కార్గిల్ యుద్ధం

(కార్గిల్ యుద్ధము నుండి దారిమార్పు చెందింది)

కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం.[8] యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది.[9][10][11] నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది (మొదటిది చైనా - సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది.

కార్గిల్ యుద్ధము

భారతదేశానికి చెందిన బోఫోర్స్ 155 mm హోవిట్జర్ ఫీల్డ్ గన్ యుద్ధక్షేత్రానికి తరలిస్తున్న దృశ్యం.
తేదీ3 మే 1999 - జులై 26
ప్రదేశంకార్గిల్ జిల్లా, అప్పటి జమ్మూ కాశ్మీర్ (ఇప్పటి లడఖ్)
ఫలితంపాకిస్తాన్ ఆక్రమించుకున్న పర్వత శిఖరాలను భారత్ తిరిగి స్వాధీనపరచుకున్నది. పాకిస్తాన్ యుద్ధానికి పూర్వం ఉన్న సరిహద్దుకి వెనుతిరిగింది.
ప్రత్యర్థులు
India
భారత్
పాకిస్తాన్
పాకిస్తాన్, ముజాహిదీన్,
విదేశీ జీహాదీలు
సేనాపతులు, నాయకులు
India వేద్ ప్రకాష్ మాలిక్పాకిస్తాన్ పర్వేజ్ ముషారఫ్
బలం
30,0005,000
ప్రాణ నష్టం, నష్టాలు
భారత అధికారిక లెక్కలు:
527 మరణించారు[1][2][3]
1,363 గాయపడ్డారు[4]
1 యుద్ధఖైదీ
పాకిస్తాన్ లెక్కలు:
357 — 4,000 మరణించారు[5][6]
665+ గాయపడ్డారు[5]
8 యుద్ధఖైదీలు[7]

ప్రదేశం

భారత్-పాకిస్తాన్ విభజన జరగక ముందు కార్గిల్ ప్రాంతం లద్దాక్ ప్రాంతం లోని బల్టిస్తాన్ జిల్లాలో భాగంగా ఉండేది. మొదిటి కాశ్మీర్ యుద్ధం (1947–48) తర్వాత నియంత్రణ రేఖ బల్టిస్తాన్ జిల్లాగుండా ఏర్పడింది. దీంతో కార్గిల్ ప్రాంతం భారతదేశంలోని జమ్మూ-కాశ్మీర్ లో భాగమైంది.[12] 1971లో యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దుని అంగీకరించడంతో పాటు ఇక్కడ ఎటువంటి కాల్పులకు దిగకూడదు.[13]

యుద్ధం జరిగిన ప్రదేశం

కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 కి.మీ. ల దూరంలో ఉంది.[14] హిమాలయాల్లోని మిగతా ప్రాంతాల లాగా కార్గిల్ ప్రాంతంలో కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత −48 °C గా ఉంటుంది.[15] శ్రీనగర్ - లేహ్ లను కలిపే జాతీయ రహదారి (NH 1D) కార్గిల్ గుండా వెళుతుంది. ఈ ప్రాంతం లోకి పాకిస్తాన్ చొరబాటుదారులు వచ్చి 160 కి.మీ. పొడవునా కొండలపైనుంచి కాల్పులు జరిపారు.[8] కొండల మీదున్న సైనిక స్ధావరాలు 16,000 అడుగుల ఎత్తులో (కొన్నైతే 18,000 అడుగుల ఎత్తులో) ఉన్నాయి.[16] కార్గిల్ మీదే దాడికి దిగడానికి ముఖ్యకారణం, చుట్టూ ఉన్న ముఖ్యమైన సైనిక స్ధావరాలను స్వాధీన పర్చుకోవడం ద్వారా ఆ ప్రాంతం పై పట్టు సాధించడం.[17] అంతేకాక ఎత్తైన ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం వల్ల కింద నుంచి పోరాడేవారి సంఖ్య ఎన్నో రెట్లు అధికంగా ఉండాలి.[18] దానికి తోడు గడ్డకట్టుకు పోయేంత చల్లటి ఉష్ణోగ్రతలు మరో అడ్డంకి.[19]

నేపథ్యం

భౌగోళికంగా కీలకంగా ఉన్న కార్గిల్ పట్టణం

1971 లో భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణలు తక్కువే అయినా సియాచెన్ హిమానీనదం మీద పట్టు సాధించటానికి ఇరు దేశాలు చుట్టు పక్కల ఉన్న కొండల మీద సైనిక స్ధావరాలను ఏర్పాటు చేస్తుండటంతో ఘర్షణలు పెరిగాయి.[20] 1990లలో కాశ్మీర్ లో పాకిస్తాన్ ప్రేరేపిత వేర్పాటువాదం, అణు ప్రయోగాల వల్ల ఉద్రిక్త పరిస్థిలు నెలకొన్నాయి. వీటిని తగ్గించుకోడానికి ఇరు దేశాలు కాశ్మీర్ సమస్యని కేవలం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని లాహోర్ లో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

1998 -1999 ల మధ్య శీతాకాలములో పాకిస్తాన్ సైన్యం కొంత మంది సైనికులను ముజాహిదీన్ ల రూపంలో భారత్ కాశ్మీర్ లోకి పంపింది. ఈ చర్యకి "ఆపరేషన్ బద్ర్" అని గుప్త నామం.[21] దీని లక్ష్యం కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను విడదీసి, భారత సైన్యాన్ని సియాచెన్ నుండి వెనక్కి పంపడం, భారత్ ని కాశ్మీర్ సరిహద్దు పరిష్కారంలో ఇరుకున పెట్టడం. అంతేగాక ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయంగా ముఖ్యాంశం అవ్వాలని పాక్ ఉద్దేశం.

భారత సైన్యాధిపతి వేద్ ప్రకాష్ మాలిక్, ఎందరో ఇతర పండితుల ప్రకారం,[22][23] ఈ కార్యక్రమానికి పాకిస్తానీయులు చాలాకాలం క్రితమే రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ యుద్ధ తీవ్రతకి భయపడి పాకిస్తాన్ నాయకులు వెనక్కి తగ్గారు.[24][25][26] 1998 లో పర్వేజ్ ముషారఫ్ పాక్ సైన్యాధిపతి అవ్వగానే మళ్ళీ ఈ పథకానికి ప్రాణం పోశాడు.[21][27] యుద్ధానంతరం పాక్ ప్రధాని, నవాజ్ షరీఫ్, ఈ విషయాలేవీ తనకు తెలియవని, భారత ప్రధాని వాజపాయ్ చేసిన ఫోన్ ద్వారానే ఈ విషయాలు తెలిసాయని తెలిపాడు.[28] ఈ పథకం మొత్తం ముషారఫ్, అతని సన్నిహిత సైనికాధికారులు కలిసి చేశారని షరీఫ్,[29] చాలా మంది పాక్ రచయితలు చెప్పారు..[24][30] కాని ముషారఫ్ ఈ పథకాన్ని, లాహోర్ ఒప్పందానికి 15 రోజుల ముందే షరీఫ్ కు తెలియపరిచానని చెప్పాడు.

యుద్ధం పురోగతి

ఘటనలు

తేదీ (1999)ఘటన
3 మేకార్గిల్‌లో పాకిస్తాన్ చొరబడిందని గొర్రెల కాపరులు చెప్పారు
5 మేభారత సైన్యం గస్తీ దళాన్ని పంపించింది. ఐదుగురు భారతీయ సైనికులను పట్టుకుని చిత్రహింస చేసి చంపేసారు.
9 మేపాకిస్తాన్ సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసమైంది.
మే 10ద్రాస్, కక్సార్, ముష్ఖో సెక్టార్లలో చొరబాట్లు కనుగొన్నారు.
మే మధ్యలోభారత సైన్యం కాశ్మీరులోయ నుండి మరింత మంది సైనికులను కార్గిల్ సెక్టారుకు పంపించింది.
మే 26చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులు చేసింది.
మే 27భారత వాయుసేన ఒక మిగ్-21 ను, ఒక మిగ్-27 ను కోల్పోయింది. ఫ్లైట్ లెఫ్టె. నచికేతను యుద్ధఖైదీగా పట్టుకున్నారు.
మేవాయుసేనకు చెందిన ఎమ్‌ఐ-17 హెలికాప్టరును పాకిస్తాన్ కూల్చివేసింది. నలుగురు సిబ్బంది మరణించారు.
జూన్ 1పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. జాతీయ రహదారి 1ఎ పై బాంబులు వేసింది.
జూన్ 5ముగ్గురు పాకిస్తాన్ సైనికుల నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలని భారత సైన్యం బయటపెట్టి పాకిస్తాన్ జోక్యాన్ని బయటపెట్టింది.
జూన్ 6భారత సైన్యం పెద్ద ఎత్తున దాడి మొదలుపెట్టింది.
జూన్ 9బటాలిక్ సెక్టారులో రెండు కీలక స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీన పరచుకుంది.
జూన్ 11పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి జన. పర్వేజ్ ముషారఫ్, ఛీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టె. జన. అజీజ్ ఖాన్ తో జరిపిన సంభాషణను బయటపెట్టి పాకిస్తాన్ సైన్యపు జోక్యాన్ని నిరూపించింది.
జూన్ 13ద్రాస్ సెక్టారులోని తోలోలింగ్‌ను భారత సైన్యం స్వాధీనపరచుకుంది.
జూన్ 15అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో టెలిఫోనులో మాట్లాడుతూ, కార్గిల్ నుండి తప్పుకోమని చెప్పాడు.
జూన్ 29భారత సైన్యం టైగర్ హిల్ వద్ద ఉన్న రెండు కీలక స్థావరాలను పాయింట్ 5060, పాయింట్ 5100 స్వాధీనపరచుకుంది
జూలై 2భారత సైన్యం త్రిముఖ దాడిని మొదలుపెట్టింది.
జూలై 411 గంటల పోరు తరువాత, భారత సైన్యం టైగర్ హిల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది
జూలై 5భారత సైన్యం ద్రాస్‌పై నియంత్రణ సాధించింది. క్లింటన్‌తో సమావేశం తరువాత, పాఅకిస్తాన్ ప్రధాని షరీఫ్ కార్గిల్ నుండి వెనక్కి వెళ్తున్నట్లు ప్రకటించాడు.
జూలై 7బటాలిక్ సెక్టారులోని జుబర్ హైట్స్‌ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.
జూలై 11పాకిస్తాన్ వెనక్కి వెళ్ళడం మొదలైంది. బటాలిక్‌ లోని కీలక శిఖరాలను భారత సైన్యం స్వాఅధీనపరచుకుంది.
జూలై 14ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని భారత ప్రధాని వాజపాయి ప్రకటించాడు. పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ షరతులు విధించింది.
జూలై 26కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్తాన్ చొరబాటుదారులను పూర్తిగా వెళ్ళగొట్టామని భారత సైన్యం ప్రకటించింది.

[31][32][33]

యుద్ధం మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి దశలో, పాక్ దళాలు భారత కాశ్మీర్ లోకి చొరబడి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను ఆక్రమించుకుని ఎన్.హెచ్.1 (జాతీయ రహదారి) ని శతఘ్నుల పరిధిలోకి తెచ్చుకున్నాయి. రెండో దశలో, భారత దళాలు చొరబాట్లను గుర్తించి సైన్యాన్ని సమాయత్తం చేసింది. ఆఖరి దశలో, ప్రధాన యుద్ధాలు జరిగి భారతదేశం పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకుంది.[34][35] అంతర్జాతీయ వత్తిడి తట్టుకోలేక పాక్ సేనలు వెనుదిరిగాయి.

భారత భూభాగం ఆక్రమించిన పాకిస్తాన్

చొరబాట్లు, సైనిక దళాల మొహరింపు..

శీతాకాలములో వాతావరణం బాగా చల్లగా ఉండటం వల్ల ఇరు దేశాల సైన్యాలు కొన్ని సైనిక స్ధావరాలను వదిలి వెనక్కి వెళ్తారు. వాతావరణం అనుకూలస్తే తిరిగి వారి వారి స్ధానాలకి వెళ్శి గస్తీ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1999 లో, పాకిస్తాన్ సైన్యం తన సైనిక స్ధావరాలను వెంటనే తిరిగి ఆక్రమించుకోవడమే కాక నియంత్రణ రేఖ దాటి భారత సైనిక స్ధావరాలను కూడా ఆక్రమించుకున్నారు.[36] స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, నార్తర్న్ లైట్ ఇన్ ఫాంట్రీకి చెందిన సైనికులు భారత భూభాగంలోకి చొరబడి యుద్ధానికి అనువైన ప్రదేశాలను ఆక్రమించుకున్నారు.[37][38] వీరికి కాశ్మీరీ తీవ్రవాదులు, ఆఫ్గాన్ కి చెందిన కిరాయి తీవ్రవాదులు సహకరించారు.[39]

పాక్ చొరబాట్లను కనుగొని సైన్యాన్ని పంపిన భారత్

మొదట్లో భారత సైన్యం ఈ చొరబాట్లను పలు కారణాల వల్ల గుర్తించలేదు. గస్తీ కాసే దళాలను చొరబాట్లు జరిగిన ప్రాంతాలకి పంపలేదు, శతఘ్నులతో పాక్ దాడులు చేస్తూ చొరబాటు దారులకు వీలు కల్పించింది. కానీ, మే రెండో వారానికి, సౌరభ్ కాలియా నేతృత్వం లోని భారత గస్తీ దళంపై జరిగిన ఆకస్మిక దాడి వల్ల చొరబాట్లు వెలుగులోకి వచ్చాయి.[40] మొదట్లో చొరబాట్ల తీవ్రత తెలియని భారత దళాలు, ఇది కేవలం ఉగ్రవాదుల (జీహాదీలు) పని ఆనుకుని రెండు మూడు రోజుల్లో వారిని వెళ్ళగొట్టవచ్చు అనుకుంది. కానీ నియంత్రణ రేఖ వెంబడి అనేక చోట్ల పరిస్ధితి ఇలాగే ఉండడాన, వీరు అవలంబిస్తున్న పద్ధతులలో తేడాల వల్లనూ ఇది చాలా పెద్ద దాడేనని నిర్ధారణకు వచ్చాయి. మొత్తం 130 - 200 చ.కి.మీ. మేర భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు.[30][41] ముషారఫ్ మాత్రం 1,300 చ.కి.మీ. భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారని చెప్పాడు.[37]

భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ తో జవాబిచ్చింది. 200,000 భారత సైనికులను పంపింది. భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ ని ప్రారంభించింది. భారత నావికా దళం కూడా పాకిస్తాన్ కు చెందిన ఓడరేవులకు (ముఖ్యంగా కరాచి ఓడరేవుకి)[42] వెళ్ళే మార్గాలను మూసివేసేందుకు సిద్ధమైంది.[43] పూర్తి స్ధాయి యుద్ధం సంభవిస్తే పాక్ వద్ద కేవలం ఆరు రోజులకు సరిపడ ఇంధనము మాత్రమే ఉందని అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపాడు.[8]

పాక్ ఆక్రమణల మీద భారత్ దాడి

కాశ్మీరు మొత్తం ఎత్తైన కొండ ప్రాంతం. ఇక్కడ NH 1D జాతీయ రహదారి వంటి అత్యుత్తమ రోడ్లు సైతం రెండు లేన్లకి పరిమితమయ్యాయి. ఇటువంటి కష్టతరమైన మార్గం వల్ల ట్రాఫిక్ నిదానంగా సాగింది. అంతేగాక, ఎత్తైన ప్రదేశం కావడంతో విమానాల ద్వారా సామాగ్రిని తరలించడం కష్టతరమైంది. దీంతో NH 1D రహదారిని కాపాడుకోవడం భారత్ కు అత్యంత ప్రధానం. పాకిస్తాన్ సైన్యానికి వారి స్ధావరాల నుండి NH 1D రహదారి స్పష్టంగా కనిపించడమే కాక శతఘ్నులతో దాడి చేయడం అత్యంత సులువు.[44] ఇది భారత సైన్యానికి పెద్ద సమస్య. ఎందుకంటే అన్నిరకాల సైనిక సామాగ్రీని తరలించుకోడానికి ఈ రహదారి చాలా అవసరం.[45] శతఘ్నులతో దాడి వల్ల లేహ్ ప్రాంతం విడిపోయే ప్రమాదం ఏర్పడింది (అయినా హిమాచల్ ప్రదేశ్ ద్వారా మరో దూర మార్గం ఉంది).

చొరబాటుదారుల వద్ద చిన్న ఆయుధాలు, గ్రనేడ్లు మాత్రమే కాక ఫిరంగులు, శతఘ్నులు, యుద్ధవిమానాలని కూల్చివేసే తుపాకులు ఉన్నాయి. చాలా చోట్ల చొరబాటుదారుల మందు పాతరలు అమర్చారు. 8,000 మందుపాతరలు కనుగొన్నట్లు భారత్ ప్రకటించింది.[46] మానవ రహిత విమానాలు, అమెరికా సమకూర్చిన AN/TPQ-36 ఫైర్ ఫైండర్ రాడార్ ల ద్వారా పాకిస్తాన్ పర్యవేక్షణ కొనసాగించింది . NH 1D కి చేరువలో ఉన్న పర్వత శిఖరాలను స్వాధీన పర్చుకోవడం భారత సైన్యపు మొట్టమొదటి ప్రాధాన్యత. అందుకే ద్రాస్ లో ఉన్న టైగర్ హిల్, టోలోలింగ్ కాంప్లెక్స్ ల మీద దాడి చేశారు.[47] ఆ తదుపరి వెంటనే సియాచెన్ గ్లేషియర్ కి ప్రవేశం కల్పించే బటాలిక్-టుర్ టోక్ సబ్ సెక్టార్ మీద దాడి చేశారు. పాకిస్తాన్ కి వ్యూహాత్మకంగా ముఖ్యమైన పర్వత శఖరాలలో పాయింట్ 4590, పాయింట్ 5353 ఉన్నాయి. పాయింట్ 4590 కి NH 1D కనుచూపు మేరలో ఉంది. పాయింట్ 5353 ద్రాస్ సెక్టార్ లోనే అత్యంత ఎత్తున ఉన్న ప్రదేశం. అందువల్లే పాక్ దళాలకి NH 1D సులభంగా కనిపించే అవకాశం ఏర్పడింది.[48] జూన్ 14న పాయింట్ 4590ని తిరిగి స్వాధీన పర్చుకున్న భారత సైన్యానికి ఈ చోటే అత్యధిక సంఖ్యలో సైనిక నష్టం జరిగింది.[49] రహదారి పరిసర ప్రాంతాలలోని సైనిక స్థావరాలను జూన్ మధ్య నాటికి తిరిగి స్వాధీన పర్చుకున్నప్పటికీ, ద్రాస్ ప్రాంతంలోని రహదారి పైకి మాత్రం యుద్ధం ముగిసే వరకు శతఘ్నులతో దాడులు కొనసాగాయి.

పాక్ దళాలు కూల్చిన మిగ్-21 ఫైటర్ విమాన శకలాలు. పైలట్ అజయ్ అహుజా మృతి చెందాడు..

NH 1D రహదారి కనిపించే కొండ ప్రాంతాలను తిరిగి స్వాధీన పర్చుకున్న తర్వాత భారత సైన్యం శతృవులను నియంత్రణ రేఖ అవతలకి తరిమికొట్టడం మీద దృష్టి పెట్టాయి. టోలోలింగ్ వద్ద జరిగిన యుద్ధం తర్వాత యుద్ధ పరిణామాలు భారత్ కు అనుకూలంగా మారింది. టోలోలింగ్ వద్ద పాకిస్తాన్ దళాలకి కాశ్మీర్ వేర్పాటువాదులు సహకరించారు. టైగర్ హిల్ (పాయింట్ 5140), పలు ఇతర చోట్ల గట్టి వ్యతిరేకత చూపించినా చివరికి విజయం భారత్‌నే వరించింది. పాక్ దళాలు టైగర్ హిల్ వద్ద పాతుకుపోయారని భారత్ సైన్యానికి అర్ధం అయ్యింది. అంతేగాక ఇక్కడ ఇరు పక్షాలకి బాగా ప్రాణ నష్టం సంభవించింది. చివరగా జరిపిన దాడిలో 10 మంది పాక్ సైనికులు, 5 గురు భారత సైనికులూ మృతి చెందగా, టైగర్ హిల్ భారత్ వశమైంది. మరికొన్ని పేరు లేని కొండలపై కూడా తీవ్ర పోరాటాలు జరిగాయి.

ఆపరేషన్ పూర్తిగా మొదలయ్యే సరికి దాదాపు 250 శతఘ్నులను కనుచూపు మేరలో ఉన్న సైనిక గుడారాలలోని చొరబాటుదారులని వెల్లగొట్టడానికి సిద్ధం చేశారు. బోఫోర్స్ ఫీల్డ్ హోవిట్జర్ (కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణంతో అపఖ్యాతి మూటగట్టుకున్నాయి) చాలా ముఖ్య పాత్ర పోషించాయి. కొన్ని ప్రాంతాలలో వీటిని పూర్తి స్ధాయిలో భారత దళాలు ఉపయోగించుకున్నాయి. మిగిలిన ప్రాంతాలలో వీటిని మొహరించడానికి సరిపడ స్థలం లేకపోవడంతో అనుకున్న ఫలితాలు రాలేదు.

భారత వైమానిక దళం ఒక మిగ్-27 స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఇంజిన్ విఫలం కావడంతో కోల్పోయింది. మరో మిగ్-21 ఫైటర్ ని పాక్ దళాలు కూల్చివేశాయి. మొదట్లో రెండిటినీ తామే కూల్చినట్లు పాకిస్తాన్ చెప్పుకుంది.[50][51] కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రిటైర్డ్ పాక్ ఆఫీసరు సాంకేతిక సమస్యల వల్లే కూలిందని చెప్పాడు.[52] పాక్ దళాలు పాతుకు పోయిన స్థలాల మీద భారత వైమానిక దళం లేసర్ గైడెడ్ బాంబులు ప్రయోగించింది.[8]

1999 మే 27 న ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత నడుపుతున్న మిగ్-27లో ఇంజిన్ లోపాలు రావడంతో బటాలిక్ సెక్టార్ లో ఉండగా పారాచూట్ సాయంతో బయటపడ్డారు. ఆయన జాడ కనిపెట్టడానికి వెళ్ళిన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా విమానాన్ని మిసైల్ సహాయంతో పాక్ దళాలు కూల్చేశాయి. అందిన వార్తల ప్రకారం, ఆయన విమానం కూలిపోవడానికి ముందే బయటకు క్షేమంగా వచ్చినప్పటికీ పాక్ దళాలకు దొరకడంతో కాల్చి చంపారు. ఆయన శవం మీద బుల్లెట్ గాయాలున్నాయి.[8]

వెనుదిరగడం , ఆఖరి యుద్ధాలు

ప్రపంచ దేశాల అభిప్రాయం

అనంతర పరిణామాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు