పెల్లేడియం

(పల్లాడియం నుండి దారిమార్పు చెందింది)

పెల్లేడియం, ప్లేటినం, రోడియం, రుథీనియం, ఇరిడియం, ఆస్మియం - ఈ ఆరు రసాయన మూలకాలని ప్లేటినం గ్రూపు లోహాలు అంటారు. వీటి లక్షణాలలో గట్టి పోలికలు ఉన్నాయి; పెల్లేడియం వీటన్నిటిలో తక్కువ ఉష్ణోగ్రత దగ్గర కరుగుతుంది, అన్నిటి కంటే తక్కువ సాంద్రత కలది. పెల్లేడియం రసాయన హ్రస్వనామం Pd, అణు సంఖ్య 46. అరుదుగా లభించే, వెండిని పోలిన ఈ మూలకం ఉనికిని 1803లో విలియం హైడ్‌ ఒలాస్టన్‌ (William Hyde Wollaston) కనుక్కున్నారు. ఆ రోజుల్లోనే ఆవిష్కరణ పొందిన నభోమూర్తి పేలస్ (Pallas) గ్రహం అనుకుని ఆ గ్రహం గౌరవార్థం ఈ మూలకానికి పెల్లేడియం అని పేరు పెట్టడం జరిగింది. దరిమిలా పేలస్‌ గ్రహం కాదనీ, కేవలం గ్రహశకలం (planetoid or asteroid) అనీ తెలిసింది కాని అప్పటికే పెల్లేడియం పేరు స్థిరపడిపోయింది.

పల్లాడియం, 00Pd
పల్లాడియం
Pronunciation/pəˈldiəm/ (-LAY-dee-əm)
Appearanceవెండిలాంటి తెలుపు
Standard atomic weight Ar°(Pd)
  • 106.42±0.01[1]
  • 106.42±0.01 (abridged)[2]
పల్లాడియం in the periodic table
HydrogenHelium
LithiumBerylliumBoronCarbonNitrogenOxygenFluorineNeon
SodiumMagnesiumAluminiumSiliconPhosphorusSulfurChlorineArgon
PotassiumCalciumScandiumTitaniumVanadiumChromiumManganeseIronCobaltNickelCopperZincGalliumGermaniumArsenicSeleniumBromineKrypton
RubidiumStrontiumYttriumZirconiumNiobiumMolybdenumTechnetiumRutheniumRhodiumPalladiumSilverCadmiumIndiumTinAntimonyTelluriumIodineXenon
CaesiumBariumLanthanumCeriumPraseodymiumNeodymiumPromethiumSamariumEuropiumGadoliniumTerbiumDysprosiumHolmiumErbiumThuliumYtterbiumLutetiumHafniumTantalumTungstenRheniumOsmiumIridiumPlatinumGoldMercury (element)ThalliumLeadBismuthPoloniumAstatineRadon
FranciumRadiumActiniumThoriumProtactiniumUraniumNeptuniumPlutoniumAmericiumCuriumBerkeliumCaliforniumEinsteiniumFermiumMendeleviumNobeliumLawrenciumRutherfordiumDubniumSeaborgiumBohriumHassiumMeitneriumDarmstadtiumRoentgeniumCoperniciumUnuntriumFleroviumUnunpentiumLivermoriumUnunseptiumUnunoctium
Ni

Pd

Pt
రోడియంపల్లాడియంవెండి
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 5
Block  d-block
Electron configuration[Kr] 4d10
Electrons per shell2, 8, 18, 18
Physical properties
Phase at STPsolid
Melting point1828.05 K ​(1554.9 °C, ​2830.82 °F)
Boiling point3236 K ​(2963 °C, ​5365 °F)
Density (near r.t.)12.023 g/cm3
when liquid (at m.p.)10.38 g/cm3
Heat of fusion16.74 kJ/mol
Heat of vaporization362 kJ/mol
Molar heat capacity25.98 J/(mol·K)
Vapor pressure
P (Pa)1101001 k10 k100 k
at T (K)172118972117239527533234
Atomic properties
Oxidation states0, +1, +2, +3, +4, +5[3] (a mildly basic oxide)
ElectronegativityPauling scale: 2.20
Atomic radiusempirical: 137 pm
Covalent radius139±6 pm
Van der Waals radius163 pm
Color lines in a spectral range
Spectral lines of పల్లాడియం
Other properties
Natural occurrenceprimordial
Crystal structure ​face-centered cubic (fcc)
Face-centered cubic crystal structure for పల్లాడియం
Speed of sound thin rod3070 m/s (at 20 °C)
Thermal expansion11.8 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity71.8 W/(m⋅K)
Electrical resistivity105.4 n Ω⋅m (at 20 °C)
Magnetic orderingparamagnetic[4]
Young's modulus121 GPa
Shear modulus44 GPa
Bulk modulus180 GPa
Poisson ratio0.39
Mohs hardness4.75
Vickers hardness461 MPa
Brinell hardness310 MPa
CAS Number7440-05-3
History
DiscoveryWilliam Hyde Wollaston (1803)
First isolationWilliam Hyde Wollaston (1803)
Isotopes of పల్లాడియం
Template:infobox పల్లాడియం isotopes does not exist
 Category: పల్లాడియం
| references

పెల్లేడియం, దాని సహజాతి మూలకం అయిన ప్లేటినం, ఎక్కువగా కారుల నుండి బయటకి వచ్చే అపాన వాయువులని (అనగా, ఉదకర్బనాలు, కార్బన్ మోనాక్సైడ్‌, నైట్రొజన్‌ డైఆక్సైడ్‌) శుద్ధి చెయ్యడానికి వాడతారు. ఈ రెండు మూలకాల ఉత్పత్తిలో దరిదాపు 90 శాతం కెటాలిటిక్ కన్‌వర్టర్లు తయారీలోనే ఖర్చు అయిపోతుంది. పెల్లేడియంని వైద్యుత పరికరాల ఉత్పత్తిలోను, దంతవైద్యం లోనూ, ఉదజని వాయువుని శుద్ధి చెయ్యడానికి, భూజలాన్ని శుద్ధి చెయ్యడానికి, నగల తయారీలోను కూడా వాడతారు. పెల్లేడియంని ఇంధన ఘటాల (fuel cells) తయారీలో కూడా వాడతారు. ఇంధన ఘటాలు ఉదజనిని, ఆమ్లజనిని సంయోగపరచి విద్యుత్తుని, వేడిని పుట్టించి, నీటిని విడుదల చేస్తాయి.

ఈ జాతి ఖనిజాలు అరుదుగా దొరుకుతున్నాయి. దక్షిణ ఆఫ్రికా లోని ట్రాస్వాల్‌ రాష్ట్రంలోను, అమెరికాలో మొన్‌టానా రాష్ట్రంలోను, కెనడాలోని అంటారియో రాష్ట్రంలోను, రష్యాలోను కొన్ని భూగర్భ నిధులు ఉన్నాయి.

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు