పోరస్

పోరస్ (పురుషోత్తముడు) ప్రాచీన భారతదేశానికి చెందిన ఒక రాజు. "పురుషోత్తమ" ఇతడి అసలు పేరు. గ్రీకుల యాసలో "పురుషోత్తమ" అనే పేరు "పోరస్" గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం పంజాబ్లో ఉన్న జీలం, చీనాబ్ అనే నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా గ్రీకు రచనల ద్వారా తెలుస్తుంది. ఇతను అలెగ్జాండర్ చక్రవర్తితో యుద్ధంలో పోరాడి అతన్ని మెప్పించి తన రాజ్యాన్ని తిరిగి పొందడమే కాకుండా మరిన్ని ప్రాంతాలను బహుమతిగా పొందాడు.[1][2] క్రీ.పూ 323 లో అలెగ్జాండర్ మరణించిన తరువాత అతని సైన్యాధికారి యూడెమస్ క్రీ.పూ 321, 315 మధ్య పోరస్ ను హత్య చేశాడు.[3]

ఇతన్ని గురించిన సమాచారం కేవలం గ్రీకు రచనల ద్వారానే లభ్యమౌతుంది. కానీ చరిత్రకారులు మాత్రం ఇతని పేరును బట్టి అతని పరిపాలిస్తున్న ప్రాంతాన్ని బట్టి ఋగ్వేదంలో ప్రస్తావించిన పురువంశానికి చెందిన రాజుగా భావిస్తున్నారు.[4][5]ఈశ్వరీ ప్రసాద్ అనే చరిత్రకారుడు మాత్రం పోరస్ యదువంశానికి చెందిన పాలకుడై ఉండవచ్చునని భావించాడు. పోరస్ సైన్యంలో ముందు వరస వారి దగ్గర ఉన్న జెండాలపై ఉన్న చిత్రాలు (హెరాకిల్స్) మధుర పాలకుల చిత్రాలను పోలి ఉన్నాయని అతని వాదన. పోరస్ తరువాత వచ్చిన చంద్రగుప్తుని కాలంలో భారతదేశంలో పర్యటించిన మెగస్తనీసు తన రచనల్లో ఇలాంటి బొమ్మలు మధుర రాజ్య పాలకులకు చెందినవిగా వర్ణించాడు.[6][7][8][9]

పోరస్ గజసైన్యం, 16వ శతాబ్దానికి చెందిన జర్మనీ చిత్రం

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు