ఉదగమండలం

తమిళనాడు లో ఒక నగరం
(Ooty నుండి దారిమార్పు చెందింది)

ఉదకమండలం (ఊటీ) (ooty) తమిళనాడు రాష్ట్రం, నీలగిరి జిల్లా, నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ధి గాంచిన పర్యాటక కేంద్రం, పట్టణం. ఇది నీలగిరి జిల్లాకు పరిపాలనా ప్రధాన పట్టణం. ఉదగమండలం అనేది దీని అధికారిక నామం. వాతావరణం చల్లగా ఉన్నందున, వేసవికాలం మంచి విడిది కేంద్రంగా ఇది ప్రసిద్ధి గాంచింది. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు కొద్దికాలం విశ్రాంతి కోసం, నీలగిరి కొండలపై ముఖ్యమైన ప్రదేశాలు దర్శించటానికి వస్తుంటారు.

ఊటీ
ఊటాకముండ్
హిల్ స్టేషన్, నగరం
ఉదకమండలం
కూనూర్ రోడ్ వైపు వెళ్ళే దారిలో ఉన్న జెం పార్క్ నుంచి దృశ్యం.
కూనూర్ రోడ్ వైపు వెళ్ళే దారిలో ఉన్న జెం పార్క్ నుంచి దృశ్యం.
ఊటీ is located in Tamil Nadu
ఊటీ
ఊటీ
Coordinates: 11°25′N 76°42′E / 11.41°N 76.70°E / 11.41; 76.70
Country India
Stateతమిళనాడు
DistrictNilgiris District
Government
 • TypeSpecial Grade Municipality
 • Bodyఉదకమండలం మునిసిపాలిటీ
Area
 • Total36 km2 (14 sq mi)
Elevation2,240 మీ (7,350 అ.)
Population
 (2011)
 • Total88,430
 • Density2,500/km2 (6,400/sq mi)
Demonym(s)Ootian, Ootacamandian, Udhaghai
Languages
 • Officialతమిళం
Time zoneUTC+05:30 (IST)
PIN
643001
Tele91423
Vehicle registrationTN-43
Civic agency ooty homesUdhagamandalam Municipality
ClimateSubtropical Highland (Köppen)
Precipitation1,238 mm (49 in)
Avg. annual temperature14.4 °C (58 °F)
Temperature from Batchmates.com[2]

చరిత్ర

ప్రాచీన కాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. తరువాత గంగ వంశ రాజుల ఆధీనంలోకి మారాయి. తరువాత 12వ శతాబ్దంలో హోయసాల వంశ రాజైన విష్ణువర్థనుడి స్వాధీనంలో ఉన్నాయి. చివరకు టిప్పు సుల్తాన్ అధీనంలోకి వచ్చి, 18వ శతాబ్దంలో ఆంగ్లేయులకు అప్పగించబడ్డాయి.

పక్కనే ఉన్న కోయంబత్తూర్ ప్రావిన్సుకు గవర్నరుగా ఉన్న జాన్ సుల్లివాన్ ఊటీ చల్లటి వాతావరణం, అడవులను చూసి ముచ్చటపడి, అక్కడ నివసిస్తున్న కోయజాతి తెగలకు అతి తక్కువ పైకాన్ని చెల్లించి చాలా స్థలాన్ని కొన్నాడు.

నెమ్మదిగా ఈ స్థలాలు ప్రైవేటు ఆంగ్లేయ వ్యక్తుల పరం కావడంతో త్వరత్వరగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. మద్రాసు సంస్థానానికి వేసవి రాజధానిగా మారింది. మద్రాసు సంస్థానం సహకారంతో ఇక్కడ ప్రముఖ ఆంగ్లేయులు కొండల మధ్య మెలికలు తిరిగే రహదారులు, సంక్లిష్టమైన రైలు మార్గాల్ని నిర్మించారు. ఈ పట్టణం సముద్ర మట్టం నుంచి 2,240 మీటర్ల ఎత్తులో ఉండటంతో ప్రముఖ వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది.[3] దీని ప్రాకృతిక సౌందర్యం, ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు మొదలైన వాటికి ముగ్ధులైన ఆంగ్లేయులు దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకునే వారు.

వాతావరణం

కొప్పెన్ వాతావరణ వర్గీకరణ ప్రకారం ఊటీ వాతావరణం ఒక ఉప ఉష్ణమండల పర్వత వాతావరణం. ఉష్ణవాతావరణంలో నగరం ఉన్నప్పటికీ దక్షిణభారతదేశం యొక్క అత్యంత విరుద్ధంగా ఊటీ వాతావరణం సాధారణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా, చల్లగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలల రాత్రుల్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. సాధారణంగా వసంతకాలంలో అక్కడి వాతావరణం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏడాది పొడవునా ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి. సగటు అత్యల్ప ఉష్ణోగ్రత సుమారు 5–12 °C (41–54 °F), సగటు అధిక ఉష్ణోగ్రత సుమారు 17–20 °C (63–68 °F) నమోదవుతాయి. దక్షిణ ఆసియా ప్రమాణాల ప్రకారం 25 °C (77 °F) ఉష్ణోగ్రత అక్కడ నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రత.ఊటీలో వర్షాకాలం సాధారణంగా చాలా చల్లగా అధిక తేమగల గాలులతో కూడి ఉంటుంది.ఏడాది పొడవునా గాలులు అధికంగా వీస్తుంటాయి. −2 °C (28 °F) అక్కడ నమోదయిన అత్యల్ప ఉష్ణోగ్రత. నగరం డిసెంబరు నుంచి మార్చి వరకు పొడివాతావరణంతో 1250మి.మీటర్ల అవపాతంతో చవిచూస్తుంది.

జనవాసాలు

2011 జనాభాలెక్కల ప్రకారం ఉదకమండలం జనాభా 88,340 మంది.అక్కడి లింగనిష్పత్తి సగటు ప్రతి 1000 మంది పురుషుల కోసం 1023 ఆడవారు ఉన్నారు. కానీ జాతీయ నిష్పత్తిని చూస్తే ప్రతి 1000 మంది పురుషుల కోసం 929 ఆడవారు మాత్రమే ఉన్నారు.మొత్తం జనాభాలో 7,781 మంది అరు సంవత్సారాల వయస్సు లోపు గలవారు.అందులో 3,915 మంది మొగవాళ్లు.మొత్తం జనాభాలో 28.98% శాతం మంది షెడ్యూల్ కులాలవారు, 3% మంది షెడ్యూల్ తెగలవారు ఉన్నారు.నగరం సగటు అక్షరాస్యత జాతీయ సగటు అక్షరాస్యత కంటే ఎక్కువ.నగరం సగటు అక్షరాస్యత 82.15% శాతం అయితే జాతీయ అక్షరాస్యత వచ్చి 72.99% శాతం.నగరంలో మొత్తం 23,235 గృహాలున్నాయి.మొత్తం 35,981 మంది కార్మికులు నివసిస్తున్నారు.అందులో 636 మంది రైతులు,5194 వ్యవసాయకూలీలు,292మంది గృహపరిశ్రమల్లో పనిచెసేవారు, ఇతర కార్మికులు 26,411 మంది, ఉపాంత రైతులు 65మంది,828మంది ఉపాంత వ్యవసాయ కూలీలు, గృహపరిశ్రమల్లో పనిచెసే ఉపాంత కార్మికులు 56మంది, 2,499 మంది ఇతర ఉపాంత కార్మికులు ఉన్నారు. అక్కడి సంధానభాష తమిళం.నీలగిరి స్థానిక భాషలైన బడగ, పానీయ భాషల్లో కూడా తెగలు మాట్లాడుతారు.అక్కడి స్థానికులు పొరుగు రాష్టాల సామీప్యత, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ఉండటం వల్ల ఆంగ్లం, కన్నడ, మలయాళం భాషల్లో కొద్దివరకు మాట్లాడటం, అర్థం చేసుకోవడం చేస్తున్నారు.

రాజకీయాలు

ఊటీ నీలగిరి జిల్లాకు ప్రధాన కేంద్రం. ఉదకమండలం శాసనసభ నియోజకవర్గం, నీలగిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

ఆర్థికవ్యవస్థ

ఊటిలో ఆర్థిక రంగం ఎక్కువగా పర్యాటక రంగంపై ఆధారపడివుంది. వ్యవసాయం పై ఆధారపడివున్న పరిసర ప్రాంతాలకు ఊటీ ఒక సరఫరా మార్కెట్. ఊటీలో కూరగాయలు, పండ్లు పండిస్తారు. కూరగాయల్లో ప్రధానంగా క్యారెట్, బంగాళదుంప, క్యాబేజీ, కాలీఫ్లవర్, పండ్లల్లో ప్రధానంగా పీచస్, రేగు, బేరి, స్ట్రాబెర్రీ పండిస్తారు. ఊటీ మున్సిపల్ మార్కెట్ వద్ద రోజూ జరిగే ఉత్పత్తుల వేలంపాట భారతదేశంలోనే అతిపెద్ద రిటైల్ మార్కెట్లలో ఒకటి. చాలా కాలం నుంచి ఇక్కడ పాడి పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందింది. పాల ఉత్పత్తుల సహకార సంఘం ఆద్వర్యంలో పాడి పరిశ్రమ కొనసాగుతోంది. అందులో మీగడ తీసిన పాల పౌడరు, జున్ను తయారీ చేస్తారు. స్థానిక వ్యవసాయ పరిశ్రమ యొక్క ఫలితంగా కొన్ని పరిశోధనా కేంద్రాలు అక్కడ నెలకొన్నాయి. ఆ సంస్థల్లో మట్టి పరిరక్షణా కేంద్రం, పాడి పశువుల పెంపకం, బంగాళాదుంప పరిశోధనా కేంద్రాలకు సంబంధించి ఉన్నాయి. ఫ్లోరీ కల్చర్, సెరీ కల్చర్ విధానాలతో స్థానిక పంటల పరిధిని విస్తరించాలని, పుట్ట్టగొడుగుల పెంపకం పై ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హిందుస్థాన్ ఫోటో ఫిలింస్ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. ఇది నగరం శివార్లలో హిందూనగర్ వద్ద ఉంది. రాబీస్ టీకాలను తయారుచేసే హ్యూమన్ బయోలాజికల్స్ సంస్థ ఊటీ సమీపంలో ఉన్న పుడుమండులో ఉంది. ఇతర తయారీ పరిశ్రమలు ఊటీ శివార్లలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి కెట్టీ (సూదల తయారీ సంస్థ, అరువంకాడు (కార్డైట్ తయారీ సంస్థ, కూనూర్ (రాబీస్ టీకా తయారీ సంస్థ). చాక్లెట్, ఊరగాయ తయారీ, వడ్రంగి కుటీర పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ తయారుచేసే చాక్లెట్లు పర్యాటకులకు, స్థానికులకు ప్రసిద్ధి చెందాయి. ఆ ప్రాంతం టీ సాగుకు పేరు మోసినా ఊటీలో టీ సాగు, దాని సంవిధానం చేయరు. టీ మరింత ఆర్థికంగా కొద్దిగా తక్కువ ఎత్తులో సాగుచేస్తారు. కూనూర్, కోటగిరి టీ సాగు, సంవిధానం యొక్క స్థానిక కేంద్రాలు.

ఆసక్తికర ప్రదేశాలు

ఊటీ పట్టణం, చుట్టుపక్కల అనేక ఆసక్తికరమైన ప్రదేశాలు కలిగిన ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.

ఉద్యానవనాలు

ఊటీలోని బొటానికల్ గార్డెన్: ఇది ప్రభుత్వ బొటానికల్ గార్డెన్ (గతంలో సెంటెనరీ రోజ్ పార్క్)[4][5] భారతదేశంలో అతిపెద్ద గులాబీ తోట.[6] ఇది ఊటీ పట్టణంలోని విజయనగరంలో ఎల్క్ కొండ వాలుపై ఉంది.[7] ఇది 2,200 మీటర్ల (7,200 అ) ఎత్తులో నేడు ఈ తోట దేశంలోనే అతిపెద్ద గులాబీల సేకరణలో ఒకటిగా ఉంది, 20,000 కంటే ఎక్కువ రకాలైన 2,800 రకాల గులాబీలు ఉన్నాయి.[8] హైబ్రిడ్ టీ గులాబీలు, మినియేచర్ గులాబీలు, పాలియాంతస్, పాపగెనా, ఫ్లోరిబండ, రాంబ్లర్స్, యాకిమర్, నలుపు, ఆకుపచ్చ వంటి అసాధారణ రంగుల గులాబీలు ఉన్నాయి.

ఇది ఊటీలో 8.9-హెక్టార్ల (22-ఎకరాలు) విస్తీర్ణంలో 1847లో నిర్మితమైంది.[9] దీనిని తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రతి మేలో అరుదైన వృక్ష జాతుల ప్రదర్శనతో పాటు పూల ప్రత్వేక ప్రదర్శన నిర్వహిస్తారు. ఉద్యానవనంలో దేశ, విదేశాలకు చెందిన అన్ని రకాలైన సుమారు వెయ్యి రకాల జాతుల మొక్కలు ఉన్నాయి. మొక్కలు, పొదలు, చెట్లు, మూలికా, బోన్సాయ్ మొక్కలు ఉన్నాయి.[10] ఈ తోటలో 20-మిలియన్ సంవత్సరాల పురాతనమైన శిలాజ చెట్టు ఉంది.[11][12]

జింకల పార్కు: జింకల పార్క్ ఊటీ సరస్సు అంచున ఉంది. ఇది ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లోని జంతుప్రదర్శనశాలను పక్కన పెడితే భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న జూ పార్కు. ఈ ఉద్యానవనం అనేక రకాల జింకలు, ఇతర జంతువులను ఉంచడానికి ఏర్పాటు చేయబడింది.[13]

ఊటీ సరస్సు: ఊటీ సరస్సు 26 హెక్టార్ల (65 ఎకరాలు) విస్తీర్ణంలో ఉంది.[14] సరస్సు పక్కన ఏర్పాటు చేసిన బోట్ హౌస్, పర్యాటకులకు బోటింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది, ఇది ఊటీలో ప్రధాన పర్యాటక ఆకర్షణ. దీనిని ఊటీ మొదటి కలెక్టర్ జాన్ సుల్లివన్ 1824లో నిర్మించారు. ఊటీ లోయలో ప్రవహించే పర్వత ప్రవాహాలకు ఆనకట్ట వేయడం ద్వారా ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు యూకలిప్టస్ చెట్ల తోటల మధ్య ఒక ఒడ్డున రైలు మార్గాన్ని కలిగి ఉంది. మేలో వేసవి కాలంలో, సరస్సు వద్ద రెండు రోజుల పాటు పడవ పోటీలు నిర్వహిస్తారు.[15][16]

పైకారా సరస్సు

పైకారా సరస్సు ఊటీ నుండి 19 కిమీ (12 మైళ్ళు) దూరంలో ఉన్న నది.[17] పైకారా నది ముకుర్తి శిఖరం వద్ద పుడుతుంది.ఇది కొండ ప్రాంతం గుండా వెళుతుంది. సాధారణంగా ఉత్తరం వైపు ఉండి పీఠభూమి అంచుకు చేరుకున్న తర్వాత పశ్చిమం వైపుకు మారుతుంది.[18] కొండ ఎత్తుల నుండి రెండుపాయలుగా ప్రవహిస్తుంది.ఒకటి 55 మీటర్లు (180 అడుగులు), ఇంకొకటి 61 మీటర్లు (200 అడుగులు) ఎతు నుండి దిగువకు ప్రవహిస్తాయి. ఈ చివరి రెండు జలపాతాలను పైకారా జలపాతం అంటారు.[18] ఈ జలపాతం ప్రధాన రహదారిపై వంతెన నుండి దాదాపు 6 కిమీ (3.7 మైళ్ళు) దూరంలో ఉంది. పైకారా జలపాతం, ఆనకట్ట వద్ద ఒక పడవ గృహం పర్యాటకులకు అదనపు ఆకర్షణగా ఉంది.[17][19] దీనిని కామరాజ్ సాగర్ డ్యామ్ (దీనిని శాండినల్ల రిజర్వాయర్ అని కూడా పిలుస్తారు).[20] ఊటీ బస్టాండ్ నుండి 10 కిమీ (6.2 మైళ్ళు) దూరంలో ఉంది.[21][22]

మరి కొన్ని ఆసక్తికర ప్రదేశాలు

చూడవలసిన ప్రదేశాలు

  • దొడ్డబెట్ట శిఖరం
  • ఊటీ బోట్‌హౌస్
  • కాఫీ తోటలు
  • ఊటీ సరస్సు
  • రాతి గృహం
  • పర్వత రైలు మార్గం
  • సెయింట్ స్టీఫెంస్ చర్చి
  • మైనపు ప్రపంచం
  • గిరిజన మ్యూజియం
  • దేవదారు వనాలు
  • కామరాజు సాగర్ డ్యాం
  • ముడుమలయ్ జాతీయపార్కు
  • ముకుర్తి జాతీయపార్కు
  • ఎమరాల్డ్ సరస్సు
  • అవలాంచి సరస్సు
  • పోర్తిమండ్ సరస్సు
  • అప్పర్ భవాని సరస్సు

ప్రముఖులు

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు