మోంటే అగుల

మోంటే అగుల ("గ్రద్ద పర్వతం" అని అర్థం) చిలీ దేశపు బయో ప్రాంతం లోని గ్రామం. దీని జనాభా 6,574..[1] [2] [3] 2002 లో దీని జనాభా 6,090. [4] ఈ పట్టణ ప్రజలలో ఎక్కువ భాగం వ్యవసాయం మీద ఆధారపడిన వారే. [5] లేదా సమీప నగరాల్లో, ముఖ్యంగా లాస్ ఏంజిల్స్ లోను, ప్రాంతీయ రాజధాని కాన్సెప్సియన్లలోనూ ఉద్యోగాలు చేస్తూంటారు. ప్రస్తుతం, ఇక్కడి రైల్వే పరిశ్రమ వాడుకలో లేదు. దానికి సంబంధించిన నిర్మాణాలను చాలా వరకూ వదలివేసారు. ఎందుకంటే అవి ఎంప్రెసా డి లాస్ ఫెర్రోకారిల్స్ డెల్ ఎస్టాడో యాజమాన్యంలో ఉన్నాయి. దీనివలన కాబ్రెరో మునిసిపాలిటీ గానీ లేదా ఏదైనా ప్రైవేట్ సంస్థ గానీ ఈ నిర్మాణాలను స్వాధీనం చేసుకునే వీలు లేకుండా పోయింది. ఇటీవల దీనిని కచేరీ వేదికగా, పిల్లలకు ఆటస్థలంగా మార్చారు. [6].

విద్య

  • మోంటే ఆగులాలో కింది పాఠశాలలు ఉన్నాయి.
  • "ఓర్లాండో వెరా విల్లారోయెల్" ఎలిమెంటరీ స్కూల్.
  • "ఆస్కార్ బోనిల్లా బ్రాడనోవిక్" హై స్కూల్.
  • "మోంటే అగుయిలా కాలేజ్" ఎలిమెంటరీ స్కూల్.
  • "అబెల్ ఇనోస్ట్రోజా గుటియ్రేజ్" ఎలిమెంటరీ స్కూల్.
  • "ఎస్పెరంజా" ఎలిమెంటరీ స్కూల్.

ప్రముఖులు

ఈ పట్టణానికి చెందిన ప్రముఖుల జాబితా ఇలా ఉంది

  • జోస్ సెపల్వేడా, "ఎల్ మాంటెగ్యులినో", చిలీ జానపద రచయిత.
  • ఎడ్గార్డో అబ్దాలా, మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, ప్రస్తుత పాలస్తీనా-చిలీ కోచ్.
  • చిలీ జాతీయ ఫుట్‌బాల్ జట్టుతో అంతర్జాతీయంగా ఆడిన మాజీ చిలీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లూయిస్ చావారియా .
  • రౌల్ కేసెస్ టోర్రెస్, చిలీ చిత్రకారుడు, రాజకీయవేత్త, చరిత్రకారుడు. [7]
  • అన్వర్ ఫర్రాన్ వెలోసో, చిలీ టెలివిజన్ జర్నలిస్ట్. అతను టీవీఎన్ మెగా నెట్‌వర్క్‌ల కోసం పనిచేశాడు.
  • ఎన్రిక్ ఎడ్వర్డ్స్ ఒరెగో (), చిలీ వ్యాపారవేత్త, రాజకీయవేత్త. [8]

చిత్ర మాలిక

.

మూలాలు

బాహ్య లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు