వరంగల్ జిల్లా కథా రచయితలు

తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం

ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో వరంగల్ జిల్లా ఒకటి. వరంగల్ జిల్లా కథా రచయితలు చాలా మందే ఉన్నారు.

కథ ప్రాశస్త్యం

మానవ సమాజ చరిత్రలో కథ ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాతి యుగపు మనిషి సంజ్ఞలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది.

వరంగల్ జిల్లాలో తెలుగు కథా ప్రక్రియ

ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో లాగానే వరంగల్ జిల్లాలో కూడా తెలుగు కథకులు ఉద్భవించారు. వరంగల్ జిల్లాలో పుట్టి అక్కడే పెరిగి, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న కథా రచయితలు అంపశయ్య నవీన్, కోవెల సుప్రసన్నాచార్యులు, బుర్ర రాములు, రామా చంద్రమౌళి మొదలైనవారు కాగా, వరాంగల్ జిల్లాలో పుట్టి, కొంతకాలం అక్కడే ఉండి వివిధ కారణాలతో వేరే ప్రాంతానికి వెళ్ళి స్థిరపడ్డవారు దాశరధి రంగాచార్యులు, దాశరధి కృష్ణమాచార్యులు, తుమ్మేటి రఘోత్తం రెడ్డి, పేర్వారం రాములు, జైపాల్ రెడ్డి, ప్రొ. ననుమాసస్వామి మొదలైన కథా రచయితలు కనబడుతారు.[1] ఈ జిల్లాలో నుండి వచ్చిన కథలలో చాలావరకు సాయుధ పోరాటాన్ని, తెలంగాణ సాధన ఉద్యమాన్ని, రైతాంగ జీవితాన్ని, తెలంగాణ ప్రాంతంలోని భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లోని సమస్యలని స్పృశిస్తూ నడుస్తాయి. డా. వేలూరి శ్రీదేవి వరంగల్ జిల్లాలో పుట్టిన కథా ప్రక్రియను విశ్లేషిస్తూ ఇక్కడ " పుట్టిన కథ నిత్య నూతనం , నవ యవ్వనం , ఎందరికో ప్రేరణ . బాధితుల ఆర్తనాదాలు , దుర్మార్గుల దౌష్ట్యాలు, విప్లవ రక్తాక్షరాలు, తేట తెలుగు హృదయాల స్వచ్చతా పరిమళాలు, బోసినవ్వుల పాపాయిల నుండి, కరుడు గట్టిన నియంతల పాశవిక చర్యల వరకు, కులం కుళ్ళును, మతం మత్తును…. ఇలా ఒకటేమిటి సమస్తాంశాలను వరంగల్ జిల్లా కథ నింపుకుని రాబోయే కొత్త రచయితలకు ప్రేరణగా నిలుస్తూ ముందుకు సాగుతూనే ఉంది" అని అభివర్ణించారు.[1]

వరంగల్ జిల్లాలో జన్మించిన తెలుగు కథా రచయితల జాబితా

దాశరథి రంగాచార్య

ఈ క్రింది జాబితాలో వరంగల్ జిల్లాకథకుల వివరాలుక్రోఢీకరించబడ్డాయి[1][2][3]

రచయిత పేరుప్రస్తుత నివాసంకలం పేరుపుట్టిన సంవత్సరంపుట్టిన ఊరు
అన్వర్ పాషావరంగల్అన్వర్02.06.1969శివనగర్, వరంగల్
బుర్రా రాములుగౌడ1954 జూన్ 10ఓరుగల్లు కోట, వరంగల్
బొడ్డు శ్రీశైలంహైదరాబాద్కృష్ణశ్రీ, ప్రభ1939 జనవరి 01రాఘవాపూర్
మైదం చంద్రశేఖర్హైదరాబాద్చంద్ర, అశ్వని, ఎమ్వీ శేఖర్, విజయభార్గవి, భార్గవీచంద్ర1946 ఆగస్టు 25వరంగల్
చల్లా జైపాల్ రెడ్డివరంగల్1961 ఆగస్టు 15తాటికొండ
దేవరాజు మహారాజుహైదరాబాద్1951 ఫిబ్రవరి 21వరంగల్
దార్ల రామచంద్రంవరంగల్1960 నవంబరు 15గొల్లచర్ల, డోర్నకల్ మండలం
గన్ను కృష్ణమూర్తిమెదక్ఎక్స్ రే, ప్రభంజనం, యుగంధర్, భారతి1945 సెప్టెంబరు 02నెక్కొండ
ప్రొ. ననుమాస స్వామి
పేర్వారం రాములు
తుమ్మేటి రఘోత్తమరెడ్డి
దాశరధి కృష్ణమాచార్యులు
దాశరధి రంగాచార్యులు
అంపశయ్య నవీన్
కోవెల సుప్రసన్నాచార్య
రామా చంద్రమౌళి
సదానంద్ శారద
అడ్లూరి అయోధ్యరామకవి
కాళోజీ
కోవెల సంపత్కుమారాచార్య
జయధీర్ తిరుమలరావు
దేవులపల్లి రామానుజారావు
అంపశయ్య నవీన్
విజయార్కె
దాస్యం లక్ష్మయ్య
సముద్రాల లక్ష్మి నర్సయ్య
సయ్యద్ ఖుర్షీద్
టి.శ్రీరంగస్వామి
ఎస్. శ్రీదేవి
వడ్డేబోయిన శ్రీనివాస్
వంగా నర్సయ్య
మెట్టు మురళీధర రావు
మెండు ఉమా మాహేశ్వర్ రావు
మహేశ్వరం రత్నాకర్ రావు
మద్దెర్ల రమేష్
బి.పద్మజ
డా. పసునూరి రవీందర్శివ‌న‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌
పల్లె నాగేశ్వరరావుహనుమకొండ

ఇవి కూడా చూడండి

మూలాల జాబితా

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు