డోడెకేన్

నార్మల్ డోడెకేన్ (n-dodecane)అనేది 12 కార్బనులను కల్గిన,సరళ హైడ్రోకార్బన్ గొలుసు కల్గిన ఆల్కేన్ సమూహానికి చెందిన హైడ్రోకార్బన్.n-డోడెకేన్ కిరోసిన్ మరియు కొన్ని జెట్ ఇంధనాలలో ప్రధాన భాగం, మరియు దాని పైరోలిసిస్ అధ్యయనం జెట్ ఫ్యూయల్ పైరోలైసిస్‌ను అర్థం చేసుకోవడానికి ఒక నమూనాగా ఉపయోగించ బడుతుంది.[4][5]N-డోడెకేన్ స్పష్టమైన రంగులేని ద్రవం.[6]ఇది జింగిబర్ అఫిసినల్ (అల్లం)తో సహా వివిధ మొక్కల ముఖ్యమైన/ఆవశ్యక నూనెల నుండి వేరుచేయబడింది.ఇది మొక్కల మెటాబోలైట్(జీవ క్రియ) పాత్రను కలిగి ఉంటుంది.[7]డోడెకేన్ అనేది కామెల్లియా సినెన్సిస్, అరిస్టోలోచియా ట్రయాంగ్యులారిస్ మరియు ఇతర జీవులలో లభించే ఒక సహజ ఉత్పత్తి.డోడెకేన్ యొక్క రసాయనిక సూత్రంC12H26. N-డోడెకేన్, బైహెక్సిల్ లేదా CH3-[CH2]10-CH3 అని కూడా పిలుస్తారు, ఆల్కేన్స్ అని పిలువబడే కర్బన సమ్మేళనాల తరగతికి చెందినది.N-డోడెకేన్ సగటున, నల్ల వాల్‌నట్‌లలో (జగ్లన్స్ నిగ్రా) అత్యధిక శాతం లో కనుగొనబడింది.[8]

డోడెకేన్
Skeletal formula of dodecane
Skeletal formula of dodecane with all implicit carbons shown, and all explicit hydrogens added
Ball and stick model of dodecane
పేర్లు
Preferred IUPAC name
Dodecane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య[112-40-3]
పబ్ కెమ్8182
యూరోపియన్ కమిషన్ సంఖ్య203-967-9
డ్రగ్ బ్యాంకుDB02771
కెగ్C08374
వైద్య విషయ శీర్షికn-dodecane
సి.హెచ్.ఇ.బి.ఐCHEBI:28817
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య JR2125000
SMILESCCCCCCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక1697175
జి.మెలిన్ సూచిక201408
ధర్మములు
C12H26
మోలార్ ద్రవ్యరాశి170.34 g·mol−1
స్వరూపంColorless liquid
వాసనGasoline-like to odorless
సాంద్రత0.7495 g mL−1 at 20 °C[2]
ద్రవీభవన స్థానం −10.0 to −9.3 °C; 14.1 to 15.2 °F; 263.2 to 263.8 K
బాష్పీభవన స్థానం 214 to 218 °C; 417 to 424 °F; 487 to 491 K
log P6.821
బాష్ప పీడనం18 Pa (at 25 °C)[3]
kH1.4 nmol Pa−1 kg−1
వక్రీభవన గుణకం (nD)1.421
స్నిగ్ధత1.34 mPa s
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−353.5–−350.7 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−7901.74 kJ mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
490.66 J K−1 mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C376.00 J K−1 mol−1
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రముhazard.com
జి.హెచ్.ఎస్.పటచిత్రాలుGHS08: Health hazard
జి.హెచ్.ఎస్.సంకేత పదంDANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలుH304
GHS precautionary statementsP301+310, P331
జ్వలన స్థానం{{{value}}}
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
205 °C (401 °F; 478 K)
విస్ఫోటక పరిమితులు0.6%
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}}{{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

ఐసోమరులు(సమాంగాలు)

355 డోడెకేన్ ఐసోమర్‌లు ఉన్నాయి.[9]

భౌతిక ధర్మాలు

డోడెకేన్ సాధారణం గా ద్రవరూపంలో వున్న ఆల్కేన్.అంతేకాదు రంగులేని ద్రవం.[10] ఇది మండే స్వాభావం ఉన్న హైడ్రోకార్బన్.(NTP, 1992). ఇది అదృవ(non polar)ద్రావణి.నీటిలో కరగదు.[10]

లక్షణం/గుణంమితి/విలువ
అణు సూత్రంC12H26
అణు భారం170.335 గ్రా/మోల్
సాంద్రత0.8± గ్రా/సెం. మీ3[11]
మరుగు స్థానం216.1±3.0°C [11]
ద్రవీభవన ఉష్ణోగ్రత-9.55°C[12]
వక్రీభవన గుణకం1.422[11]
ఫ్లాష్ పాయింట్71.1±0.0 °C[11]
బాష్పీకరణ ఉష్ణశక్తి43.4±0.8కిలో జౌల్స్/మోల్
స్వయం జలన ఉష్ణోగ్రత203°C (397°F)[13]

ఇథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఈథర్, అసిటోన్, క్లోరోఫామ్, కార్బన్ టెట్రాక్లోరైడ్లలో బాగా కరుగుతుంది.వియోగం చెందెలా వేడి చేసినప్పుడు అది తీవ్రమైన పొగను మరియు చికాకు కలిగించే పొగలను విడుదల చేస్తుంది.[14][15]

రసాయన చర్యలు

దహన చర్య

డోడెకేన్ ను ఆక్సిజన్ తో మండించినపుడు కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటిని ఏర్పరచును,అంటె కాక చర్య పలితంగా ఉష్ణశక్తి వెలువడును.ఈ ఉష్ణ శక్తిని యాంత్రిక చలన శక్తిగా లేదా ఇతర పదార్ధాలను వేడి చెయుటకు ఉపయోగిస్తారు.

C12H26 + 18.5 O2 → 12 CO2 + 13 H2O + ఉష్ణశక్తి

తాపవిచ్ఛేదన(pyrolysis)

ఒక పదార్థం వియోగం చెందటానికి ఆక్సిజన్ రహిత వాతవరణంలొ అధిక ఉష్ణొగ్రత వద్ద వేడిచెసి,వియోగ పలిత పదార్థాలను పొందటం జరుగును. పైరోలిసిస్ అనేది పదార్ధాలను వాటి ఉష్ణ వియోగం సులభతరం చేయడానికి సాపేక్షంగా జడ వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలకు లోబడి చేసే ప్రక్రియగా నిర్వచించవచ్చు.[16]

  • ఉదాహరణకు డోడెకేన్ ను 450°Cతో,4 MPa(మెగా పాస్కల్)వత్తిడి వద్ద తాపవిచ్ఛేదన చేసినచోఉత్పత్తి చేయబడిన ద్రవాలు సరళ శృంఖల పారాఫిన్, సరళ శృంఖల ఒలేఫిన్, సైక్లిక్ పారాఫిన్, సైక్లిక్ ఒలేఫిన్, ఒక బెంజీన్/టొల్యూన్/క్సిలీన్ (BTX) మిశ్రమం మరియు నాఫ్తలీన్‌గా విభజించబడ్డాయి.[17]పై ప్రక్రియలో లోహ ఫోం మీద శోషింపబడిన కర్బనం/కార్బన్ ను ఉత్ప్రేరకం గా ఉపయోగించారు.
  • డోడెకేన్ (కిరోసిన్ ఆయిల్ యొక్క ఒక భాగం) ప్లాటినం, పల్లాడియం లేదా నికెల్ యొక్క ఉత్ప్రేరక చర్యలో 973 K ఉష్ణోగ్రతకు వేడి చేయడం ద్వారా హెప్టేన్ మరియు పెంటేన్ మిశ్రమాన్ని పైరోలిసిస్ ఉత్పత్తులుగా ఇస్తుంది.[18]
  • n-డోడెకేన్ యొక్క తాపవిచ్ఛేదనాని జెట్-ప్రేరేపిత రియాక్టర్‌లో 793 నుండి 1093 K ఉష్ణోగ్రతల వద్ద, 1 మరియు 5 సెకన్ల మధ్య నివాస సమయాలు మరియు వాతావరణ పీడనం వద్ద అధ్యయనం చేయగా, ప్రతిచర్య యొక్క ఉత్పత్తులు ప్రధానంగా హైడ్రోజన్, మీథేన్, ఈథేన్, 1,3 బ్యూటాడిన్ మరియు 1-ఆల్కీన్, ఈథీన్ నుండి 1-అన్‌డెకిన్ వరకు ఏర్పడినవి.అధిక ఉష్ణోగ్రతలు మరియుఎక్కువ చర్యసమయాల వలన ఎసిటిలీన్, అలీన్, ప్రొపైన్, సైక్లోపెంటెన్, 1,3-సైక్లోపెంటాడైన్ మరియు నాఫ్తలీన్ ద్వారా బెంజీన్ నుండి పైరీన్ వరకు అరోమాటిక్ సమ్మేళనాలు కూడా ఏర్పడం గమనించబడ్డాయి.[19]

ఉపయోగాలు

  • డోడెకేన్ ద్రావకం వలె, సేంద్రీయ సంశ్లేషణలో, జెట్ ఇంధన పరిశోధనలో, స్వేదనం చేజర్‌గా మరియు రబ్బరు మరియు పేపర్ ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఉపయోగించబడుతుంది.[20]
  • పారాఫిన్ ఉత్పత్తులుతయారీ లోను, లూబ్రికెంట్ ఆయిల్ సంకలితం గాను ఉపయోగిస్తారు.[21]

దుష్పలితాలు

అగ్ని ప్రమాదం

  • ఈ రసాయనం మండే స్వభావం కలిగిన ద్రవం.అందువలన తగినంత గాలి మరియు నిప్పు లేదా నిప్పు రవ్వల సంపర్కంలొ డోడెకేన్ ఆవిర్లు మండి అగ్ని ప్రమాదం జరిగె అవకాశం వున్నది.[22]
  • వేడి మరియు ఓపెన్ మంట నుండి డోడెకేన్ ను దూరంగా ఉంచాలి.

అరోగ్య సమస్యలు

  • కళ్ళలో పడిన,కళ్ళ మీద పడిన,కళ్ళు మండి చికాకు కల్గిస్తుంది.అలాగే చర్మం పైపడిన ,చర్మం లోని కొవ్వు,నూనె తొల్గింపబడి,చర్మం పొడిబారి పోవును.చర్మం మంటగా అనిపిస్తుంది.[22]
  • శ్లేష్మ పొరలకు చికాకు కలిగించవచ్చు.[22]

ఇవికూడా చదవండి

ఆల్కేన్

బయటి విడియో లంకె

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు