది ఉండాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సినిమాలు ఫీచర్ ఫిల్మ్, ఫీచర్ లేదా డాక్యుమెంటరీ/న్యూస్‌రీల్/నాన్ ఫిక్షన్ సర్టిఫికేట్ పొందాలి.[7]

జ్యూరీ సభ్యులు

అవార్డుల ఎంపికకు నియమించబడిన జ్యూరీ సభ్యులలు

  • సెంట్రల్ ప్యానెల్: ఛైర్‌పర్సన్- కేతన్ మెహతా, సభ్యులు- సబ్యసాచి మహపాత్ర, వి.ఎన్. ఆదిత్య, పరేష్ వోరా, మానస్ చౌదరి, మలయ్ రే, జి. సురేష్ కుమార్, సునీల్ కుమార్ దేశాయ్, శ్రీమతి పాపియా అధికారి, ముత్తు గణేష్, శంతను గణేష్ రోడ్
  • నార్త్ ప్యానెల్: ఛైర్‌పర్సన్- వి.ఎన్. ఆదిత్య, సభ్యులు: ఆర్.వి. రమణి, ఆనంద్ కుమార్ సింగ్, ముర్తాజా అలీ ఖాన్, శివం ఛబ్రా
  • ఈస్ట్ ప్యానెల్: ఛైర్‌పర్సన్- పరేష్ వోరా, సభ్యులు: శ్రీమతి రూనా ఆశిష్, శ్రీమతి జయశ్రీ భట్టాచార్య, శ్రీమతి బాబీ శర్మ బారుహ్, శిలాదిత్య మౌలిక్
  • వెస్ట్ ప్యానెల్: ఛైర్‌పర్సన్- శ్రీమతి మలయ్ రే, సభ్యులు: మందర్ తలౌలికర్, శ్రీమతి ఒలివియా దాస్, ప్రితేష్ సోధా, భౌరావ్ కర్హాడే
  • సౌత్ I ప్యానెల్: ఛైర్‌పర్సన్- సబ్యసాచి మహపాత్ర, సభ్యులు: సుకుమార్ జటానియా, శ్రీమతి జి కలా, శ్రీమతి గీతా గురప్ప, సజిన్ బాబు
  • సౌత్ II ప్యానెల్: ఛైర్‌పర్సన్- మానస్ చౌదరి, సభ్యులు: ఎం.ఎన్. స్వామి, శ్రీమతి బలబధ్రపాత్రుని రమణి, శ్రీమతి ఎం.ఎం. శ్రీలేఖ, సూర్యపాల్ సింగ్

బెస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్

రాష్ట్ర ప్రభుత్వ విధానం ద్వారా సినిమాని ఒక కళారూపంగా అధ్యయనం చేయడం, ప్రశంసించడం, సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఈ కళారూపానికి విమర్శనాత్మక ప్రశంసలను ప్రోత్సహించడం వంటి అంశాలలో ఈ అవార్డు అందించబడుతోంది.

బెస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్:

అవార్డులు

ఫీచర్‌ ఫిల్మ్స్

నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్

  • ఉత్తమ వాయిస్‌ ఓవర్‌: కులద కుమార్ భట్టాచార్జీ (హతిబొందు)
  • ఉత్తమ సంగీతం: ఇషాన్ దివేచా (సక్సేలెంట్)
  • ఉత్తమ కూర్పు: అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమోరీ సర్వ్స్ మీ రైట్)
  • ఉత్తమ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌: సురిచి శర్మ (మీన్ రాగ్)
  • ఉత్తమ ఆడియోగ్రఫీ (ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: బిట్టు రావత్ (పటాల్ - టీ)
  • ఉత్తమ దర్శకత్వం: బకుల్ మతియాని (స్మైల్ ప్టీజ్)
  • ఉత్తమ కుటుంబ కథా చిత్రం: చాంద్ సాన్సే
  • ఉత్తమ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిల్మ్: దాల్ భట్
  • స్పెషల్‌ జ్యూరీ అవార్డు: రేఖ
  • ఉత్తమ యానిమేషన్ చిత్రం: కందిత్తుండు
  • ఉత్తమ ఇన్వెస్టిగేటివ్‌ ఫిల్మ్: లుకింగ్ ఫర్ చలాన్
  • ఉత్తమ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిల్మ్: ఆయుష్మాన్
  • ఉత్తమ ఎడ్యుకేషనల్‌ ఫిల్మ్: సిర్పిగాలిన్ సిర్పంగల్
  • ఉత్తమ సామాజిక చిత్రం: 1. మిథు డి, 2. త్రీ టూ వన్
  • ఉత్తమ పర్యావరణ చిత్రం: మున్నం వలవు
  • ఉత్తమ ప్రమోషనల్‌ ఫిల్మ్: అంతరించిపోతున్న వారసత్వ సంపద 'వార్లీ ఆర్ట్'
  • ఉత్తమ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫిల్మ్: ఎథోస్ ఆఫ్ డార్క్నెస్
  • ఉత్తమ కళా, సాంస్కృతిక చిత్రం: టి.ఎన్. కృష్ణన్ బో స్ట్రింగ్స్ టు డివైన్
  • ఉత్తమ జీవితకథాచిత్రం: 1. రుఖు మతీర్ దుఖు మాఝీ, 2. బియాండ్ బ్లాస్ట్
  • ఉత్తమ ఎత్నోగ్రాఫిక్‌ ఫిల్మ్: ఫైర్ ఆన్ ఎడ్జ్
  • ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: అంకిత్ కొఠారి (పంచిక)
  • ఉత్తమ చిత్రం: ఏక్ థా గావ్
  • ప్రత్యేక మెన్షన్: అనిరుద్ధ జట్కర్ (బాలే బంగార), శ్రీకాంత్ దేవ (కరువారై), శ్వేతా కుమార్ దాస్ (ది హీలింగ్ టచ్), రామ్ కమల్ ముఖర్జీ (ఏక్ దువా)

నామినేషన్లు

69వ భారత జాతీయ చలనచిత్ర అవార్డుల కోసం వివిధ విభాగాల్లో నామినేషన్లు వచ్చాయి.[8]

ఉత్తమ నటుడు

  1. అల్లు అర్జున్ (తెలుగు): పుష్ప - ది రైజ్
  2. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ (తెలుగు) -- ఆర్ఆర్ఆర్
  3. సూర్య (తమిళం) -- జై భీమ్
  4. ధనుష్ (తమిళం) -- కర్ణన్
  5. శింబు (తమిళం) -- మానాడు
  6. ఆర్య (తమిళం) -- సర్పట్ట పరంబర్తె
  7. జోజు జార్జి (మలయాళం) -- నయట్టు

ఉత్తమ నటి

  1. అలియా భట్ (హిందీ) -- గంగూభాయ్ కథియావాడి
  2. కంగనా రనౌత్ (తమిళం) -- తలైవి

అత్యధిక అవార్డులు

  1. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ఆర్ఆర్ఆర్
  2. ఉత్తమ నృత్యదర్శకుడు: ప్రేమ్ రక్షిత్
  3. ఉత్తమ గాయకుడు: కాల భైరవ
  4. ఉత్తమ నేపథ్య సంగీతం: కీరవాణి
  5. ఉత్తమ యాక్షన్ డైరెక్టర్: కింగ్ సోలోమన్
  6. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్

మూలాలు

బాహ్య లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ