వెయ్యి గాట్లు పెట్టి భారతదేశాన్ని రక్తమోడించడం

పాకిస్తాన్ సైనిక సిద్ధాంతం

వెయ్యి గాట్లు పెట్టి భారతదేశాన్ని రక్తమోడించడం అనేది భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ సైన్యం అనుసరించే సైనిక సిద్ధాంతం. [1] [2] అనేక ప్రదేశాలలో తిరుగుబాటుదారులను, చొరబాటుదారులనూ ఉపయోగించి భారతదేశానికి వ్యతిరేకంగా దొంగచాటు యుద్ధం చేయడం దీని ఉద్దేశం. ఈ ఆలోచనను పాకిస్తానీ సైన్యం, వివిధ అధ్యయనాలలో, ముఖ్యంగా క్వెట్టాలోని స్టాఫ్ కాలేజ్‌లో, ప్రతిపాదించిందని అపర్ణా పాండే చెప్పింది. [3] ఈ వ్యూహాన్ని వివరించే ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మాజీ డైరెక్టర్‌ను పీటర్ చాక్, క్రిస్టీన్ ఫెయిర్ లు ఉదహరించారు. [4]

1965లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చేసిన ప్రసంగంలో, పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో భారతదేశానికి వ్యతిరేకంగా వెయ్యి సంవత్సరాల యుద్ధాన్ని చేస్తామని ప్రకటించాడు. [5] [6]పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ జియా-ఉల్-హక్, తీవ్రవాదం, చొరబాట్లతో చాటుమాటుగా, మిత స్థాయిలో యుద్ధం చేసి 'వెయ్యి గాట్లతో భారతదేశాన్ని రక్తమోడించే' సిద్ధాంతంతో, భుట్టో చెప్పిన "వెయ్యి సంవత్సరాల యుద్ధానికి" ఒక కార్యరూపం ఇచ్చాడని రీతికా శర్మ రాసింది. [7] ఈ సిద్ధాంతాన్ని మొదట, పాకిస్తాన్‌తో భారతదేశానికి ఉన్న పశ్చిమ సరిహద్దును ఉపయోగించుకుంటూ పంజాబ్ తిరుగుబాటు సమయంలోను, కాశ్మీర్ తిరుగుబాటు సమయంలోనూ పాకిస్తాన్ అమలు చేసింది. [8] [9]

మూలాలు

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల సాపేక్ష స్థానాన్ని చూపే 2014 భారతదేశ రాజకీయ పటం

ఈ వ్యూహాత్మక సిద్ధాంతపు మూలాలు 1965 [6] ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జుల్ఫికర్ అలీ భుట్టో చేసిన ప్రసంగంలో ఉన్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా వెయ్యి సంవత్సరాల యుద్ధం చేస్తామని అతడు ఆ ప్రసంగంలో ప్రకటించాడు. అప్పట్లో భుట్టో, జనరల్ అయూబ్ ఖాన్ సైనిక ప్రభుత్వంలో సభ్యుడు. 1971 యుద్ధంలో భుట్టో వేసిన ప్రణాళికల్లో తూర్పు భారతదేశం మొత్తాన్నీ విడదీసి, తూర్పు పాకిస్తాన్‌లో దాన్ని శాశ్వతంగా కలిపెయ్యడం, కాశ్మీర్‌ను ఆక్రమించడం, పంజాబ్‌ను ప్రత్యేక 'ఖలిస్తాన్'గా మార్చడం వంటివి ఉన్నాయి. [10] కానీ ఆ యుద్ధం, పాకిస్తాన్ ముక్కలవడంతో ముగిసింది. ఆ తరువాత భుట్టో, భారతదేశంపై "వెయ్యి గాట్లు పెట్టి" సంఘర్షణను కొనసాగించే సిద్ధాంతాన్ని కల్పించాడు. [11] భారతదేశాన్ని నాశనం చేయాలనే పాకిస్తాన్ 'జాతీయ లక్ష్య' సాధనలో పాకిస్తాన్, సాంప్రదాయిక ప్రత్యక్ష యుద్ధం ద్వారా విజయం సాధించ లేదు; "భారతదేశపై వెయ్యి గాట్లు పెట్టడం" ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అని భుట్టో చెప్పినట్లు ది పయనీర్ రాసింది. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడమే ఈ ప్రకటన ఉద్దేశాలలో ఒకటి. [12]

1977 జూలై 5 న ఆర్మీ చీఫ్ జనరల్ జియా-ఉల్-హక్, భుట్టోను పదవి నుండి దించేసాడు. ఆ తరువాత అతనిపై దేశద్రోహ ఆరోపణలు మోపి, విచారించి, ఉరితీయించాడు. [13] [14]

జియా 1978లో పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక, వెయ్యి గాట్ల విధానం రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమి తరువాత, పాకిస్తాన్ రెండు ముక్కలై, బంగ్లాదేశ్ ఏర్పడింది. సాంప్రదాయిక యుద్ధం ద్వారా కాశ్మీర్‌ను ఇకపై భారతదేశం నుండి లాక్కోలేమని పాకిస్తాన్‌కు ఆ యుద్ధం ద్వారా స్పష్టమైంది. [15] జియా, 'బ్లీడ్ ఇండియా త్రూ ఎ థౌజండ్ కట్స్' సిద్ధాంతంతో దొంగచాటుగా చొరబాట్లను ప్రోత్సహించి, తక్కువ తీవ్రతతో కూడిన యుద్ధం చేస్తూ భుట్టో ప్రతిపాదించిన "వెయ్యి సంవత్సరాల యుద్ధ" సిద్ధాంతాన్ని అమలు చేసాడు. [7] [8]

పంజాబ్

1970ల నుండీ పంజాబ్‌లో సిక్కు వేర్పాటువాద ఉద్యమానికి పాకిస్తాన్ సహాయం చేస్తూ వస్తోంది. 1980ల ప్రారంభం నుండి పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI భింద్రన్‌వాలే అనుచరులకు మద్దతు ఇవ్వడానికి, వారికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేయడానికీ దాని ప్రధాన కార్యాలయంలో ఒక ప్రత్యేక పంజాబ్ సెల్‌ను ఏర్పాటు చేసింది. సిక్కు యువతకు శిక్షణ ఇచ్చేందుకు పాకిస్థాన్‌ లోని లాహోర్, కరాచీలలో ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసింది. [16] హమీద్ గుల్ (ఐఎస్‌ఐకి నాయకత్వం వహించిన) పంజాబ్ తిరుగుబాటు గురించి చెబుతూ, "పంజాబ్‌ను అస్థిరపరచి ఉంచడం అనేది, ఒక రూపాయి అదనపు ఖర్చు లేకుండా పాకిస్తాన్ సైన్యం అదనంగా ఒక డివిజను కలిగి ఉండటంతో సమానం" అని పేర్కొన్నాడు.

కాశ్మీర్

సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం ముగిసిన తర్వాత, సున్నీ ముజాహిదీన్లు, ఇతర ఇస్లామిక్ మిలిటెంట్ల యోధులు ఆఫ్ఘనిస్తాన్ నుండి సోవియట్ దళాలను విజయవంతంగా తొలగించారు. కాశ్మీర్ సంఘర్షణలో భారత సాయుధ దళాలకు వ్యతిరేకంగా "వెయ్యి గాట్ల" సిద్ధాంతానికి అనుగుణంగా "భారత్‌ను రక్తమోడ్చేందుకు" పాకిస్తాన్ సైన్యం, పౌర ప్రభుత్వాలు ఈ మిలిటెంట్లను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాయి. పాకిస్తాన్ అణ్వాయుధాలను ఇందుకు ఒక కవచంగా ఉపయోగించుకున్నాయి. [12] [17] 1980వ దశకంలో సుశిక్షితులైన సాయుధ ఉగ్రవాదుల సమూహాలు సరిహద్దు గుండా భారతదేశంలోకి చొరబడడంతో కాశ్మీర్ ప్రాంతంలో సరిహద్దు తీవ్రవాదం ప్రారంభమైంది. కాశ్మీర్‌లోని ఉగ్రవాదం కాశ్మీరీల "స్వాతంత్ర్య పోరాటం" అనీ, పాకిస్తాన్ వారికి నైతిక మద్దతు మాత్రమే ఇస్తోందనీ పాకిస్తాన్ అధికారికంగా సమర్థించుకుంది. కాశ్మీర్‌లో చొరబాట్లకు మద్దతును ISI స్పాన్సర్ చేస్తోందని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) పేర్కొనడంతో పాకిస్తాన్ చెబుతున్న అధ్జికారిక వాదన తప్పని తేలింది. భారత్‌తో అసమాన యుద్ధాన్ని నిర్వహించడానికి పాకిస్తాన్ జిహాదీ కిరాయి సైనికులను ఉపయోగించుకుంది. కిరాయి సినిక సమూహాలు కేవలం ప్రాక్సీలుగా మాత్రమే కాకుండా, పాకిస్తాన్ చేపట్టిన "భారతదేశాన్ని రక్తమోడించే" ప్రచారంలో ప్రధాన,మైన "ఆయుధాలుగా" ఉపయోగించబడుతున్నాయి. [18]

కాశ్మీర్‌లోకి జిహాదీలను చొప్పించే "బ్లీడ్ ఇండియా" వ్యూహంతో ప్రమేయం ఉన్న జనరల్ ఇలా చెప్పాడు:

భారతదేశం కాశ్మీర్‌లో 7,00,000 మంది సైనికులను, పారామిలిటరీ బలగాలనూ మోహరించాల్సిన పరిస్థితి - పాకిస్తాన్‌కు అతి తక్కువ ఖర్చుతో కల్పించింది; అదే సమయంలో, భారత సైన్యం పాకిస్థాన్‌ను బెదిరించలేదని అది స్పష్టం చేసింది. భారతదేశానికి అపారమైన ఖర్చు కలిగించింది. సైనిక, రాజకీయ పరంగా అది భారత్‌ను కట్టడి చేసి ఉంచింది.[19]

1998 మేలో, భారతదేశం పోఖ్రాన్-II వద్ద తన అణ్వాయుధాలను పరీక్షించింది. ఆ వెంటనే పాకిస్తాన్ కూడా అణు పరీక్షలను నిర్వహించింది. [20] నిఅయంత్రణ రేఖకు భారత వైపు స్థానాల్లోకి కాశ్మీరీ మిలిటెంట్ల వేషధారణలో ఉన్న పాకిస్తానీ సైనికులు చొరబడటం వలన భౌగోళికంగా పరిమిత స్థాయిలో కార్గిల్ యుద్ధం జరిగింది, ఈ సమయంలో పాక్ విదేశాంగ కార్యదర్శి శంషాద్ అహ్మద్, అణ్వస్త్ర దాడుల బెదిరింపులు చేశాడు - 'మేము మా ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి మా ఆయుధశాలలో ఉన్న ఏ ఆయుధాన్నైనా ఉపయోగించడానికి వెనకాడం.' అని అతడు అన్నాడు. [21]

1999లో కార్గిల్ యుద్ధం తర్వాత, కార్గిల్ రివ్యూ కమిటీ ఒక నివేదికను వెలువరించింది. భారతదేశాన్ని రక్తమోడుస్తున్న పాకిస్థాన్ సిద్ధాంతాన్ని అందులో ప్రస్తావించింది. "కార్గిల్‌ను నివారించగలిగే వాళ్ళమా?" అనే 12వ అధ్యాయంలో ఇలా రాసారు: ఒకవేళ యుద్ధానికి ముందే కార్గిల్‌ను " సియాచినిజేషన్" చేసి ఉంటే - అంటే సైన్యాన్ని ఏడాది పొడవునా అక్కడ మోహరించి ఉన్నట్లయితే - దాని వల్ల భారత్ భారీ ఖర్చు చెయ్యాల్సిన అవసరం ఉండేది. "పాకిస్తాన్ భారతదేశాన్ని రక్తమోడించేలా చెయ్యడంలో" ఓఅకిస్తాన్‌కు తోడ్పడి ఉండేది. [22] [23]

2001 డిసెంబరు 13 న భారత పార్లమెంట్‌పై తీవ్రవాద దాడి జరిగింది (ఈ సమయంలో భవనంపై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులతో సహా పన్నెండు మంది మరణించారు). అంతకు ముందు 2001 అక్టోబర్ 1 న జమ్మూ కాశ్మీర్ శాసనసభపై దాడి జరిగింది. భారత ఆధీనంలోని కాశ్మీర్‌పై పోరాడుతున్న పాకిస్థాన్‌కు చెందిన రెండు ఉగ్రవాద గ్రూపులు, లష్కరే తోయిబా, జైష్-ఏ-మొహమ్మద్‌లు ఈ దాడులు చేసాయని భారత్ పేర్కొంది. ఈ రెండింటికి పాకిస్థాన్‌కు చెందిన ISI మద్దతు ఉందని భారతదేశం పేర్కొంది. పాకిస్థాన్ దీన్ని ఖండించింది. [24] [25] [26] ఈ జంట దాడులకు ప్రతిస్పందనగా భారతదేశం సైనిక బలగాలను సమీకరించడంతో, భారత పాకిస్తాన్ల మధ్య 2001-02 ప్రతిష్టంభన ఏర్పడింది. సరిహద్దుకు ఇరువైపులా, కాశ్మీర్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) పొడవునా సైనికులు మోహరించారు. అంతర్జాతీయ మీడియా రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే అవకాశం ఉందని చెబుతూ, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా నేతృత్వంలో జరుగుతున్న "ఉగ్రవాదంపై విశ్వ యుద్ధం" పై ఆ యుద్ధం వలన కలిగే పరిణామాలనూ నివేదించింది. అంతర్జాతీయ దౌత్య మధ్యవర్తిత్వం కారణంగా ఉద్రిక్తతలు తగ్గాయి, దీని ఫలితంగా 2002 అక్టోబరులో అంతర్జాతీయ సరిహద్దు నుండి భారత [27] పాకిస్తాన్ దళాలను ఉపసంహరించారు.

తీవ్రమైన కవ్వింపులు ఉన్నప్పటికీ, భారతదేశం సైనిక ప్రతీకారం తీర్చుకోకపోవడానికి కారణం, పాకిస్తాన్ అణు సామర్థ్యం భారతదేశాన్ని నిరోధించడమేమనని భావించారు. [28] డేవిడ్ ఎ. రాబిన్సన్ ప్రకారం, అణు ప్రతినిరోధం వలన భారతదేశాన్ని మరింత రెచ్చగొట్టడానికి కొన్ని పాకిస్తానీ వర్గాలను ప్రయత్నించాయి. పాకిస్తాన్ అవలంబించిన "అసమాన అణు విస్తరణ" విధానంతో భారతదేశపు సాంప్రదాయ సైనిక శక్తిని నిరోధించిందనీ, దాంతో భారత్ నుండి ఎదురుదాడి జరుగుతుందనే భయం లేకుండా మరింత దూకుడుగా "వెయ్యి గాట్లతో భారతదేశాన్ని రక్తమోడించే వ్యూహాన్ని" అమలు చేసిందని ఆయన చెప్పాడు. [28]

వర్తమానం

ప్రస్తుతం బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ ఛాందసవాదులు, హర్కత్-ఉల్-జిహాద్ అల్-ఇస్లామీ (హుజీ) వంటి తీవ్రవాద సమూహాల ద్వారా, [29] భారతదేశంపై తీవ్రవాద దాడులకు చేతులు కలిపారు. 2015లో, బంగ్లాదేశ్‌లో ఐఎస్‌ఐ ఏజెంట్‌గా ఉన్న పాకిస్తానీ హైకమిషన్ సిబ్బంది ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల రాకెట్‌లో ప్రమేయం ఉన్నందున ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినందున పాకిస్తాన్ అతనిని వెనక్కి పిలిపించుకోవాల్సి వచ్చింది. ఉగ్రవాద సంస్థలైన హిజ్బ్ ఉత్-తాహిర్, అన్సరుల్లా బంగ్లా టీమ్, జమాత్-ఎ-ఇస్లామీకి నిధులు అందించడంలో అతనికి ప్రమేయం ఉంది. [30] బంగ్లాదేశ్‌ కు చెందిన జమాతుల్ ముజాహిదీన్‌తో సంబంధాలు ఉన్నందుకు గాను, మరొక పాకిస్తాన్ దౌత్యవేత్త, హైకమిషన్‌లోని రెండవ కార్యదర్శిని 2015 డిసెంబరులో వెనక్కి పిలిపించుకోవాల్సి వచ్చింది. [31] బంగ్లాదేశ్‌లో నకిలీ భారతీయ కరెన్సీ కలిగిన పాకిస్థానీ పౌరులను అరెస్టు చేయడం "మామూలు సంగతే" నని డైలీ స్టార్ రాసింది. [30] శిక్షణ నివ్వడం లోను, అలాగే సరిహద్దును దాటి భారతదేశంలోకి ప్రవేశించడంలోనూ HuJI-B, బంగ్లాదేశ్‌లో సురక్షితమైన స్థావరాలను కల్పించి తోడ్పడుతుంది. [29]

పాకిస్తానీ వ్యాఖ్యాత పర్వేజ్ హుద్‌భోయ్ ప్రకారం, "పాకిస్థాన్ వారి 'వెయ్యి గాట్ల' విధానం శిథిలావస్థలో ఉంది". [33] భారత్ తన బలం కోల్పోకుండా నష్టాలను అధిగమించగలిగింది. అంతర్జాతీయ సమాజం జిహాద్‌ను అసహ్యించుకుంటోంది. "కాశ్మీర్‌లో జిహాద్" అని పిలవబడే దొంగచాటు యుద్ధాన్ని పాకిస్తాన్ కొనసాగించడం వలన తన కాశ్మీర్ విధానానికి అంతర్జాతీయ మద్దతు కోల్పోయింది. [34] [35] జిహాద్ పేరిట జరిగే ప్రతీ దాడి, పాకిస్తాన్ నైతిక స్థాయిని తగ్గిస్తోంది . [33] FATF ఓటుకు, అంతర్జాతీయంగా గుర్తించిన పాకిస్తానీ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కేంద్ర స్థానంలో ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన వివిధ దాడులకు ఇతడే కారణమని భారతదేశం నిందించింది. [36]

2016 మేలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ ఇలా అన్నాడు: [37]


ఇవి కూడా చూడండి

  • పాకిస్తాన్, ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం
  • భారత్-పాకిస్థాన్ సంబంధాలు
  • కోల్డ్ స్టార్ట్ (సైనిక సిద్ధాంతం)

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు