నల్గొండ జిల్లా కథా రచయితలు

తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో నల్గొండ జిల్లా ఒకటి. నల్గొండ జిల్లా కథా రచయితలు చాలా మందే ఉన్నారు.

కథ ప్రాశస్త్యం

మానవ సమాజ చరిత్రలో కథ ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాతి యుగపు మనిషి సంజ్ఞలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది.

నల్గొండ జిల్లాలో తెలుగు కథా ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో లాగానే నల్గొండ జిల్లాలో కూడా తెలుగు కథకులు ఉద్భవించారు. తెలంగాణ విముక్తి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న నల్గొండ న్యాయవాది బోయినపల్లి రంగారావు ‘వారంరోజుల అవస్థ’ ఇంకా మరెన్నో కథలు రచించాడు. అలాగే వాసి ధరణికోట శ్రీనివాసులు ‘నీలగిరి సాహిత్య సమితి’ స్థాపించి తన కథల్లో తెలంగాణ ప్రజల జీవనపోరాటాన్ని వివరించాడు. ‘చల్లపులుసు’, ‘అన్నంలోకి’, ‘కనకం’ మరిన్ని కథలతో కథా సంపుటాలు వెలువరించాడు. ముక్తవరం పార్ధసారథి భార్యాభర్తల అనురాగబంధాన్ని హృద్యంగా చిత్రిస్తూ ‘ఎర్రనిదీపం’తోపాటు మరిన్ని కథలు రాశాడు. నల్గొండ కథకులు ధరణికోట శ్రీనివాసు కథల గురించి ఆచార్య దివాకర్ల వెంకటావధాని తమ ‘ఆంధ్ర వాఙ్మయచరిత్ర’లో ప్రస్తావించారు. మేరెడ్డి యాదగిరిరెడ్డి రాసిన కథల్లో చదివించే గుణముంది. ఇతని ‘కొలిమి’ కథలో వడ్రంగివారి బతుకువెతలు దర్శనమిస్తాయి.బోయజంగయ్య చీమలు కథలో పాము సైతం చీమలు దండుతో చస్తుందనే నీతి ఉంది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 20 మంది పైగా కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో ఎంతో మంది కథారచయితలుగా రాణిస్తున్నారు.

శ్రీధర్ బాబు పసునూరు
జయధీర్ తిరుమలరావు
శీలం భద్రయ్య

నల్గొండ జిల్లా తెలుగు కథా రచయితల జాబితా

ఈ క్రింది జాబితాలో నల్గొండ జిల్లా కథకుల వివరాలు క్రోడీకరించబడ్డాయి. [1]

రచయిత పేరుప్రస్తుత నివాస స్థలంపుట్టిన సంవత్సరంకలం పేరుపుట్టిన ఊరు
అజ్మతుల్లాదేవరకొండ
నూతలపాటి గంగాధరంచిత్తూరునల్గొండ
బోధనం నర్సిరెడ్డినల్గొండ04 జూలై, 1958నల్గొండభూతం ముత్యాలునల్గొండ10 జూన్,1971భూతం ముత్యాలుతిర్మలగిరి (గ్రామం), నాంపల్లి (మండలం), నల్గొండ జిల్లాపెదకోట్ల చిన్నయ్యనల్గొండ1965 అక్టోబరు 10చిన్నభువనగిరి
దొడ్డి రామ్మూర్తినల్గొండ1968 ఆగస్టు 20దీపకుంట, ఊకొండి
దేవులపల్లి శ్యాంసుందరరావుఖమ్మం1949 అక్టోబరు 23సూర్యాపేట
దయాల కల్పనహైదరాబాద్1977 ఏప్రిల్ 04డి. కల్పనపోచంపల్లి
ఎలికట్టె శంకర్ రావునల్గొండ1968 ఏప్రిల్ 13R. ఎర్రగూడెం, నిడమానూరు మండలం
గుడిపూడి సుబ్బారావునల్గొండ1936 నవంబరు 12అన్నవరగూడెం, మోతె మండలం
గుడిపాటి వెంకటేశ్వర్లుహైదరాబాద్1964 జనవరి 08శశాంక, ప్రణవ, అభిషేక్, కిరణ్సూర్యాపేట
బోయినపల్లి రంగారావు
వాసి ధరణికోట శ్రీనివాసులు
ముక్తవరం పార్ధసారథి
ధరణికోట శ్రీనివాసు
మేరెడ్డి యాదగిరిరెడ్డి
బోయజంగయ్య
కొండపల్లి వెంకట శేషగిరిరావు
గౌసు మొహియుద్దీన్
పసునూరు శ్రీధర్ బాబుహైదరాబాద్1969 జూలై 21మోతుకూరు
దేవరాజు రవి
జయధీర్ తిరుమలరావు
శీలం భద్రయ్యనల్గొండ పట్టణం1980 డిసెంబర్ 24శీలం భద్రయ్యఅన్నారం(టి), తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా

ఇవి కూడా చూడండి

మూలాల జాబితా

వెలుపలి లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు