చిత్రావతి

చిత్రావతి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నది అనంతపురం జిల్లా గుండా ప్రవహిస్తుంది. ఇది పెన్నా నదికి కుడివైపు ఉపనది. దీని పరీవాహక ప్రాంతం 5,908 చ.కి.మీ.[1] ఇది వర్షాకాలంలో ప్రవహించే వర్షాధారమైన నది.[2]

చిత్రావతి బాలన్సింగ్ రిజర్వాయర్
చిత్రావతి బాలన్సింగ్ రిజర్వాయర్ వివరాలు

పుట్టపర్తి పట్టణం ఈ నదీ తీరాన ఉంది. సత్యసాయి బాబా ప్రశాంతి నిలయం ఈ నది ఒడ్డునే ఉంది. ప్రారంభ దశలో బాబా ఈ నదీ తీరంలో ఉపన్యాసాలు భక్తులకు వినిపించేవాడు. భజన కార్యక్రమాలు నిర్వహించేవాడు.

చిత్రావతి నది కర్ణాటక లోని చిక్కబళ్ళాపూర్ జిల్లాలో పుట్టి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, కడప జిల్లాల గుండా ప్రవహించి పెన్నానదిలో కలుస్తుంది.[3] కర్ణాటక లోని బాగేపల్లితో పాటు, ఆంధ్రప్రదేశ్ లోని గోరంట్ల, హిందూపూర్, బుక్కపట్నం, ధర్మవరం, తాడిపత్రి, కదిరి మండలాలు దీని పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి.[4] కడప జిల్లా గండికోట వద్ద చిత్రావతి పెన్నానదిలో కలుస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండికోట ప్రాజెక్టును చేపట్టింది.[5][6] చిత్రావతి, పాపఘ్ని కలిసి మధ్య పెన్నా బేసిన్ అవుతాయి.

అనంతపురం జిల్లా, తాడిమర్రి వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం కోలారు జిల్లా బాగేపల్లి వద్ద నిర్మించిన పరగోడు ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనేక సాగునీటి చెరువులకు నీరు అందదని ఆంధ్ర రైతులు వాదించారు.[7][8][9]

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు