స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ ప్రపంచ వ్యాప్తంగా సాగుచేయబడే ఒక సంకరజాతి ఫలం. చిక్కటి ఎరుపు, సువాసన, ఇంపైన రూపం, మధురమైన రుచి దీని ప్రత్యేక లక్షణాలు. దీన్ని పండు రూపంలోనూ, లేదా రసం, జాం, పై, ఐస్ క్రీం, మిల్క్ షేక్, చాకొలేట్ రూపంలో పెద్ద మొత్తంలో సేవిస్తుంటారు.

స్ట్రాబెర్రీ
ఫ్రగేరియా × అననస్సా
స్ట్రాబెర్రీ పండు
సగానికి కోసిన స్ట్రాబెర్రీ పండు
శాస్త్రీయ వర్గీకరణ edit
Unrecognized taxon (fix):Fragaria
Species:
Template:Taxonomy/FragariaF. × ananassa
Binomial name
Template:Taxonomy/FragariaFragaria × ananassa
Duchesne

ఇప్పుడున్న రూపం మొదటిసారిగా 1750 లో ఫ్రాన్స్ లోని బ్రిటనీ లో పండించబడింది.[1]

పేరులో బెర్రీ అని ఉన్నా వృక్షశాస్త్ర పరంగా చూస్తే ఇది బెర్రీ జాతికి చెందినది కాదు. ఇది ఒక యాక్సెసరీ ఫ్రూట్. అంటే కండభాగం మొక్క అండాశయాల నుండి కాకుండా అండాశయాలను కలిగి ఉన్న రిసెప్టాకిల్ నుండి ఉద్భవిస్తుంది. దాని ఉపరితలం మీద కనిపించే ప్రతి "విత్తనం" వాస్తవానికి దాని పువ్వు యొక్క అండాశయాలలో ఒకటి. ప్రతి దాని లోపల ఒక విత్తనం ఉంటుంది.[2]

2019 లో ప్రపంచ వ్యాప్తంగా 9 మిలియన్ టన్నుల స్ట్రాబెర్రీ పండించారు. అందులో సింహభాగం (40%) చైనా దేశానిది.

మూలాలు